// // Cheapest Cruise Control Bikes: తక్కవ ధరలో క్రూజ్ కంట్రోల్ బైక్ కావాలా? ఈ 5 మోడళ్లు బెస్ట్! -->
E-Paper
Advertisement

తక్కవ ధరలో క్రూజ్ కంట్రోల్ బైక్ కావాలా? ఈ 5 మోడళ్లు బెస్ట్!

తక్కవ ధరలో క్రూజ్ కంట్రోల్ బైక్ కావాలా? ఈ 5 మోడళ్లు బెస్ట్!
Advertisement

Best Budget Bikes With Cruise Control: క్రూజ్ కంట్రోల్ ఫీచర్ అనేది ఇప్పటి వరకు ఖరీదైన స్పోర్ట్స్, టూరింగ్ బైక్‌ల్లో మాత్రమే కనిపించేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారుతోంది. సాధారణంగా రోజూ ఆఫీస్‌ కు వెళ్లే వాళ్లు, లాంగ్ రైడ్స్ చేసే యువతను ఆకట్టుకునేందుకు కంపెనీలు తక్కువ చౌకైన బైక్‌ల్లో కూడా ఈ ఫీచర్‌ను అందిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న క్రూజ్ కంట్రోల్ ఫీచర్‌ తో వచ్చే అత్యంత చౌకైన 5 బైక్‌ల గురించి ఇప్పుడు చూద్దాం.

⦿ హీరో గ్లామర్ X

హీరో మోటోకార్ప్ ఈ ఫీచర్‌ ను లో కాస్ట్ బైక్‌లో అందించి అందరినీ ఆశ్చర్యపరిచింది. గ్లామర్ X ప్రారంభ ధర రూ. 86,567 (ఎక్స్ షోరూమ్) కాగా, డిస్క్ వేరియంట్ ధర రూ. 95,786 వరకు ఉంటుంది. ఈ బైక్‌ లో ఇచ్చిన క్రూజ్ కంట్రోల్ ఫీచర్ హైవే రైడింగ్‌ ను చాలా ఈజీగా మార్చుతుంది. ముఖ్యంగా రోజూ ఎక్కువ దూరం ప్రయాణించే వారికి  ఈ బైక్ మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

⦿ హీరో ఎక్స్‌ట్రీమ్ 125R

Advertisement

ఈ బైక్ 124.7cc సింగిల్ సిలిండర్ ఇంజన్‌ తో పని చేస్తుంది. ఈ ఇంజన్ 11.5 hp పవర్, 10.5 Nm టార్క్ ఇస్తుంది. 5 స్పీడ్ గేర్‌ బాక్స్‌ తో వచ్చే ఈ బైక్‌ టాప్ వేరియంట్‌ లో క్రూజ్ కంట్రోల్ ఫీచర్ అందిస్తున్నారు. డ్యూయల్ ఛానల్ ABS వేరియంట్ ధర సుమారు రూ. 1.07 లక్షలు (ఎక్స్ షోరూమ్) ఉంటుంది. స్టైలిష్ డిజైన్‌ తో పాటు ఆధునిక ఫీచర్లు కావాలనుకునేవారికి  బాగుంటుంది.

⦿ హీరో ఎక్స్‌ట్రీమ్ 160R 4V

ఈ బైక్ 163.2cc ఎయిర్ ఆయిల్ కూల్డ్ ఇంజన్‌ తో వస్తుంది. ఈ ఇంజన్ 17 hp పవర్, 14.6 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ETB వేరియంట్‌ లో క్రూజ్ కంట్రోల్ ఫీచర్ అందుబాటులో ఉంది. దీని ధర రూ. 1.36 లక్షల వరకు ఉంటుంది. సిటీ ప్రయాణాలతో పాటు వీకెండ్ రైడ్స్ చేసే వారికి ఇది మంచి బ్యాలెన్స్ బైక్‌ గా ఉంటుంది.

⦿ టీవీఎస్ అపాచీ RTX 300

Advertisement

ఈ బైక్‌ లో అన్ని వేరియంట్లలో క్రూజ్ కంట్రోల్ స్టాండర్డ్‌ గా ఇస్తున్నారు. ఇందులో 299cc లిక్విడ్ ఆయిల్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఇది 35.5 hp పవర్, 28.5 Nm టార్క్ ఇస్తుంది. ధర సుమారు రూ. 1.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అడ్వెంచర్ టూరింగ్ బైక్ కొనాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్.

⦿ టీవీఎస్ అపాచీ RTR 310

టీవీఎస్ అపాచీ RTR 310 కూడా ఈ లిస్టులో ఉంది. ఇందులో 312cc లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉండి 35 hp పవర్ అందిస్తుంది. క్రూజ్ కంట్రోల్‌ తో పాటు పలు అత్యాధునిక ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. దీని ప్రారంభ ధర రూ. 2.24 లక్షలు (ఎక్స్ షోరూమ్). స్పోర్టీ లుక్‌ తో పాటు టెక్నాలజీ ఫీచర్లు కోరుకునేవారికి ఇది సరైన ఆప్షన్ గా చెప్పవచ్చు.

Read Also: హైబ్రిడ్ కార్ల అమ్మకాల్లో టయోటా జోష్.. ఏకంగా 3 లక్షల మార్క్ క్రాస్!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×