E-Paper
Advertisement

Brightest Phone Display: టూబ్‌లైట్ లాంటి మొబైల్.. 15000 నిట్స్‌తో ప్రపంచంలోనే అత్యంత బ్రైట్ డిస్‌ప్లే లాంచ్ చేసిన TCL

Brightest Phone Display: టూబ్‌లైట్ లాంటి మొబైల్.. 15000 నిట్స్‌తో ప్రపంచంలోనే అత్యంత బ్రైట్ డిస్‌ప్లే లాంచ్ చేసిన TCL
Advertisement

TCL Brightest Phone Display| మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2026లో చాలా టెక్ కంపెనీలు కొత్త కొత్త ఆవిష్కర్ణలు, టెక్నాలజీ ప్రొడక్ట్‌లు ప్రదర్శిస్తున్నాయి. అందులో TCL CSOT (టిసిఎల్ సిఎస్ఓటీ) కంపెనీ ప్రపంచంలోనే అత్యధిక బ్రైట్‌నెస్ ఉన్న OLED మొబైల్ డిస్‌ప్లే ప్రదర్శించింది. ఈ డిస్‌ప్లే 15,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఇస్తుంది. చాలామంది దీన్ని ట్యూబ్ లైట్‌తో పోల్చారు. మొబైల్ డిస్‌ప్లేలో ఇంత బ్రైట్‌నెస్ ఉండడం ప్రపంచ రికార్డ్.

ప్రపంచంలోనే అత్యధిక బ్రైట్‌నెస్ – 6.9 ఇంచ్ OLED ప్యానెల్

టిసిఎల్ ప్రదర్శించిన డిస్‌ప్లే 6.9 ఇంచ్ భారీ సైజులో ఉంది. పైగా ఇది OLED డిస్‌ప్లే. సూపర్ పిక్సెల్ డిజైన్ ఉపయోగించారు. చాలా స్పష్టమైన, షార్ప్ ఇమేజ్‌లు ఇస్తుంది. అధిక బ్రైట్‌నెస్ ఉన్నా తక్కువ పవర్ తీసుకుంటుంది. చాలా హై రిఫ్రెష్ రేట్‌లు సపోర్ట్ చేస్తుంది. భవిష్యత్ స్మార్ట్‌ఫోన్లలో ఇలాంటి డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది.

APEX ఫ్రేమ్‌వర్క్

Advertisement

ఈ డిస్‌ప్లేను APEX ఫ్రేమ్‌వర్క్‌లో భాగంగా తయారు చేశారు. ఈ ఫ్రేమ్‌వర్క్‌లో నాలుగు ముఖ్య భాగాలు ఉన్నాయి. అమేజింగ్, ప్రొటెక్టివ్, ఇకో ఫ్రెండ్లీ, X-అన్‌లిమిటెడ్. యూజర్లకు ఇవి మంచి ఎక్స్‌పీరియన్స్, భద్రత, పర్యావరణ సంరక్షణ, అపరిమిత ఆవిష్కరణల కోసం ఉపయోగపడతాయి.

A: అద్భుతమైన డిస్‌ప్లే ఎక్స్‌పీరియన్స్

15,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఇస్తుంది. PLP 4.0 టెక్నాలజీ, టాండమ్ స్ట్రక్చర్ ఉపయోగించారు. 1.5K రిజల్యూషన్‌తో బాగా ట్యూన్ చేశారు. బయట ఎండలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. HDR కంటెంట్ చాలా అద్భుతంగా ఉంటుంది.

P: కంటి ఆరోగ్యానికి నష్టం కలిగించదు

Advertisement

నేచురల్ లైట్ సర్టిఫైడ్ OLED డిస్‌ప్లే ఇచ్చారు. రెండో తరం సర్క్యులర్ పొలరైజర్ టెక్నాలజీ ఉంది. గ్లేర్ తగ్గుతుంది. ఎండలో కూడా స్క్రీన్ బాగా కనిపిస్తుంది. అక్షరాల రీడబిలిటీ మెరుగవుతుంది. 550nm వేవ్‌లెంగ్త్‌లో 95 శాతం ఎలిప్టిసిటీ ఉంది. పేపర్ లాంటి రీడింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. ఎక్కువ సేపు చదివినా కళ్లు అలసిపోవు.

E: పర్యావరణ హితమైన డిస్‌ప్లే

సాధారణ డిస్‌ప్లేతో పోలిస్తే కరెంట్ కూడా 45 శాతం వరకు తక్కువ వినియోగమవుతుంది. 1224*2992 పిక్సెల్ రిజల్యూషన్ ఉంది. 1Hz నుంచి 144Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఉంది. బ్యాటరీ ఎక్కువ కాలం పనిచేస్తుంది. ఇది పర్యావరణ సంరక్షణకు సహాయపడుతుంది.

X: అపరిమిత ఆవిష్కరణ కెపాసిటీ

ప్రపంచంలోనే అతి చిన్న S-Micro LED డిస్‌ప్లే కూడా ప్రదర్శించారు. ఈ డిస్‌ప్లే AR గ్లాసెస్ కోసం రూపొందించారు. 256*86 రిజల్యూషన్ ఉంది. లో-పవర్ CMOS బ్యాక్‌ప్లేన్ ఉంది. వేరబుల్ డివైస్‌లలో బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది. AR ప్రొడక్ట్‌లకు కొత్త అవకాశాలు తెరుస్తుంది.

Also Read: ఒక్క రోజులోనే ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ పెరిగిపోతారు.. యాడ్స్ అవసరం లేదు.. ఎలాగంటే

భవిష్యత్ స్మార్ట్‌ఫోన్‌లపై ప్రభావం

15,000 నిట్స్ బ్రైట్‌నెస్ ఇచ్చే మొబైల్ డిస్‌ప్లే ఇండస్ట్రీ స్టాండర్డ్‌లను మారుస్తుంది. భవిష్యత్ ఫోన్లు మరింత బ్రైట్, ఎఫిషియెంట్ డిస్‌ప్లేలతో వస్తాయి. కంపెనీల మధ్య పోటీ పెరుగుతుంది. వినియోగదారులకు షార్ప్ విజువల్స్‌తో పాటు మంచి బ్యాటరీ లైఫ్ ఇస్తుంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×