E-Paper
Advertisement

Telangana Assembly budget sessions-2026: ఎట్టకేలకు ముహూర్తం ఖరారు! 26 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Telangana Assembly budget sessions-2026:  ఎట్టకేలకు ముహూర్తం ఖరారు!  26 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
Advertisement

Telangana Assembly budget sessions-2026: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 26 నుంచి సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈసారి రెండువారాల పాటు సమావేశాలు జరగనున్నాయి. బడ్జెట్‌లో సంక్షేమ పథకాలకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఈనెల 26 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్  సమావేశాలు

Advertisement

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 26 నుంచి మొదలుకానున్నాయి. రెండువారాల పాటు సమావేశాలను నిర్వహించాలని ఆలోచన చేస్తోంది ప్రభుత్వం. సమావేశాల తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించనున్నారు. ఆ మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది.

ఫిబ్రవరి 28న అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. శాసనసభ, శాసనమండలి ఒకే ప్రాంగణంలో సమావేశాలు జరగనున్నాయి. మండలి సమావేశాలు పాత అసెంబ్లీ హాల్లో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది అసెంబ్లీ సిబ్బంది.  ఈసారి అసెంబ్లీ సమావేశాలు రెండువారాల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే బడ్జెట్‌ రూపకల్పనపై కసరత్తు ముమ్మరం చేసింది ప్రభుత్వం.

Advertisement

రెండువారాల పాటు సమావేశాలు.. ఆ రంగాలకు భారీగా నిధులు

ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో శాఖలవారీగా ప్రీ బడ్జెట్ సమావేశాలను పూర్తి అయ్యాయి. అలాగే అన్ని శాఖల మంత్రులు, అధికారులతో సమీక్షలు నిర్వహించారు. ఈసారి బడ్జెట్‌లో సంక్షేమం, అభివృద్ధికి ఎక్కువగా నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. వాటిలో రైతు సంక్షేమం, మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లు, గృహ జ్యోతి వంటి ఆరు గ్యారంటీల అమలుకు భారీగా నిధులు కేటాయించనున్నారట.

అసెంబ్లీ సమావేశాల్లో పెన్షన్ల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 23న రేవంత్‌రెడ్డి కేబినెట్ భేటీ జరగనుంది. అందులో బడ్జెట్‌ సమావేశాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. కొత్త సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధి వంటి అంశాలపై దృష్టి సారించే అవకాశముంది.

ALSO READ: తెలంగాణలో కాంగ్రెస్‌కు తిరుగులేదు.. మరో రెండు పర్యాయాలు మాదే అధికారం

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×