E-Paper
Advertisement

Instagram 100 Million: ఇన్‌స్టాగ్రామ్‌లో 10 కోట్ల మంది ఫాలోవర్స్‌‌తో ఎంత సంపాదన వస్తుంది? ఇలా లెక్కించాలి

Instagram 100 Million: ఇన్‌స్టాగ్రామ్‌లో 10 కోట్ల మంది ఫాలోవర్స్‌‌తో ఎంత సంపాదన వస్తుంది? ఇలా లెక్కించాలి
Advertisement

Instagram 100 Million Followers| ఈ రోజుల్లో సోషల్ మీడియా కేవలం వినోదం, స్నేహితులతో చాటింగ్ కోసమే కాదు. సోషల్ మీడియా ద్వారా గుర్తింపు (ఫేమ్), ఆదాయం కూడా పొందవచ్చు. అందుకే చాలా మంది కంటెంట్ క్రియేటర్లు.. సోషల్ మీడియాని పూర్తి స్థాయి వృత్తిగా ఎంచుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్, యుట్యూబ్ లాంటి ప్లాట్‌ఫామ్స్ ఇప్పుడు అతిపెద్ద ఆదాయ మార్గాలుగా మారాయి.

ఈ క్రమంలో యుట్యూబ్‌లో ఎంత మంది సబ్‌స్క్రైబర్లు ఉంటే ఎంత సంపాదించవచ్చు?, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంత మంది ఫాలోవర్స్ ఉంటే సంపాదన ఎంత వస్తుంది? అనే ప్రశ్నలు అందరికీ కలుగుతాయి. ఇప్పుడు 100 మిలియన్ (10 కోట్లు) ఫాలోవర్స్ ఉంటే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఎంత సంపాదించవచ్చనేది చూద్దాం. ఒక్క పోస్ట్‌తో కోట్ల రూపాయలు నిజంగానే వస్తాయా? అనేది చూద్దాం. దీనికి సమాధానం చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది.

ఫాలోవర్స్ కంటే ఎంగేజ్‌మెంట్ ముఖ్యం

Advertisement

ఫాలోవర్ల సంఖ్య మాత్రమే ఆదాయాన్ని నిర్ణయించదు. బ్రాండ్లు ఎంగేజ్‌మెంట్‌ను బాగా చూస్తాయి. లైక్స్, కామెంట్స్, షేర్లు, వ్యూస్ ఎంత ఉన్నాయో చూస్తాయి. ఆడియన్స్ ఎంత యాక్టివ్‌గా, లాయల్‌గా ఉందో తెలుస్తుంది. ఎంగేజ్‌మెంట్ బలంగా ఉంటే ఆదాయం ఎక్కువ అవుతుంది. ఎంగేజ్‌మెంట్ తక్కువ ఉంటే బ్రాండ్లు తక్కువ చెల్లిస్తాయి. నిజమైన ఇంటరాక్షన్ ఉన్న ఖాతాలకు ప్రీమియం బ్రాండ్లు ఆకర్షితులవుతాయి. 100 మిలియన్ ఎంగేజ్డ్ ఫాలోవర్లు ఉంటే ఒక స్పాన్సర్డ్ పోస్ట్‌కు రూ.5 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు వసూలు చేయవచ్చు. ఆడియన్స్ లొకేషన్, బ్రాండ్ విలువ ఆధారంగా ఈ ఫీజు మారుతుంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రధాన ఆదాయ మార్గాలు

ఫాలోవర్స్ భారీ సంఖ్యలో ఉన్న పెద్ద అకౌంట్లు.. స్పాన్సర్డ్ పోస్ట్‌ల ద్వారానే కాకుండా ఆదాయాన్ని వివిధ మార్గాల్లో పొందుతాయి.

  • బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, పెయిడ్ ప్రమోషన్స్: పోస్ట్‌లు, స్టోరీలు, రీల్స్ ద్వారా ప్రొడక్ట్‌లను ప్రమోట్ చేయాలి. టాప్ సెలబ్రిటీలు ఇలా చేయడానికి చాలా ఎక్కువ ఫీజు తీసుకుంటారు.
  • రీల్స్, వీడియో యాడ్ రెవెన్యూ: వీడియోలు ఎక్కువ వ్యూస్ వస్తే యాడ్ ఆదాయం పెరుగుతుంది.
  • అఫిలియేట్ మార్కెటింగ్: ప్రొడక్ట్ లింక్‌లు షేర్ చేసి కమిషన్ సంపాదిస్తారు. పర్చేస్ అయితే మాత్రమే డబ్బు వస్తుంది.
  • సొంత ప్రొడక్ట్‌ల సేల్స్: కొందరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉన్న వారు స్వతహాగా.. క్లోథింగ్, బ్యూటీ, ఫిట్‌నెస్ బ్రాండ్‌లు లాంచ్ చేసి విక్రయిస్తున్నారు. డిజిటల్ కోర్సులు కూడా అమ్ముతారు.
  • పెయిడ్ సబ్‌స్క్రిప్షన్స్: ఎక్స్‌క్లూసివ్ కంటెంట్ కోసం సబ్‌స్క్రైబర్లు నెలవారీ డబ్బు చెల్లిస్తారు.
Advertisement

ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్ ఫాలోవర్స్ ఉంటే సంవత్సరానికి వందల కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. అంతర్జాతీయ ఆడియన్స్ ఉంటే బ్రాండ్ డీల్స్, కరెన్సీ విలువతో కలిపి ఆదాయం భారీగానే ఉంటుంది.

సెలబ్రిటీలు vs సాధారణ క్రియేటర్లు

ఇన్‌స్టాగ్రామ్‌లో సాధారణ క్రియేటర్ల కంటే సెలబ్రిటీలు ఎక్కువ సంపాదిస్తారు. నటులు, క్రీడాకారులు, గ్లోబల్ ఐకాన్లు (పాంప్ సింగర్స్, పాపులర్ నటలు) యాడ్స్ చేయడానికి ఒక్కో కంపెనీ నుంచి ప్రీమియం రేట్లు వసూలు చేస్తారు. ఉదాహరణకు క్రిస్టియానో రొనాల్డో ఒక్క పోస్ట్‌కు మిలియన్ల డాలర్లు సంపాదిస్తాడు. ఇండియాలో సినిమా స్టార్లు, క్రికెటర్లు కూడా భారీగా సంపాదిస్తారు. వారి పాపులారిటీ, బ్రాండ్ ట్రస్ట్ ఎక్కువ. సాధారణ క్రియేటర్లు కూడా భారీగా సంపాదించవచ్చు. కానీ కంటెంట్ క్వాలిటీ, ఆథెంటిసిటీ మెయింటైన్ చేయాలి.

Also Read: టెక్ రంగంలో గేమ్ ఛేంజర్ .. పేకముక్క లాంటి సన్నని బ్యాటరీ.. భారీ కెపాసిటీ

ఫాలోవర్లు మాత్రమే ఉంటే సరిపోదు

100 మిలియన్ ఫాలోవర్లు రీచ్ చేయడం పెద్ద విజయమే.. కానీ ఆదాయం క్రెడిబిలిటీ, కంటెంట్ క్వాలిటీపై ఆధారపడి ఉంటుంది. ఫేక్ ఫాలోవర్లు ఉంటే దీర్ఘకాలిక ఆదాయం తగ్గుతుంది. బ్రాండెడ్ కంపెనీలు ఇన్‌స్టాగ్రామ్‌లో రియల్ ఫాలోవర్స్, ఆథెంటిసిటీని పరిశీలిస్తాయి. దీర్ఘకాలిక విజయానికి నమ్మకం చాలా ముఖ్యం. నిజమైన విలువ ఇచ్చే క్రియేటర్లకు ఆడియన్స్ సపోర్ట్ చేస్తుంది. మంచి స్టోరీటెల్లింగ్, క్రియేటివిటీ రిపీట్ కొలాబరేషన్స్ తెచ్చిపెడతాయి. సరైన స్ట్రాటజీతో ఇన్‌స్టాగ్రామ్ సంపాదన కోసం ఒక బంగారు గని లాంటిది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×