E-Paper
Advertisement

Split AC vs Window AC: ఏసీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఈ తేడాలు తెలుసుకోకుండా కొంటే నష్టపోతారు!

Split AC vs Window AC: ఏసీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఈ తేడాలు తెలుసుకోకుండా కొంటే నష్టపోతారు!
Advertisement

Split AC vs Window AC: వేసవి కాలం వచ్చిందంటే చాలు, బయట విపరీతమైన ఉష్ణోగ్రతల వల్ల ఇంట్లో కూడా ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఒళ్లంతా చెమటలు, గాలి ఆడకపోవడం వంటివి చిరాకుగా తెప్పిస్తుంటాయి. ఈ సమయంలో చాలామంది మంచి ఏసీ కొంటే సరిపోతుందని అనుకుంటుంటారు. అయితే, కొత్తగా ఏసీ కొనాలనుకునే వారికి ఎదురయ్యే అతిపెద్ద ప్రశ్న స్ప్లిట్ ఏసీ తీసుకోవాలా? లేదా విండో ఏసీ తీసుకోవాలా? అని. ఈ రెండింటిలో దేని ప్రత్యేకతలు దానికున్నాయి. ఈ నేపథ్యంలో మీ అవసరాలకు ఏది సరిపోతుందో, వాటి మధ్య తేడాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం.

అమర్చడం సులభం..

విండో ఏసీలు సాధారణంగా ఒకే యూనిట్‌గా వస్తాయి. వీటిని అమర్చడానికి గది గోడకు ఒక కిటికీ లేదా ప్రత్యేకమైన కన్నం ఉండాలి. ఇది చిన్న గదులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. మరోవైపు, స్ప్లిట్ ఏసీలు రెండు భాగాలుగా ఉంటాయి. లోపల ఉండే భాగం గది అందాన్ని పెంచితే, శబ్దం చేసే కంప్రెషర్ బయట ఉంటుంది. మీ గదికి కిటికీ లేకపోయినా స్ప్లిట్ ఏసీని సులభంగా అమర్చుకోవచ్చు.

Advertisement

Also Read: ఫ్లాగ్‌షిప్ ఫోన్లకు గట్టి పోటీ.. ఇండియన్ మార్కెట్లోకి వచ్చేస్తున్న నథింగ్ ఫోన్ 4a సిరీస్!

తక్కువ ధరలోనే..

ఇక బడ్జెట్ విషయానికి వస్తే.. విండో ఏసీలు స్ప్లిట్ ఏసీల కంటే తక్కువ ధరకే వచ్చేస్తాయి. వీటి మెయింటెనెన్స్ కూడా సులభం. విండో ఏసీని సర్వీసింగ్ చేయడం లేదా ఒక చోట నుండి మరోచోటికి మార్చడం చాలా తేలిక. ఇక స్ప్లిట్ ఏసీలు కొంచెం ఖరీదైనవి, వీటిని ఒక గది నుండి మరో గదికి మార్చడం కాస్త శ్రమతో కూడుకున్న పని. కానీ, దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆలోచిస్తే ఇవి ఇచ్చే లుక్, పనితీరు అద్భుతంగా ఉంటాయి.

చల్లదనంలో ఇవ్వడంలో ఏది బెస్ట్?

Advertisement

ఎలాంటి సౌండ్ లేకుండా ప్రశాంతంగా నిద్రపోవాలనుకునే వారికి స్ప్లిట్ ఏసీ బెస్ట్ ఆప్షన్. దీనిలో కంప్రెషర్ బయట ఉండటం వల్ల గదిలో అస్సలు శబ్దం వినిపించదు. విండో ఏసీలో అన్ని విభాగాలు ఒకే చోట ఉండటం వల్ల కొంచెం సౌండ్ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే, కూలింగ్ ఇవ్వడంలో ఈ రెండు రకాలు సమర్థవంతంగానే పనిచేస్తాయి. కాకపోతే, పెద్ద గదుల మూలమూలలకు చల్లదనం చేరాలంటే స్ప్లిట్ ఏసీ వేగంగా పనిచేస్తుంది.

నిర్ణయం మీదే..

ఒకవేళ మీ దగ్గర బడ్జెట్ తక్కువగా ఉండి, కిటికీ సౌకర్యం ఉన్న చిన్న గది అయితే విండో ఏసీని ఎంచుకోవడం మంచిది. అలా కాకుండా, గది ఆకర్షణీయంగా కనిపించాలని, శబ్దం లేకుండా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటే స్ప్లిట్ ఏసీని కొనుగోలు చేయొచ్చు. మీ అవసరాలను బట్టి సరైన నిర్ణయం తీసుకుంటే.. ఈ సమ్మర్‌ను కూల్‌ కూల్‌గా గడిపేయవచ్చు.

Also Read: వివో నుంచి మరో సంచలనం.. బడ్జెట్ ధరలో 8 Gen 5 ప్రాసెసర్, మైండ్ బ్లాకింగ్ అంతే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×