// // Narsaiah Biopic: 'గుమ్మడి నర్సయ్య' బయోపిక్ నుంచి శివన్న లుక్.. -->
E-Paper
Advertisement

Narsaiah Biopic: ప్రజా నేత ‘గుమ్మడి నర్సయ్య’ బయోపిక్ నుంచి శివన్న ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్..

Narsaiah Biopic: ప్రజా నేత ‘గుమ్మడి నర్సయ్య’ బయోపిక్ నుంచి శివన్న ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్..
Advertisement

Narsaiah Biopic: తెలుగు రాజకీయ యవనికపై నిరాడంబరతకు, నిజాయితీకి నిలువుటద్దంలా నిలిచిన నేత గుమ్మడి నర్సయ్య. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా, సామాన్యుడిలా సైకిల్‌పై అసెంబ్లీకి వెళ్లిన ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఇప్పుడు ఈ మహోన్నత ప్రజా నాయకుడి జీవిత విశేషాలను వెండితెరపై ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది చిత్ర బృందం. ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత ఎన్. సురేష్ రెడ్డి (ఎన్ఎస్ఆర్) నిర్మిస్తున్న ఈ చిత్రానికి పరమేశ్వర్ హివ్రాలే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ బయోపిక్‌లో గుమ్మడి నర్సయ్య పాత్రలో కన్నడ కంఠీరవ, కరుణాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్ నటిస్తున్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

Read also-Dhurandhar Runtime: ‘ధురంధర్ ది రివేంజ్’పై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మీమ్స్.. ఇది వేరే లెవెల్…

Advertisement

ఈ పోస్టర్‌లో శివన్న ఆహార్యం అచ్చం గుమ్మడి నర్సయ్యను తలపిస్తోంది. భుజంపై కండువా, బిగించిన పిడికిలి, కళ్ళలో కనిపిస్తున్న ఆ ఇంటెన్సిటీ చూస్తుంటే.. ఈ పాత్ర కోసం శివ రాజ్ కుమార్ ఎంతగా పరితపించారో అర్థమవుతోంది. కేవలం లుక్ మాత్రమే కాకుండా, ఒక ప్రజా పోరాట యోధుడి గాంభీర్యాన్ని ఆయన తన నటనతో అద్భుతంగా పలికిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ అంచనాలను పెంచగా, తాజాగా వచ్చిన పోస్టర్ ఆ అంచనాలను ఆకాశానికి చేర్చింది.

Read also-Ustad Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బ్రేక్ ఈవెన్ రావాలంటే ఇంకా ఎంత కలెక్ట్ చేయాలంటే?

Advertisement

ఈ సినిమాను సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కిస్తున్నారు. సురేష్ బొబ్బిలి తన వైవిధ్యమైన సంగీతంతో ప్రాణం పోస్తున్నారు. సతీష్ ముత్యాల విజువల్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. సత్య గిడుటూరి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సిద్దగాని సాయి కిరణ్ గౌడ్, చింతకింది రూప డిజైన్ చేసిన వేషధారణ శివన్నను అచ్చం నర్సయ్యలా మార్చడంలో సఫలమయ్యాయి. గుమ్మడి నర్సయ్య జీవిత కథ కేవలం ఒక ప్రాంతానికో, భాషకో పరిమితం కాదు. అందుకే ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, మరియు హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. రాజకీయాల్లో విలువలు కోరుకునే ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమాగా ఇది నిలవబోతోంది. నిజాయితీకి మారుపేరైన ఒక నాయకుడి కథను, నటనలో శిఖర సమానమైన శివ రాజ్ కుమార్ పోషించడం సినిమాపై మరింత ఆసక్తిని కలిగిస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ రానున్నాయి.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×