E-Paper
Advertisement

Straightener: హెయిర్ స్ట్రెయిట్‌నర్ వాడుతున్నారా ? ఈ సైడ్ ఎఫెక్ట్స్ గురించి మీకు తెలుసా ?

Straightener: హెయిర్ స్ట్రెయిట్‌నర్ వాడుతున్నారా ? ఈ సైడ్ ఎఫెక్ట్స్ గురించి మీకు తెలుసా ?
Advertisement

Straightener: అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది. అందుకే వేసుకునే బట్టల నుంచి మేకప్ వరకు ప్రతి దానిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఇదిలా ఉంటే చాలా మంది జుట్టును స్టైల్ చేస్తారు. ట్రెండ్స్ గురించి చెప్పాలంటే.. స్ట్రెయిట్ హెయిర్ ఈ రోజుల్లో ట్రెండ్. కాబట్టి ప్రతి అమ్మాయి అందమైన, సిల్కీ , స్ట్రెయిట్ హెయిర్ కోసం  స్ట్రెయిట్నర్‌ను ఉపయోగిస్తారు. ఇది తక్షణ రూపాన్ని అందిస్తున్నప్పటికీ.. ప్రతి రోజూ లేదా క్రమం తప్పకుండా స్ట్రెయిట్నర్ ఉపయోగించడం వల్ల మీ జుట్టుకు హాని కలుగుతుంది. సరైన అవగాహన లేదా రక్షణ లేకుండా స్ట్రెయిట్ చేయడం వల్ల తీవ్రమైన నష్టం జరుగుతుంది. తరచూ స్ట్రెయిట్నర్ ఉపయోగించడం వల్ల ఎదురయ్యే సమస్యలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

రోజూ హెయిర్ స్ట్రెయిటనింగ్ వాడటం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్:

Advertisement

జుట్టు పొడిబారడం పెరుగుతుంది:
హీటింగ్ టూల్స్ జుట్టులోని సహజ తేమను తొలగించి.. నిస్తేజంగా, పొడిగా మారుస్తాయి. అందుకే.. నిపుణులు తరచూ హెయిర్ స్ట్రెయిట్నర్‌లను ఉపయోగించకూడదని సలహా ఇస్తారు. జుట్టు పొడిగా మారినప్పుడు.. అది వికారంగా కూడా కనిపిస్తుంది. కాబట్టి.. వాటిని ప్రతిరోజూ వాడకుండా ఉండండి.

జుట్టు రాలడం పెరుగుతుంది:
ప్రతిరోజూ స్ట్రెయిట్నర్ వాడటం వల్ల మీ జుట్టు మూలాలు బలహీనపడతాయి. ఈ బలహీనమైన జుట్టు మూలాలు క్రమంగా జుట్టు రాలడానికి దారితీస్తాయి. ఇది తరచుగా చివరలు చిట్లడం వంటి సమస్యకు దారితీస్తుంది. ఫలితంగా మీ జుట్టు మరింత నిర్జీవంగా కనిపిస్తుంది.

Advertisement

తల చర్మంపై ప్రభావం:
స్ట్రెయిట్నర్ కూడా వేడి చేసే సాధనం. పదే పదే వేడికి గురికావడం వల్ల తలపై చికాకు ఏర్పడుతుంది. దీని వల్ల చుండ్రు, దురద వంటివి వస్తాయి. కొన్నిసార్లు, ఈ సమస్యలు చాలా తీవ్రంగా మారతాయి. ఇలాంటి సమయంలో మీరు డాక్టర్ ని కూడా సంప్రదించాల్సి ఉంటుంది.

జుట్టు రంగు పోతుంది:

మీరు కలర్ లేదా డై వాడితే.. హెయిర్ స్ట్రెయిట్నర్లు మీ జుట్టు రంగును కోల్పోయేలా చేస్తాయి. క్రమం తప్పకుండా వాడటం వల్ల జుట్టు రంగు వేగంగా మసక బారుతుంది. ఇది మీ జుట్టు యొక్క సహజ ఆకృతిని దెబ్బతీస్తుంది. అంతే కాకుండా మీ జుట్టు యొక్క సహజ రంగును కూడా దెబ్బతీస్తుంది.

జుట్టును ఎలా రక్షించుకోవాలి ?

స్ట్రెయిట్ చేసే ముందు ప్రతిసారీ హీట్ ప్రొటెక్టెంట్ స్ప్రే వాడండి.
వారానికి రెండుసార్లు మీ జుట్టును డీప్ కండిషనర్ చేయండి.
మీ జుట్టును సహజంగా ఆరనివ్వండి.
వారానికి 1-2 సార్లు కంటే ఎక్కువ హెయిర్ స్ట్రెయిట్నర్‌ని ఉపయోగించకూడదు.

 

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×