E-Paper
Advertisement

Deveillance Spectre I: మీ ఫోన్ మీ సీక్రెట్స్ వింటోందా? ఈ చిన్న గ్యాడ్జెట్‌తో ఆడియో రికార్డింగ్‌కు చెక్ పెట్టండి!

Deveillance Spectre I: మీ ఫోన్ మీ సీక్రెట్స్ వింటోందా? ఈ చిన్న గ్యాడ్జెట్‌తో ఆడియో రికార్డింగ్‌కు చెక్ పెట్టండి!
Advertisement

Deveillance Spectre I: నేటి డిజిటల్ యుగంలో సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకు ప్రైవసీ అనేది పెద్ద ప్రశ్నగా మారింది. మనం ఏం మాట్లాడుకుంటున్నామో స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ స్పీకర్లు వింటున్నాయనే భయం అందరిలోనూ ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారంగా శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన డెవిలెన్స్ అనే స్టార్టప్ ‘Specter I’ పేరుతో అద్భుతమైన పరికరాన్ని పరిచయం చేస్తోంది. ఇది కేవలం గాడ్జెట్ మాత్రమే కాదు.. మన వ్యక్తిగత సంభాషణలకు రక్షణ కవచంలా పనిచేస్తుంది.

ఏఐ సాయంతో ఆడియో జామింగ్..

ఇప్పటికే ఆడియో జామింగ్ పరికరాలు మార్కెట్లో ఉన్నప్పటికీ.. ఈ స్పెక్టర్ I వాటన్నింటికంటే భిన్నమైంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి పని చేసే తొలి స్మార్ట్ యాంటీ సర్వైలెన్స్ డివైజ్. ఈ పరికరం తన చుట్టుపక్కల ఉన్న మైక్రోఫోన్‌లను ఇట్టే గుర్తించి, అవి ఆడియో రికార్డ్ చేయకుండా అడ్డుకుంటుంది. దీని కోసం కంపెనీ అత్యాధునిక ఏఐ, సిగ్నల్ ప్రాసెసింగ్ టెక్నాలజీని వాడుతోంది.

స్పెక్టర్ I ప్రత్యేకతలివే..

Advertisement

టేబుల్ టాప్ డిజైన్‌తో వచ్చే ఈ పోర్టబుల్ పరికరం 2 మీటర్ల పరిధిలో అద్భుతంగా పనిచేస్తుంది. ఈ డివైజ్ మనిషి చెవులకు వినిపించని కొన్ని ప్రత్యేకమైన ఓమ్నిడైరెక్షనల్ సిగ్నల్స్‌ను విడుదల చేస్తుంది. తద్వారా సమీపంలోని ఏ మైక్రోఫోన్ కూడా స్పష్టమైన సౌండ్‌ని రికార్డ్ చేయదు. కేవలం జామింగ్ మాత్రమే కాకుండా, దగ్గరలో ఎన్ని మైక్రోఫోన్లు యాక్టివ్‌గా ఉన్నాయనే డేటాను కూడా ఇది యూజర్లకు అందిస్తుంది.

ప్రైవసీకి పక్కా భరోసా..

ఈ పరికరం అల్ట్రాసౌండ్ ఫ్రీక్వెన్సీలను ఉపయోగించి రికార్డింగ్‌లను వక్రీకరిస్తుంది. డిక్టాఫోన్‌లు లేదా ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఉన్న ఫోన్‌ల విషయంలో ఇదెలా స్పందిస్తుందనే దానిపై పూర్తి స్పష్టత లేనప్పటికీ, ప్రస్తుతానికి ఇది అత్యుత్తమ ప్రైవసీ టూల్‌గా కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రీ ఆర్డర్ దశలో ఉన్న స్పెక్టర్ I, ఈ ఏడాది చివర్లో మార్కెట్లోకి రానుంది. మన సంభాషణలు రహస్యంగా ఉండాలంటే ఇలాంటి టెక్నాలజీ అవసరం ఎంతో ఉంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×