E-Paper
Advertisement

Wearable AC: సోనీ సంచలనం.. షర్ట్ లోపలే ఏసీ.. ఇక ఎండ ఎంత ఉన్నా డోంట్ కేర్!

Wearable AC: సోనీ సంచలనం.. షర్ట్ లోపలే ఏసీ.. ఇక ఎండ ఎంత ఉన్నా డోంట్ కేర్!
Advertisement

Wearable AC: వేసవి తాపాన్ని తట్టుకోవడానికి సోనీ తన సరికొత్త వేరబుల్ ఎయిర్ కండిషనర్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ‘రియోన్ పాకెట్ 6’ (REON POCKET 6), ‘రియోన్ పాకెడ్ ప్రో ప్లస్’ (REON POCKET PRO Plus) అనే రెండు కొత్త మోడళ్లను పరిచయం చేసింది. ఇంతకీ ఈ డివైజ్ ల ప్రత్యేకలు, ప్రధాన ఫీచర్లు ఏంటీ? ఏ విధంగా కూలింగ్ ను అందిస్తాయి? వంటి విశేషాలు ఈ కథనంలో చూద్దాం.

రియోన్ పాకెట్ 6 ఫీచర్లు..

ఈ డివైజ్ లో కొత్తగా అభివృద్ధి చేసిన కాంపక్ట్ డ్యూయల్ థర్మో మాడ్యూల్ (Compact DUAL Thermo Module) టెక్నాలజీని అందించారు. ఇది పాత మోడళ్లతో పోలిస్తే శరీర ఉష్ణోగ్రతను అదనంగా 2 డిగ్రీల వరకు తగ్గిస్తుంది. దీనిలో రెండు థర్మో మాడ్యూల్స్ ఉన్నప్పటికీ.. ఇది చూడటానికి చాలా చిన్నగా సౌకర్యవంతంగా ఉంటుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇందులోని ‘స్మార్ట్ కూల్’ మోడ్‌ ను వాడితే సుమారు 15 గంటల వరకు నిరంతరంగా కూలింగ్ పొందచ్చని సోనీ కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.

రియోన్ పాకెట్ ప్రో ప్లస్ ఫీచర్లు..

Advertisement

ఇది సరికొత్త కూలింగ్ అల్గారిథమ్ ద్వారా పనిచేస్తుందని సోనీ వర్గాలు ప్రకటించాయి. దీనివల్ల కూలింగ్ సామర్థ్యం గత మోడళ్ల కంటే 20 శాతం పెరుగుతుందని పేర్కొన్నాయి. మెడకు సరిగ్గా సరిపోయేలా కొత్తగా రూపొందించిన నెక్ బ్యాండ్ దీనికి హైలెట్ గా నిలుస్తుందని దీమా వ్యక్తం చేశాయి. నడుస్తున్నప్పుడు, వ్యాయామం చేస్తున్నప్పుడు కూడా ఇది జారిపోకుండా స్థిరంగా ఉంటుందని సోనీ వర్గాలు తెలియజేశాయి.

మరికొన్ని స్మార్ట్ ఫీచర్లు..

పై డివైజ్ లతో పాటు వచ్చే రియోన్ పాకెట్ ట్యాగ్ 2 (REON POCKET TAG 2) పరికరం.. చుట్టూ ఉన్న ఉష్ణోగ్రత, తేమను గుర్తించి ఆటోమేటిక్‌గా కూలింగ్‌ను అడ్జస్ట్ చేస్తుందని సోనీ వర్గాలు తెలిపాయి. ఇవి కేవలం చల్లదనమే కాకుండా చలికాలంలో వేడిని (WARM Mode) కూడా అందించగలదని పేర్కొన్నాయి. మరోవైపు వేరబుల్ ఏసీ డివైజ్ లను బ్లూటూత్ ద్వారా ఫోన్‌కు కనెక్ట్ చేసి ఉష్ణోగ్రతను నియంత్రించే వెసులుబాటును సైతం సోనీ కల్పించింది. ఒకవేళ ఫోన్ అందుబాటులో లేకపోయినా డివైజ్‌పై ఉన్న బటన్లతో నేరుగా ఆపరేట్ చేయవచ్చు.

Advertisement

Also Read: Air Conditioner: నీటి తుంపర్ల చిట్కా.. సగానికే పవర్ బిల్లు.. ఏసీ యూజర్లకు పండుగే!

ఇంతకీ ధర ఎంతంటే?

ప్రస్తుతం ఈ వేరబుల్ ఏసీ డివైజ్ లను ఎంపిక చేసిన అంతర్జాతీయ మార్కెట్లలోనే సోనీ అందుబాటులోకి తీసుకొచ్చింది. యూకే లో 199 యూరోలు (దాదాపు రూ.22,315), యూరప్ లో 220 (రూ.24,670) యూరోల ప్రారంభ ధరకు వీటిని విక్రయిస్తోంది. త్వరలోనే భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా దీనిని అందుబాటులోకి తీసుకురావాలని సోనీ కసరత్తు చేస్తోంది. మెుత్తంగా చూస్తే.. వేసవిలో ఆఫీసులకు వెళ్లే వారికి.. ప్రయాణాలు చేసే వారికి ఇది ఒక అద్భుతమైన గ్యాడ్జెట్ అని చెప్పవచ్చు.

Also Read: AC Water Tips: ఏసీ నీటిని మొక్కలకు పోస్తున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోండి!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×