E-Paper
Advertisement

భారత్‌లోకి సోనీ నుంచి మోస్ట్ ప్రీమియం స్మార్ట్ టీవీలు .. Sony BRAVIA 7II సిరీస్ ప్రత్యేకతలు ఇవే!

భారత్‌లోకి సోనీ నుంచి మోస్ట్ ప్రీమియం స్మార్ట్ టీవీలు .. Sony BRAVIA 7II సిరీస్ ప్రత్యేకతలు ఇవే!
Advertisement

Sony BRAVIA 7 II: భారతీయ మార్కెట్లోకి ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ సోనీ సరికొత్త BRAVIA 7II స్మార్ట్ టీవీ సిరీస్‌ను లాంచ్ చేసింది. ఇంట్లోనే సినిమా థియేటర్ లాంటి అద్భుతమైన అనుభూతిని అందించడమే లక్ష్యంగా దీనిని డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ టీవీలు సోనీ సెంటర్స్, ప్రముఖ ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి. ధరల విషయానికి వస్తే.. 55 ఇంచుల మోడల్ రూ.2,21,990 కాగా, 65 ఇంచుల మోడల్ రూ.2,74,990గా ఉంది. రాబోయే రోజుల్లో 75, 85, 98 ఇంచుల పెద్ద స్క్రీన్ మోడల్స్ కూడా మార్కెట్లోకి రానున్నాయి.

అద్భుతమైన పిక్చర్ క్వాలిటీ:

ఈ టీవీల్లో సోనీ సరికొత్త ట్రూ ఆర్‌జీబీ టెక్నాలజీని ఉపయోగించింది. ఇది ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగుల ఎల్‌ఈడీలను విడివిడిగా నియంత్రించి, స్క్రీన్‌పై రంగులను మరింత సహజంగా చూపిస్తుంది. చీకటిగా ఉండే సీన్లలో కూడా స్పష్టత తగ్గకుండా, కళ్లకు హాయిగా ఉండేలా విజువల్స్ కనిపిస్తాయి. దీనికి తోడు పవర్‌ఫుల్ ప్రాసెసర్ ఉండటం వల్ల, పాత తక్కువ క్వాలిటీ వీడియోలను కూడా దాదాపు 4K క్లారిటీలోకి మార్చి చాలా స్మూత్‌గా చూపిస్తుంది.

Advertisement

Also Read: డబ్బులు కట్టాలా? వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్‌లో పెయిడ్ ఫీచర్లు.. మెటా ప్లాన్స్ ఇవే!

థియేటర్ లెవెల్ సౌండ్:

సినిమా చూసేటప్పుడు విజువల్స్‌తో పాటు సౌండ్ కూడా ముఖ్యం కదా. అందుకే ఈ టీవీలలో 40 వాట్స్ ఆడియో అవుట్‌పుట్‌ను ఇచ్చారు. ఇది డాల్బీ అట్మోస్ సాంకేతికతతో పనిచేస్తుంది. దీనిలో ఉండే ఏఐ ఫీచర్ వల్ల సినిమాలో మాట్లాడే డైలాగులు చాలా స్పష్టంగా వినిపిస్తాయి. స్క్రీన్‌పై యాక్షన్ ఎటువైపు జరుగుతుంటే.. శబ్దం కూడా అటు నుంచే వస్తున్నట్లు అనిపించడం దీని ప్రత్యేకత.

గేమర్ల కోసం స్పెషల్ ఫీచర్స్:

Advertisement

గేమింగ్ ఇష్టపడే వారి కోసం ఈ టీవీ చక్కగా సరిపోతుంది. హెచ్‌డీఎమ్‌ఐ 2.1 సపోర్ట్ ఉండటం వల్ల హైఎండ్ గేమ్స్ ఆడేటప్పుడు ఎలాంటి లాగ్ లేదా స్క్రీన్ లాగ్ లేకుండా స్మూత్‌గా సాగిపోతాయి. ముఖ్యంగా ప్లేస్టేషన్ ప్లేయర్స్ కోసం విజువల్స్ మరింత అందంగా కనిపించేలా ప్రత్యేక ఫీచర్లను ఇందులో జోడించారు.

స్మార్ట్ ఫీచర్స్.. ప్రీమియం డిజైన్:

ఇది గూగుల్ టీవీ ఓఎస్‌పై పనిచేస్తుంది. దీనివల్ల మనకు నచ్చిన యాప్స్, సినిమాలను సులువుగా చూసుకోవచ్చు. వాయిస్ కమాండ్స్ కోసం గూగుల్ అసిస్టెంట్, యాపిల్ ఎయిర్‌ప్లే, అలెక్సా సపోర్ట్ కూడా ఉన్నాయి. ఈ టీవీ డిజైన్ చాలా స్లిమ్‌గా, ప్రీమియం లుక్‌తో ఆకట్టుకుంటుంది. కరెంట్ హెచ్చుతగ్గులు, ధూళి, తేమ నుండి రక్షణ కల్పించేలా దీనిని తయారు చేయడం వల్ల ఇది ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది.

Also Read: 54 డిగ్రీల హీట్‌నైనా తట్టుకునే బెస్ట్ 1 టన్ ఏసీలు ఇవే.. కరెంట్ బిల్లు కూడా తక్కువే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×