E-Paper
Advertisement

Smart TV Offers: రూ.12 వేలకే 32 ఇంచుల TCL స్మార్ట్ టీవీ.. ఆఫర్ అయ్యేలోపే కొనేయండి భయ్యా!

Smart TV Offers: రూ.12 వేలకే 32 ఇంచుల TCL స్మార్ట్ టీవీ.. ఆఫర్ అయ్యేలోపే కొనేయండి భయ్యా!
Advertisement

Smart TV Offers: సాధారణంగా బిగ్ స్క్రీన్‌ QLED స్మార్ట్ టీవీలు కొనడం మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భారమనే చెప్పాలి. ఎందుకంటే క్యూలెడ్ టెక్నాలజీ అనగానే లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అందుకే చాలామంది ఇలాంటి టీవీలను కొనడానికి ఆసక్తి చూపించరు. కానీ ప్రముఖ TCL సంస్థ సామాన్యులకు సైతం ఈ అద్భుతమైన టెక్నాలజీని చాలా తక్కువ ధరకే అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం విజయ్ సేల్స్‌లో ‘TCL 32V4C’ మోడల్ టీవీ కేవలం రూ.12వేల లోపే అందుబాటులో ఉంది. ఇప్పుడీ టీవీ ప్రత్యేకతలు, ఆఫర్ ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం రండి..

కళ్లుచెదిరే ఆఫర్లు..

ఈ క్యూలెడ్ టీవీ అసలు ధర రూ.20,490 వరకు ఉంటుంది. కానీ ప్రస్తుతం విజయ్ సేల్స్‌లో నడుస్తున్న ప్రత్యేక ఆఫర్ ద్వారా కేవలం రూ.11,989కే దీనిని సొంతం చేసుకోవచ్చు. నిజంగా ఇదొక క్రేజీ డీల్ అనే చెప్పాలి. అలాగే ఒకేసారి అంత డబ్బు కట్టలేని వారి కోసం నెలకు కేవలం రూ.528 నుండి ప్రారంభమయ్యే EMI ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. దీనికి తోడు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై మరిన్ని డిస్కౌంట్లు పొందే అవకాశం ఉంది.

Advertisement

Also Read: పాత ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు.. Wi-Fi స్పీడ్‌ను పెంచుకోవచ్చు, అదెలాగంటే?

థియేటర్ అనుభూతి..

ఈ టీవీలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది దీని డిస్‌ప్లే గురించి. దీనిలో వాడిన క్యూలెడ్ టెక్నాలజీ వల్ల రంగులు చాలా సహజంగా, స్పష్టంగా కనిపిస్తాయి. మనం చూసే ప్రతి దృశ్యం కళ్లకు కట్టినట్టు ఉంటుంది. దీనికి తోడు HDR10 సపోర్ట్ ఉండటం వల్ల చీకటిగా ఉన్న సీన్లు కూడా చాలా క్లియర్‌‌గా కనిపిస్తాయి. అలాగే బెజెల్‌లెస్ డిజైన్ వల్ల స్క్రీన్ చుట్టూ ఫ్రేమ్ ఉన్నట్టు అనిపించదు. దీంతో మనం సినిమాలో పూర్తిగా లీనమైపోవచ్చు.

వాయిస్ కంట్రోల్ ఫీచర్..

Advertisement

ఇది గూగుల్ టీవీ సాఫ్ట్‌వేర్‌తో పనిచేస్తుంది. దీనివల్ల మనకు నచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు అన్నీ ఒకే చోట చూడొచ్చు. మనం ఎక్కువగా ఏవి చూస్తామో వాటిని గమనించి, దానికి తగ్గట్టుగా ఈ టీవీ మనకు సూచనలు ఇస్తుంటుంది. దీనిలో గూగుల్ అసిస్టెంట్ సౌకర్యం కూడా ఉండటం వలన రిమోట్‌లో బటన్లు నొక్కే పని లేకుండా, కేవలం వాయిస్ ద్వారా టీవీని కంట్రోల్ చేయొచ్చు. మీకు నచ్చిన పాటను ప్లే చేయమని అడిగితే చాలు, వెంటనే ఆ పాటను ప్లే చేసేస్తుంది ఈ టీవీ.

సౌండ్ క్వాలిటీ అదుర్స్..

మంచి పిర్చర్ క్వాలిటీతో పాటు మంచి ఆడియో ఉంటేనే కదా సినిమా పరిపూర్ణమయ్యేది. దీని కోసం TCL ఈ టీవీలో డాల్బీ ఆడియో టెక్నాలజీని వాడింది. తద్వారా సౌండ్ చాలా క్లారిటీగా, లోతుగా వినిపిస్తుంది. ఏదైనా యాక్షన్ సినిమా చూస్తున్నప్పుడు లేదా మ్యూజిక్ వింటున్నప్పుడు మినీ హోమ్ థియేటర్ లాంటి అనుభూతిని కలిగిస్తుందీ టీవీ. 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల వీడియోలు ఎక్కడా ఆగకుండా స్మూత్‌గా ప్లే అవుతాయి. ఇంత తక్కువ ధరలో ప్రీమియం లుక్ కలిగి ఉన్న ఈ 32 ఇంచుల స్మార్ట్‌ టీవీని వెంటనే కొనుగోలు చేయడం ఉత్తమం.

Also Read: ఇంట్లోనే ఫ్యామిలీతో మూవీ నైట్.. థియేటర్ ఫీల్ ఇచ్చే బెస్ట్ ప్రొజెక్టర్లు ఇవే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×