E-Paper
Advertisement

సింగిల్ డోర్ Vs డబుల్ డోర్ ఫ్రిడ్జ్.. మీ లైఫ్‌స్టైల్‌కు ఏది బెస్ట్? ఓసారి చూసేయండి!

సింగిల్ డోర్ Vs డబుల్ డోర్ ఫ్రిడ్జ్.. మీ లైఫ్‌స్టైల్‌కు ఏది బెస్ట్? ఓసారి చూసేయండి!
Advertisement

Single vs Double Door Fridge: వంటగదికి అవసరమైన ఎలక్ట్రానిక్ వస్తువుల్లో ఫ్రిడ్జ్ కచ్చితంగా ఉంటుంది. అయితే మార్కెట్లో సింగిల్ డోర్, డబుల్ డోర్ అని రకరకాల మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. చూడ్డానికి అన్నీ బాగున్నట్లు అనిపించినా… రెండింటికీ చాలా తేడా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. మన లైఫ్ స్టైల్ ఆధారంగా సింగిల్ లేదా డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ను ఎంచుకోవచ్చని సూచిస్తున్నారు. ఇంతకీ సింగిల్, డబుల్ డోర్ ఫ్రిడ్జ్ లు ఎలాంటి పరిస్థితులకు సరిగ్గా సరిపోతాయే ఈ కథనంలో చూద్దాం.

సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్

చిన్న కుటుంబాలు, బ్యాచిలర్స్‌ కు సింగిల్ డోర్ ఫ్రిజ్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది. సాధారణంగా ఇవి 150 లీటర్ల నుండి 250 లీటర్ల కెపాసిటీతో లభిస్తాయి. ఇందులో ఫ్రీజర్ (ఐస్ భాగం), నార్మల్ ఫ్రిజ్ రెండు కలిపి ఒకే డోర్ లోపల ఉంటాయి. ఇవి సైజులో చిన్నగా ఉంటాయి కాబట్టి తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి. పైగా వీటి ధర కూడా చాలా తక్కువే. డబుల్ డోర్ ఫ్రిడ్జ్ లతో పోలిస్తే.. కరెంట్ బిల్లును సైతం బాగా ఆదా చేస్తాయి. అయితే వీటిలో ఫ్రీజర్ స్పేస్ తక్కువగా ఉండటం మైనస్ గా చెప్పవచ్చు. వారానికి ఒకసారైనా మాన్యువల్‌గా ‘డీఫ్రాస్ట్’ బటన్ నొక్కాల్సి ఉంటుంది.

డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్

Advertisement

ఇంట్లో నలుగురు అంత కంటే ఎక్కువ మంది సభ్యులు ఉంటే డబుల్ డోర్ ఫ్రిడ్జ్ తీసుకోవడం బెస్ట్. ఇవి 250 లీటర్ల నుండి 500 లీటర్ల పైగా కెపాసిటీతో అందుబాటులో ఉన్నాయి. ఈ ఫ్రిడ్జ్ ల పైభాగంలో ఫ్రీజర్ కోసం ఒక డోర్.. కూరగాయలు, మిగిలిన వస్తువుల కోసం కింద మరో డోర్ విడిగా ఉంటాయి. ఇందులో స్పేస్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద గిన్నెలు, ఎక్కువ కూరగాయలు స్టోర్ చేసుకోవచ్చు. ‘ఫ్రాస్ట్ ఫ్రీ’ టెక్నాలజీ ఉండటం వల్ల ఐస్ గడ్డ కట్టే సమస్య ఉండదు. అయితే సింగిల్ డోర్‌తో పోలిస్తే వీటి ధర ఎక్కువ. పైగా అధిక విద్యుత్ ను వినియోగించుకుంటాయి.

Also Read: రేపు దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్.. ఒక్క హైదరాబాద్‌లోనే 16,000 దుకాణాలు క్లోజ్!

లైఫ్ స్టైల్‌ను బట్టి.. ఏది బెస్ట్?

Advertisement

ఉద్యోగస్తులై ఉండి.. వారానికి సరిపడా కూరగాయలు, పండ్లు, పాలు ఒకేసారి తెచ్చి ఫ్రిజ్‌లో దాచుకోవాలనుకుంటే.. డబుల్ డోర్ ఫ్రిడ్జ్ బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది. అలాగే చికెన్, మటన్, ఫిష్ వంటివి ఎక్కువగా తెచ్చుకుని.. ఐస్ బాక్స్‌లో స్టోర్ చేసుకునే అలవాటు ఉంటే.. పెద్ద ఫ్రీజర్ స్పేస్ ఉండే డబుల్ డోర్ అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ ఇంట్లో వంట ఎక్కువ చేయని బ్యాచిలర్స్ అయ్యి ఉండి.. కేవలం వాటర్ బాటిల్స్, కొద్దిపాటి పాలు, పండ్లు పెట్టుకోవడానికి అయితే సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ సరిపోతోంది. డబుల్ డోర్ ఫ్రిడ్డ్ తో పోలిస్తే.. ఇది తక్కువ బడ్జెట్ లోనే లభిస్తుంది.

Also Read: రూ.30 వేల బడ్జెట్‌లో బెస్ట్ ఫ్రిడ్జ్ కావాలా? ఈ టాప్-4 మోడల్స్‌పై ఓ కన్నేయండి!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×