E-Paper
Advertisement

Solar Mars Robot: సోలార్ చార్జర్ రోబో.. ఫోన్స్, టాప్‌టాప్స్ ఏదైనా చార్జింగ్.. ఇంట్లో ఎక్కడైనా తిరుగుతుంది..

Solar Mars Robot: సోలార్ చార్జర్ రోబో.. ఫోన్స్, టాప్‌టాప్స్ ఏదైనా చార్జింగ్.. ఇంట్లో ఎక్కడైనా తిరుగుతుంది..
Advertisement

Solar Mars Robot| అమెరికాలోని లాస్ వేగాస్‌లో జరుగుతున్న CES 2026 టెక్ ఎక్స్‌పో ఈవెంట్‌లో జాకరీ టెక్ కంపెనీ అనేక కొత్త ఎనర్జీ ప్రొడక్ట్స్ చూపించింది. వీటిలో ఒక ప్రొడక్ట్ అందరి దృష్టి ఆకర్షించింది. అదే సోలార్ మార్స్ బాట్. ఇది ఆటోమెటిక్‌గా కదిలే సోలార్ పవర్ ఛార్జింగ్ సిస్టమ్. ఇది క్లీన్, పోర్టబుల్, స్మార్ట్ ఎనర్జీని కొత్తగా అందిస్తుంది. పప్పీ లాగా ఫాలో అయ్యే ఈ రోబోట్ అందరి దృష్టిని ఆకర్షించింది.

సోలార్ మార్స్ బాట్ అంటే ఏమిటి?

సోలార్ మార్స్ బాట్ ఒక ఆటోమెటిక్‌ సోలార్ జనరేటర్. ఇది రోజంతా బెస్ట్ సూర్యకాంతి కోసం ఇంటి పరిసరాల్లో తిరుగుతూ ఉంటుంది. సాధారణ సోలార్ ప్యానెల్స్ ఒక చోటే ఉంటాయి కానీ ఇది కదిలుతూ ఎక్కువ ఎనర్జీ సేకరిస్తుంది. ఇండోర్, అవుట్‌డోర్ రెండింట్లోనూ పనిచేస్తుంది.

స్మార్ట్ డిజైన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు

Advertisement

జాకరీ ఈ రోబోట్‌లో AI పవర్డ్ విజన్, నావిగేషన్ సిస్టమ్స్ పెట్టింది. ఇది పరిసరాలను చుట్టూ తిరిగి స్కాన్ చేసి బెస్ట్ సన్‌లైట్ ఉన్న ప్రదేశానికి వెళ్తుంది. అడ్డంకులు దాటి, సూర్యుడిని ఫాలో అవుతూ పొజిషన్ మార్చుకుంటుంది. అలాగే ఛార్జింగ్ పూర్తయ్యాక యూజర్‌ వద్దకు వచ్చేస్తుంది. ఆ తరువాత మీ ఫోన్స్, టాప్‌టాప్స్ ఇతర గాడ్జెట్స్‌ను చార్జింగ్ అందిస్తుంది. ఇదంతా ఇందులో ఉన్న కెమెరాలతో ట్రాక్ చేస్తుంది.

అడ్వాన్స్‌డ్ సోలార్ ఛార్జింగ్ టెక్నాలజీ

సోలార్ మార్స్ బాట్‌లో రిట్రాక్టబుల్ (ఆటోమాటిక్ ఓపెన్/క్లోజ్) సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి. పూర్తిగా ఓపెన్ అయితే 300W సోలార్ పవర్ ఇస్తాయి. ఛార్జింగ్ సమయంలో ప్యానెల్స్ ఆటోమాటిక్‌గా విప్పుతాయి. సూర్యుడిని ట్రాక్ చేస్తూ టిల్ట్ అవుతాయి.

పోర్టబుల్ పవర్ స్టేషన్ ఫీచర్లు

Advertisement

ఇది మొబైల్ పవర్ స్టేషన్ లాగా పనిచేస్తుంది. 5kWh బ్యాటరీ ఉంది. మల్టిపుల్ అవుట్‌పుట్ పోర్ట్స్‌తో గాడ్జెట్లు, టూల్స్, అవుట్‌డోర్ ఎంటర్‌టైన్‌మెంట్ డివైస్‌లకు పవర్ ఇస్తుంది. స్టార్‌లింక్, రోబోట్స్, IoT డివైస్‌లను కూడా సపోర్ట్ చేస్తుంది.

బ్యాటరీ మానిటరింగ్, స్మార్ట్ కంట్రోల్స్

బ్యాటరీ లెవల్ తక్కువ అయితే ఆటోమాటిక్‌గా బేస్‌కు తిరిగి వచ్చి ఛార్జ్ అవుతుంది. మొబైల్ యాప్ ద్వారా బ్యాటరీ స్టేటస్, కంట్రోల్స్ చూడవచ్చు. రియల్ టైమ్ అప్‌డేట్స్ వస్తాయి.

రిమోట్ కనెక్టివిటీ ఫీచర్లు

4G, 5G సపోర్ట్ ఉంది. ఎక్కడి నుంచైనా పర్ఫార్మెన్స్ మానిటర్ చేయవచ్చు. రిమోట్ కంట్రోల్ సౌకర్యం ఉంది – అవుట్‌డోర్, రిమోట్ ప్లేస్‌లకు ఐడియల్.

Also Read: ఏఐతో డబ్బు సంపాదించడం ఎలా? సింపుల్ టిప్స్ ఇవిగో

అవుట్‌డోర్, కఠిన పరిస్థితుల్లో ఉపయోగకరం

డ్యూరబుల్ స్ట్రక్చర్‌తో తయారు చేశారు. వివిధ టెర్రైన్, వాతావరణాల్లో పనిచేస్తుంది. హోమ్, క్యాంప్‌సైట్, ఎమర్జెన్సీలకు సూటబుల్.

సోలార్ మార్స్ బాట్ ఏ సందర్భాల్లో ఉపయోగపడుతుంది?

సస్టైనబుల్ లివింగ్, ఎనర్జీ ఇండిపెండెన్స్‌కు బెస్ట్. అవుట్‌డోర్ వర్క్, పవర్ అవుటేజ్, ఆఫ్-గ్రిడ్ ప్లేస్‌లలో ఉపయోగం. ఎలక్ట్రిసిటీ లేని చోట్ల రిలయబుల్.

ఫ్యూచర్‌ సోలార్ పవర్

సోలార్ మార్స్ బాట్ సోలార్ టెక్నాలజీలో పెద్ద మార్పు. మొబిలిటీ, ఇంటెలిజెన్స్, రెన్యూవబుల్ ఎనర్జీని కలిపింది. ఆటోమేషన్‌తో క్లీన్ ఎనర్జీని మెరుగుపరుస్తుంది. పోర్టబుల్ సోలార్ ఛార్జింగ్‌ను రీడిఫైన్ చేయవచ్చు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×