E-Paper
Advertisement

మీ ఫోన్ విపరీతంగా వేడెక్కుతోందా? బ్యాటరీ పేలకుండా వెంటనే ఇలా చేయండి!

మీ ఫోన్ విపరీతంగా వేడెక్కుతోందా? బ్యాటరీ పేలకుండా వెంటనే ఇలా చేయండి!
Advertisement

Smartphone Overheating Safety Tips: నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో అంతర్భాగమైపోయింది. అయితే.. పెరుగుతున్న ఎండలు , మితిమీరిన వాడకం వల్ల ఫోన్లు విపరీతంగా వేడెక్కుతున్నాయి. స్మార్ట్‌ఫోన్ ఓవర్ హీట్ అవ్వడం అనేది కేవలం సాఫ్ట్‌వేర్ సమస్య మాత్రమే కాదు.. అది బ్యాటరీ పేలిపోయే ప్రమాదానికి దారితీయవచ్చు. మీ మొబైల్ వేడెక్కినప్పుడు ఏఏ జాగ్రత్తలు తీసుకోవాలి? బ్యాటరీ పేలకుండా ఉండాలంటే పాటించాల్సిన ఆ 3 అత్యవసర జాగ్రత్తలు ఏంటో వివరంగా తెలుసుకుందాం.

సమ్మర్‌లో స్మార్ట్‌ఫోన్లు వేడెక్కడం కామన్. కానీ.. ఫోన్ నుంచి విపరీతమైన వేడి రావడం లేదా బాడీ ఉబ్బినట్లు అనిపించడం తీవ్రమైన ప్రమాదానికి సంకేతం. లేటెస్ట్ ఫోన్లలో ఉండే లిథియం-అయాన్ బ్యాటరీలు శక్తివంతమైనవి. కానీ అవి ఓవర్ హీట్ అయినప్పుడు ‘థర్మల్ రన్‌వే’ అనే ప్రక్రియకు లోనై మంటలు చెలరేగే అవకాశం ఉంటుంది.

స్మార్ట్‌ఫోన్ వేడెక్కడానికి ప్రధాన కారణాలు:

Advertisement

అధిక ఉష్ణోగ్రతలు: ఫోన్‌ను నేరుగా ఎండలో లేదా కారు డ్యాష్‌బోర్డ్‌పై ఉంచడం.

హెవీ గేమింగ్: ఎక్కువ సేపు హై-గ్రాఫిక్స్ గేమ్స్ ఆడటం వల్ల ప్రాసెసర్ వేడెక్కుతుంది.

Advertisement

ఛార్జర్లు: నాణ్యత లేని ఛార్జర్లు వాడటం వల్ల వోల్టేజ్ పెరగడం, తగ్గడం జరిగి బ్యాటరీ దెబ్బతింటుంది.

బ్యాక్‌గ్రౌండ్ యాప్స్: ఒకేసారి అనేక యాప్స్ రన్ అవ్వడం వల్ల బ్యాటరీపై భారం పడుతుంది.

బ్యాటరీ పేలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

1. ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు వాడొద్దు:
చాలా మంది చేసే అతిపెద్ద తప్పు ఛార్జింగ్‌లో ఉండగా ఫోన్ వాడటం లేదా కాల్స్ మాట్లాడటం. ఛార్జింగ్ అవుతున్నప్పుడు బ్యాటరీ ఇప్పటికే వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఆ సమయంలో మీరు గేమ్స్ ఆడటం లేదా వీడియోలు చూడటం వల్ల అదనపు వేడి తయారవుతుంది. ఇది బ్యాటరీ లోపల షార్ట్ సర్క్యూట్‌కు దారి తీస్తుంది. ఫోన్ వేడెక్కినట్లు అనిపిస్తే వెంటనే ఛార్జర్ తీసివేసి.. కాసేపు పక్కన పెట్టండి.

Also Read: మోడరన్ ఉమెన్స్ కోసం టైటాన్ నుంచి సూపర్ స్టైలిష్ వాచ్.. చూస్తే చూపు తిప్పుకోలేరు

2. ఒరిజినల్ యాక్సెసరీస్ మాత్రమే వాడండి:
మార్కెట్లో తక్కువ ధరకు దొరికే లోకల్ ఛార్జర్లు , కేబుల్స్ వాడటం వల్ల బ్యాటరీ లైఫ్ తగ్గిపోవడమే కాకుండా.. పేలిపోయే ప్రమాదం ఉంది. మీ ఫోన్ తయారీ కంపెనీ అందించిన లేదా సర్టిఫైడ్ ఒరిజినల్ ఛార్జర్లను మాత్రమే వాడండి. ఒకవేళ మీ బ్యాటరీ ఉబ్బినట్లు కనిపిస్తే.. వెంటనే సర్వీస్ సెంటర్‌కు వెళ్లండి. దానిని ఇంట్లో వాడటం ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే.

3. వేడిని తగ్గించేలా మొబైల్ కేస్ :
ఫోన్ వేడెక్కుతున్నప్పుడు మొబైల్ కవర్‌ను వెంటనే తొలగించండి. మందపాటి కవర్లు వేడిని బయటకు వెళ్లనివ్వవు. అలాగే.. అవసరం లేనప్పుడు బ్లూటూత్, జిపిఎస్ (GPS), వైఫై ఆఫ్‌లో ఉంచండి. స్క్రీన్ బ్రైట్‌నెస్‌ను తక్కువగా ఉంచడం వల్ల బ్యాటరీపై ఒత్తిడి తగ్గుతుంది. ఫోన్‌ను ఎప్పుడూ దిండు కింద పెట్టి ఛార్జింగ్ చేయకండి. ఇది వేడిని పెంచి మంటలకు దారి తీస్తుంది.

టెక్నాలజీ మనకు ఎంత మేలు చేస్తుందో.. దానిని సరిగ్గా వాడకపోతే కూడా అంతే ప్రమాదం. పైన పేర్కొన్న జాగ్రత్తలను పాటించడం ద్వారా మీ స్మార్ట్‌ఫోన్ ఎక్కువ రోజులు పాడవకుండా ఉండటమే కాకుండా, ఊహించని ప్రమాదాల నుంచి మీరు సురక్షితంగా ఉండొచ్చు. ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడం వల్ల కూడా బ్యాటరీ మేనేజ్‌మెంట్ కూడా మెరుగుపడుతుంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×