E-Paper
Advertisement

Jio యూజర్లకు పండుగే.. తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చే.. టాప్-5 ప్లాన్‌లు ఇవే!

Jio యూజర్లకు పండుగే.. తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చే.. టాప్-5 ప్లాన్‌లు ఇవే!
Advertisement

Jio Plans: ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ లేనిదే క్షణం కూడా గడవడం లేదు. దీనిని గమనించిన టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో.. తన కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు సరికొత్త ప్లాన్‌లను ప్రవేశపెడుతోంది. అయితే తక్కువ ధరలో ఎక్కువ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ కోరుకునే వారి కోసం జియోలో 5 అద్భుతమైన ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

రూ. 189 రీఛార్జ్ ప్లాన్

జియోలో తక్కువ ధరలో చౌకైన రీఛార్జ్ కోరుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తోంది. 28 రోజుల వాలిడిటీతో వచ్చిన ఈ ప్లాన్ కింద 2GB డేటా (పూర్తి కాలానికి)తో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 300 SMSలు లభిస్తాయి. తక్కువ డేటా అవసరమున్న వారికి ఇది బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.

రూ.299 రీఛార్జ్ ప్లాన్..

Advertisement

రోజువారీ ఇంటర్నెట్ ఎక్కువగా వాడుతుంటే రూ. 299 ప్లాన్ సరిగ్గా సరిపోతుంది. దీని వాలిడిటీ 28 రోజులు. ప్రతిరోజూ 1.5GB హై స్పీడ్ డేటా యూజర్ కు లభిస్తుంది. అంటే నెలకు మొత్తం 42GB డేటా అన్నమాట. దీంతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు ఫ్రీగా పొందొచ్చు.

రూ.349 డేటా ప్లాన్

మీ దగ్గర 5G స్మార్ట్‌ఫోన్ ఉండి.. మీ ఏరియాలో 5G నెట్‌వర్క్ ఉంటే ఈ ప్లాన్ మీకు వరంగా నిలుస్తుంది. 28 రోజుల వ్యాలిడిటీతో వచ్చిన ఈ ప్లాన్.. రోజుకు 2GB డేటా అందిస్తుంది. అర్హత కలిగిన యూజర్లకు అపరిమిత 5G డేటాను ఈ ప్లాన్ ఆఫర్ చేస్తోంది.

రూ.799 రీఛార్జ్ ప్లాన్

Advertisement

పదే పదే రీఛార్జ్ చేసుకునే ఇబ్బంది లేకుండా 3 నెలల కాలానికి మంచి ప్లాన్ కోరుకుంటే దీనిని ట్రై చేయవచ్చు. జియో ఈ రూ. 799 ప్లాన్ ను 84 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కింద రోజుకు 1.5GB డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 మెసేజెస్ లభిస్తాయి.

రూ. 1029 రీఛార్జ్ ప్లాన్

ఓటీటీ ప్రియుల కోసం జియో ఈ ప్లాన్ ను ప్రత్యేకంగా తీసుకొచ్చింది. 84 రోజుల వ్యాలిడిటీ కలిగిన ప్లాన్ ను రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 2GB డేటాతో పాటు అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ఫ్రీగా లభిస్తుంది. అలాగే అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లను సైతం యూజర్ పొందొచ్చు.

Also Read: నగరంలో రాత్రి 11 దాటితే అక్కడ జిగేల్ మనిపించే లైట్లు బంద్.. కొత్త పాలసీ రూల్స్ ఇవే!

జియో యాప్స్ ఫ్రీ..

పైన పేర్కొన్న ప్లాన్‌లతో పాటు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి యాప్స్‌కు ఉచిత యాక్సెస్ కూడా లభించనుంది. మీ అవసరానికి తగ్గట్టుగా ఉన్న ప్లాన్ ను ఎంచుకొని.. మై జియో యాప్, వెబ్‌సైట్ ద్వారా ఈ రీఛార్జ్‌ చేసుకోవచ్చని జియో వర్గాలు సూచిస్తున్నాయి.

Also Read: జోన్ బెర్త్నల్ ‘ది పనిషర్: వన్ లాస్ట్ కిల్’ రివ్యూ.. ఎక్కడ చూడాలంటే?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×