E-Paper
Advertisement

Hotel On Moon: చంద్రుడిపై లగ్జరీ హోటల్ నిర్మాణం.. ఒక రాత్రి గడపడానికి కోట్లలో రెంట్

Hotel On Moon: చంద్రుడిపై లగ్జరీ హోటల్ నిర్మాణం.. ఒక రాత్రి గడపడానికి కోట్లలో రెంట్
Advertisement

Hotel On Moon| విహార యాత్రకు చంద్రుడిపై వెళితే ఎలా ఉంటుంది. ఊహించడానికే ఆశ్చర్యంగా ఉంటుంది కదా. గత కొంతకాలంగా దీని గురించి చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇప్పటికే కొంతమంది పౌరులు అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు. దీంతో అంతరిక్ష పర్యటనని బిజినెస్‌గా మార్చడానికి ప్లానింగ్ జరుగుతోంది. ముఖ్యంగా చంద్రుడిపై సాధారణ పౌరులు వెళ్లేందుకు అక్కడ కొన్ని రాత్రులు గడపాలని గడపేవిధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అవును చంద్రునిపై బస చేయడం త్వరలో నిజమవుతుంది.

ఒక స్పేస్ స్టార్టప్ కంపెనీ ప్రపంచంలోనే మొదటి శాశ్వత చంద్ర హోటల్ నిర్మాణం చేయనుంది. 2032 నాటికి ఈ హోటల్ అతిథులను స్వాగతించనుంది. ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్‌లా అనిపించిన ఈ ఆలోచన ఇప్పుడు సీరియస్ స్పేస్ బిజినెస్‌గా మారుతోంది.

చంద్రుడిపై హోటల్ నిర్మాణం చేయనున్న అమెరికన్ కంపెనీ

Advertisement

అమెరికాలో కాలిఫోర్నియాకు చెందిన స్టార్టప్ కంపెనీ ఈ అద్భుతమైన ప్రాజెక్ట్‌ ప్రారంభించింది. కంపెనీ పేరు గెలాక్టిక్ రిసోర్స్ యూటిలైజేషన్ స్పేస్ (GRU). చంద్రునిపై మొదటి శాశ్వత హోటల్ నిర్మాణం చేస్తామని GRU చెబుతోంది. టెక్నాలజీ చిప్స్ తయారు చేసే Nvidia కంపెనీ, అంతరిక్ష రాకెట్లు తయారు చేసే SpaceX కంపెనీ ఈ ప్రాజెక్టులో పార్టనర్లు. అంతేకాదు Y Combinator, డిఫెన్స్ టెక్నాలజీ కంపెనీ Anduril వంటి పెద్ద ఇన్వెస్టర్లు ఈ ప్రాజెక్ట్‌‌ని సపోర్ట్ చేస్తున్నారు. 21 ఏళ్ల యువ ఎంటర్‌ప్రెన్యూర్ స్కైలర్ చాన్ ఈ స్టార్టప్‌ను స్థాపించాడు. స్పేస్ ఔత్సాహికుల నుంచి ప్రపంచవ్యాప్త దృష్టి ఈ ప్రాజెక్ట్‌పై పడుతోంది.

బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం

GRU ఇప్పటికే అర్లీ బుకింగ్స్ తీసుకుంటోంది. భవిష్యత్తులో చంద్రునిపై బస చేయాలనుకునే వారు పెద్ద మొత్తం చెల్లించాలి. ఒక బుకింగ్ కోసం 10 మిలియన్ డాలర్లు (సుమారు 83 కోట్ల రూపాయలు) చెల్లించాలి. ఈ మొత్తం చెల్లిస్తే భవిష్యత్ స్టే సురక్షితం అవుతుంది. ధనవంతులైన స్పేస్ ట్రావెలర్లు, అడ్వెంచరర్లను టార్గెట్ చేస్తున్నారు. ధర ఎక్కువైనప్పటికీ ఆసక్తి చాలా ఎక్కువగా ఉంది.

సామాన్యులకు దూరంగా చంద్ర హోటల్ రూమ్ ధర 

Advertisement

చంద్రునిపై ఒక రాత్రి బస చేయడానికి ధర చాలా ఎక్కువ. ఒక రాత్రి ధర సుమారు 4,10,000 డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.3.7 కోట్లు). స్పేస్ ట్రావెల్, నిర్మాణ ఇబ్బందుల వల్ల భారీ ధరను నిర్ణయించారు. ఇది సామాన్యులకు అందుబాటులో లేని ధర అని GRU అంగీకరిస్తోంది. అయితే భవిష్యత్తులో టెక్నాలజీ మెరుగవడంతో ధరలు తగ్గుతాయని కంపెనీ ఆశిస్తోంది.

Also Read: ప్రకృతి నాశనం.. మనుషుల కంటే ఎక్కువ నీరు తాగేస్తున్న ఏఐ టెక్నాలజీ

హోటల్ ఎప్పుడు ప్రారంభం

2029 సంవత్సరం నుంచి చంద్రుడిపై హోటల్ నిర్మాణం ప్రారంభించాలని GRU ప్లాన్ చేస్తోంది. అన్ని అనుమతులు పొందిన తర్వాతే నిర్మాణం మొదలవుతుంది. పూర్తి ఆపరేషన్లకు ముందు టెస్ట్ మిషన్లు కూడా చేస్తారు. ప్రతిదీ ప్లాన్ ప్రకారం జరిగితే 2032లో తొలిసారిగా అతిథులు చంద్రునిపైకి రావచ్చు.

హోటల్ నిర్మాణంలో చంద్రుడి మట్టి

స్పేస్ స్టేషన్ల మాదిరిగా భూమి నుంచి అన్ని మెటీరియల్స్ తీసుకెళ్లరు. చంద్రుడిపై మట్టిని (లూనార్ సాయిల్) ఉపయోగించి నిర్మాణం చేస్తారు. దీంతో ట్రాన్స్‌పోర్టేషన్ ఖర్చులను చాలా తగ్గిస్తుంది. భవిష్యత్తులో చంద్రునిపై లాంగ్-టర్మ్ జీవనానికి ఈ పద్ధతి సహాయపడుతుంది.

Also Read: ఆన్‌లైన్‌లో కొత్త ఐఫోన్ కొంటే పాత ఫోన్ డెలివరీ.. ఎలా గుర్తుపట్టాలంటే

భూమి నుంచి చంద్రుడి వరకు రవాణా ఖర్చు తగ్గుతుందా?

స్పేస్ ట్రావెల్ డిమాండ్ పెరిగే కొద్దీ ధరలు తగ్గుతాయని GRU భావిస్తోంది. టెక్నాలజీ మెరుగవడంతో ట్రావెల్, హోటల్ ఖర్చులు తగ్గుతాయి. అయితే మొదటి కొన్ని సంవత్సరాలు చంద్రుడిపై పర్యటించే అవకాశం.. బిలియనీర్లు, అంతరిక్ష పరిశోధకుల కోసమే ఉంటుంది.

అంతరిక్ష పర్యటన బిజినెస్

చంద్రుడిపై హోటల్ నిర్మాణం.. స్పేస్ టూరిజం‌లో పెద్ద అడుగు. ప్రైవేట్ కంపెనీలు స్పేస్ సరిహద్దులను విస్తరిస్తున్నాయని చూపిస్తోంది. భవిష్యత్తులో మరిన్ని స్పేస్ హోటల్స్, స్టేషన్లు రావచ్చు. భూమికి దూరంగా మనుషుల ప్రయాణం సాధారణం అవుతుంది. భూమికి చంద్రుడు దూరంగా ఉన్న మొదటి లగ్జరీ డెస్టినేషన్‌గా మారవచ్చు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×