E-Paper
Advertisement

Vi Annual Plans 2026: వీఐ వార్షిక ప్లాన్స్.. రోజుకి 2GB డేటా, ఫ్రీ ఓటీటీ.. ఇవి చాలా చీప్ గురు!

Vi Annual Plans 2026: వీఐ వార్షిక ప్లాన్స్.. రోజుకి 2GB డేటా, ఫ్రీ ఓటీటీ.. ఇవి చాలా చీప్ గురు!
Advertisement

Vi Annual Plans 2026: వొడాఫోన్ ఐడియా (Vi) తన వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎన్నో రకాల రీఛార్జ్ ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలో 365 రోజుల పాటు అందుబాటులో ఉండే వార్షిక ప్లాన్స్ ను సైతం ఆఫర్ చేస్తోంది. వొడాఫోన్ లో తక్కువ బడ్జెట్ నుంచి ప్రీమియం వరకు అందుబాటులో ఉన్న టాప్ – 5 ప్లాన్స్ ఈ కథనంలో పరిశీలిద్దాం.

రూ. 1,189 ప్లాన్

ఇది కేవలం ఇంటర్నెట్ అవసరాల కోసం రూపొందించబడింది. ఇందులో 50GB డేటా లభిస్తుంది. అయితే ఇందులో కాలింగ్ సదుపాయం ఉండదు. తక్కువ ధరలో డేటా కనెక్టివిటీ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.

రూ. 1,849 ప్లాన్

Advertisement

డేటా అవసరం లేకుండా ఫ్రీ కాల్స్, ఎస్ఎంఎస్ లను మాత్రమే కోరుకునే వారికి ఈ ప్లాన్ బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తోంది. ఏడాది పాటు (365 రోజులు) అపరిమిత కాలింగ్ తో పాటు 3600 SMSలు లభిస్తాయి. కానీ ఇందులో మొబైల్ డేటా ఉండదు.

రూ. 3,499 ప్లాన్

డేటా వినియోగం ఎక్కువగా ఉండే యూజర్ల కోసం వీఐ ఈ ప్లాన్ తీసుకొచ్చింది. ఇది రోజుకు 1.5GB డేటాతో పాటు అపరిమిత కాలింగ్‌ ఆఫర్ చేస్తుంది. అలాగే ‘అపరిమిత నైట్ డేటా’ (రాత్రి 12 నుండి ఉదయం 6 గంటల వరకు), ‘వీకెండ్ డేటా రోల్‌ఓవర్’ సౌకర్యం కూడా పొందవచ్చు.

రూ. 3,599 ప్లాన్

Advertisement

ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 2GB డేటాను పొందవచ్చు. ఇది హెవీ డేటా వినియోగదారులకు సరైన ఎంపికగా నిలుస్తోంది. అలాగే అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు, నైట్ డేటా, వీకెండ్ డేటా రోల్‌ఓవర్, 2GB బ్యాకప్ డేటాను అదనంగా పొందవచ్చు.

Also Read: Portable AC Benefits: మధ్యతరగతి వాళ్లు పోర్టబుల్ ఏసీలు కొనొచ్చా? ఒకవేళ కొంటే కలిగే లభాలేంటి?

రూ. 3,799 ప్లాన్

వీఐలో పాపులర్ ప్రీమియం రీఛార్జ్ ప్లాన్ గా ఇది నిలిచింది. రోజుకు 2GB డేటా, అపరిమిత కాలింగ్‌తో పాటు ఇందులో అదనపు ప్రయోజనంగా ‘Amazon Prime Lite’ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. డేటా, అపరిమిత కాలింగ్ తో పాటు వినోదాన్ని కోరుకునేవారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

Also Read: Air Conditioner: ఏసీని 24 గంటల పాటు వాడుతున్నారా? ఇక మిమ్మల్ని పైవాడే కాపాడాలి!

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×