E-Paper
Advertisement

Rs600 Cr Website Domain: వెబ్‌సైట్ డొమైన్ ధర రూ.600 కోట్లు.. వెంటనే కొనుగోలు చేసిన బడా వ్యాపారవేత్త

Rs600 Cr Website Domain: వెబ్‌సైట్ డొమైన్ ధర రూ.600 కోట్లు.. వెంటనే కొనుగోలు చేసిన బడా వ్యాపారవేత్త
Advertisement

Rs600 Cr Website Domain| ఇంటర్నెట్‌లో వెబ్‌సైట్ అడ్రస్ అంటే డొమైన్ చాలా విలువైనది. వెబ్‌సైబ్ డొమైన్ ట్రెండింగ్ లేదా డిమాండ్ ఉన్న బిజినెస్‌కు చెందినదైతే దాని ధర లక్షలు కోట్లు పలుకుతుంది. తాజాగా అలాంటి ఒక డొమైన్ షాకింగ్ ధరకు విక్రయించబడింది. వందల కోట్ల ధరకు ఆ డొమైన్‌ని ఒక కంపెనీ యజమాని కొనుగోలు చేశాడు.

క్రిప్టో.కామ్ వ్యవస్థాపకుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డొమైన్ AI.comని దాదాపు 70 మిలియన్ డాలర్లకు (భారత కరెన్సీలో సుమారు రూ.600 కోట్లు) కొన్నాడు. ఇది ఇప్పటివరకు పబ్లిక్‌గా తెలిసిన అత్యధిక డొమైన్ సేల్‌గా నిలిచింది. క్రిప్టో.కామ్ సీఈవో క్రిస్ మార్స్‌జాలెక్. ఆయన AI ఇండస్ట్రీలోకి పూర్తిగా ఎంటర్ అవ్వాలని నిర్ణయించాడు. సూపర్ బౌల్ ప్రకటన సమయంలో AI.comని అధికారికంగా లాంచ్ చేయనున్నాడు. ఈ వెబ్‌సైట్‌లో పర్సనల్ AI అసిస్టెంట్ లాంచ్ అవుతుంది. ఈ అసిస్టెంట్ మెసేజ్‌లు పంపడం, యాప్‌లు మేనేజ్ చేయడం, స్టాక్ ట్రేడింగ్ చేయడం వంటివి చేస్తుంది.

AI.com ఎందుకు కొనుగోలు చేశాడు?

Advertisement

క్రిస్ మార్స్‌జాలెక్ దీర్ఘకాలిక దృష్టితో ఈ డొమైన్ కొన్నాడు. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో ఆధిపత్యం చెలాయిస్తుందని ఆయన నమ్ముతున్నాడు. ముందు 10-20 సంవత్సరాల్లో భారీ వృద్ధి ఉంటుందని చెప్పాడు. ఇది స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్ అని అన్నాడు. ప్రీమియం డొమైన్లు బ్రాండ్ విలువను పెంచుతాయని, AI.comపై పూర్తి నియంత్రణ ఉండాలని ఆయన భావించాడు. ధరను ఆయన అధికారికంగా ధృవీకరించలేదు. కానీ డొమైన్ బ్రోకర్ ల్యారీ ఫిషర్ ఈ ట్రాన్సాక్షన్ 70 మిలియన్ డాలర్లకు జరిగిందని నిర్ధారించాడు. క్రిప్టోకరెన్సీ ద్వారా పూర్తి చెల్లింపు జరిగింది. సెల్లర్ గుర్తింపు బయటపడలేదు.

వేగంగా సక్సెస్ అయిన క్రిప్టో.కామ్ 

క్రిస్ మార్స్‌జాలెక్ 2016లో క్రిప్టో.కామ్‌ను ప్రారంభించాడు. అప్పటికే మార్కెట్‌లో చాలా క్రిప్టో ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. అయినప్పటికీ కంపెనీ వేగంగా ఎదిగింది. ప్రస్తుతం సంవత్సరానికి సుమారు 1.5 బిలియన్ డాలర్ల ఆదాయం వస్తోంది. మార్కెటింగ్, బ్రాండింగ్‌పై భారీగా ఇన్వెస్ట్ చేసింది. స్పోర్ట్స్ స్పాన్సర్‌షిప్‌లు, సెలబ్రిటీ పార్ట్‌నర్‌షిప్‌లు చేసింది. 2021లో స్టేడియం నేమింగ్ డీల్‌పై సుమారు 700 మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. ట్రంప్ మీడియాతో బిజినెస్ డీల్స్ కూడా చేసింది. ఇవన్నీ గ్లోబల్ బ్రాండ్ రికగ్నిషన్ పెంచాయి.

AI.com భవిష్యత్ ప్లాన్లు

Advertisement

క్రిస్ మార్స్‌జాలెక్ AI.comని నమ్మకమైన డిజిటల్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దాలనుకుంటున్నాడు. డొమైన్ తన దగ్గర ఉంటే బ్రాండ్ కమోడిటైజేషన్ అవ్వదని అన్నాడు. AI సర్వీస్‌లను తన ప్లాట్‌ఫాం‌తో అనుసంధానం చేయాలని చూస్తున్నాడు. సిలికాన్ వ్యాలీలోని OpenClaw వంటి AI ఏజెంట్లతో పోల్చాడు. తన వెర్షన్ సాధారణ యూజర్లకు సింపుల్‌గా ఉంటుందని చెప్పాడు. ప్రొడక్టివిటీ, ఆటోమేషన్‌పై దృష్టి పెడతాడు. AIని అందరికీ అందుబాటులోకి తీసుకొస్తాడు.

Also Read: ప్రకృతి నాశనం.. మనుషుల కంటే ఎక్కువ నీరు తాగేస్తున్న ఏఐ టెక్నాలజీ

రీసేల్ ఆఫర్లు తిరస్కరించిన సిఈఓ

చాలా మంది ఇన్వెస్టర్లు భారీ మొత్తాలు ఇచ్చి AI.com కొనాలని అడిగారు. కానీ మార్స్‌జాలెక్ అన్ని ఆఫర్లను తిరస్కరించాడు. డొమైన్ విలువ మరింత పెరుగుతుందని నమ్ముతున్నాడు. ఎమర్జింగ్ మార్కెట్లలో ట్రస్ట్, విజిబిలిటీ చాలా ముఖ్యమని అన్నాడు. AI.comని భవిష్యత్ సర్వీస్‌లకు గేట్‌వే చేయాలని చూస్తున్నాడు. క్రిప్టో.కామ్, AI.com రెండూ తన దగ్గర ఉండటం యూనిక్ అని చెప్పాడు.

AI.com కొనుగోలు డిజిటల్ రికార్డు సృష్టించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ఆసక్తి ఎంత పెరిగిందో చూపిస్తోంది. డొమైన్ బ్రాండింగ్ ఎంత విలువైనదో తెలియజేస్తోంది. మార్స్‌జాలెక్ చర్య AI మార్కెట్లలో పోటీ పెరిగిందని సంకేతం. సూపర్ బౌల్ లాంచ్‌తో మిలియన్ల మంది యూజర్లను ఆకర్షించవచ్చు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×