E-Paper
Advertisement

కరెంట్, నీటిని ఆదా చేసే.. బెస్ట్ స్మార్ట్ వాషింగ్ మెషీన్స్

కరెంట్, నీటిని ఆదా చేసే.. బెస్ట్ స్మార్ట్ వాషింగ్ మెషీన్స్
Advertisement

Best premium front load washing machines 2026: మన బిజీ లైఫ్‌లో బట్టలు ఉతకడం అనేది ఒక పెద్ద టాస్క్. ముఖ్యంగా వర్షాకాలం, చలికాలంలో బట్టలు ఆరడం, వాటి నుంచి మురికి, దుర్వాసన పోగొట్టడం అంత ఈజీ కాదు. ఇలాంటి సమయంలో లేటెస్ట్ ఏఐ , ఇన్వర్టర్ టెక్నాలజీతో వచ్చే ప్రీమియం ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి బట్టల ఫ్యాబ్రిక్‌ను బట్టి వాషింగ్ స్టైల్‌ను మార్చుకుంటూ, నీటిని, కరెంట్‌ను ఆదా చేస్తాయి. స్మార్ట్ లాండ్రీ సొల్యూషన్స్ ఇచ్చే టాప్ 5 ప్రీమియం ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ల వివరాలు మీకోసం..

స్మార్ట్ లాండ్రీ కోసం 5 బెస్ట్ ప్రీమియం ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లు:

1. ఎల్‌జీ 9 కేజీ ఏఐ డైరెక్ట్ డ్రైవ్ (LG 9 Kg AI Direct Drive Front Load):

ఎల్‌జీ బ్రాండ్ వాషింగ్ మెషీన్లలో ఎప్పుడూ నంబర్ వన్‌గా ఉంటుంది. దీనిలోని ఏఐ డీడీ (AI DD) టెక్నాలజీ బట్టల బరువునే కాకుండా, వాటి ఫ్యాబ్రిక్ (కాటన్, సిల్క్ మొదలైనవి) మెత్తదనాన్ని కూడా గుర్తిస్తుంది. బట్టల రకానికి తగినట్లుగా డ్రమ్ మూవ్‌మెంట్స్‌ను ఇది ఆటోమేటిక్‌గా సెట్ చేస్తుంది. దీని వల్ల బట్టలు పాడవవు. దీనిలోని ‘టర్బోవాష్ 390’ ఫీచర్ కేవలం 39 నిమిషాల్లోనే బట్టలను పర్ఫెక్ట్‌గా క్లీన్ చేస్తుంది. థింక్‌క్యూ (ThinQ) యాప్ ద్వారా ఫోన్ నుంచే దీన్ని ఆపరేట్ చేయవచ్చు. దీని ధర..రూ.40,000వరకు ఉంటుంది.

Advertisement

2. శామ్‌సంగ్ 8 కేజీ ఏఐ ఎకోబబుల్ (Samsung 8 Kg AI Ecobubble):
స్టైలిష్ లుక్ , స్మార్ట్ ఫీచర్లు కావాలనుకునే వారికి శామ్‌సంగ్ బెస్ట్ ఛాయిస్. దీనిలోని ఎకోబబుల్ టెక్నాలజీ డిటర్జెంట్‌ను బబుల్స్‌గా మార్చి బట్టల లోపలికి వేగంగా వెళ్లేలా చేస్తుంది. తక్కువ ఉష్ణోగ్రత ఉన్న నీటిలో కూడా ఇది మొండి మరకలను సులువుగా తొలగిస్తుంది. అంతే కాకుండా మీ వాషింగ్ అలవాట్లను బట్టి ఇది మీకు నచ్చిన సైకిల్స్ సూచిస్తుంది. స్మార్ట్ థింగ్స్ (SmartThings) యాప్ ద్వారా బట్టలు ఉతకడం ఎప్పుడు పూర్తవుతుందో ఫోన్లోనే చూసుకోవచ్చు. దీని ధర రూ.36,000పైనే ఉంటుంది.

3. ఐఎఫ్‌బీ 8.5 కేజీ ఎగ్జిక్యూటివ్ ప్లస్ (IFB 8.5 Kg Executive Plus VX):
ఇండియన్ బట్టల మురికిని వదిలించడంలో ఐఎఫ్‌బీకి సాటిలేదు. హార్డ్ వాటర్‌ను సాఫ్ట్ వాటర్‌గా మార్చే ‘ఆక్వా ఎనర్జీ’ టెక్నాలజీ దీని ప్రత్యేకత. దీనిలోని ‘స్టీమ్ వాష్’ ఫీచర్ 99.9% అలర్జీ కారకాలను, బ్యాక్టీరియాను వేడి ఆవిరితో చంపేస్తుంది. చిన్న పిల్లలున్న ఇళ్లకు ఇది చాలా మంచిది. వోల్టేజ్ హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు మెషీన్ పాడవకుండా కాపాడే ‘క్రెడిల్ వాష్’, వోల్టేజ్ ప్రొటెక్షన్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని ధర 42,000పైనే ఉంటుంది.

Advertisement

4. బాష్ 9 కేజీ సీరీస్ 6 (Bosch 9 Kg Series 6 Front Load):
జర్మన్ టెక్నాలజీతో వచ్చే బాష్ వాషింగ్ మెషీన్లు ఎక్కువ రోజులు పాడవకుండా ఉండటంతో పాటు తక్కువ సౌండ్ తో పనిచేస్తాయి. దీనిలోని ‘యాంటీటాంగిల్’ ఫీచర్ బట్టలు ఒకదానికొకటి ముడిపడిపోకుండా చూస్తుంది. దీనివల్ల బట్టలపై ముడతలు పడవు. ఈ మోటార్ చాలా తక్కువ శబ్దం చేస్తుంది. రాత్రి వేళల్లో కూడా ఇంట్లో ఎవరికీ డిస్టర్బెన్స్ లేకుండా బట్టలు ఉతుక్కోవచ్చు. రూ.45,000 వరకు దీని ధర ఉంటుంది.

Also Read: ఫ్యాన్ తిరుగుతుంది కానీ బిల్లు రాదు.. ఈ లేటెస్ట్ ఫ్యాన్ల ధరలు తెలుసా?

5. పానాసోనిక్ 8 కేజీ స్మార్ట్ వై-ఫై (Panasonic 8 Kg Smart Wi-Fi Front Load):
పానాసోనిక్ మిరాయ్ (MirAIe) ప్లాట్‌ఫామ్‌తో వచ్చే ఈ మెషీన్ పూర్తిగా నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్ హోమ్ లవర్స్ కోసం డిజైన్ చేయబడింది. ఇది వాతావరణ సమాచారాన్ని బట్టి బట్టలు ఎప్పుడు ఉతకాలో యాప్ ద్వారా మనకు అలర్ట్ పంపుతుంది. బిల్ట్-ఇన్ హీటర్ ద్వారా నీటిని 60 డిగ్రీల వరకు వేడి చేసి, బట్టల్లోని జిడ్డు, మొండి మరకలను మాయం చేస్తుంది. దీని ధర 34,000 పైనే ఉంటుంది.

ఒకప్పుడు వాషింగ్ మెషీన్ అంటే కేవలం బట్టలు ఉతకడమే.. కానీ ఇప్పుడు స్మార్ట్ ఫ్రంట్ లోడ్ మెషీన్లు బట్టల క్వాలిటీ తగ్గకుండా.. తక్కువ నీరు, కరెంట్‌తో బెస్ట్ క్లీనింగ్ ఇస్తున్నాయి. పైన పేర్కొన్న టాప్ 5 ప్రీమియం మోడల్స్ అన్నీ వై-ఫై, ఏఐ ఫీచర్లతో వస్తాయి. మీ బడ్జెట్, ఫ్యామిలీ సైజును బట్టి సరైన బ్రాండ్‌ను ఎంచుకుంటే మీ లాండ్రీ పని చాలా ఈజీ అయిపోతుంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×