E-Paper
Advertisement

బడ్జెట్ ధరలో ప్రీమియం వైర్డ్ హెడ్‌ఫోన్స్.. సెన్హైజర్ కొత్త టైప్-సి గ్యాడ్జెట్స్ లాంచ్, పూర్తి వివరాలు మీ కోసం!

బడ్జెట్ ధరలో ప్రీమియం వైర్డ్ హెడ్‌ఫోన్స్.. సెన్హైజర్ కొత్త టైప్-సి గ్యాడ్జెట్స్ లాంచ్, పూర్తి వివరాలు మీ కోసం!
Advertisement

USB Type-C Headphones: ప్రముఖ ఆడియో బ్రాండ్ Sennheiser భారతదేశంలో రెండు సరికొత్త వైర్డ్ హెడ్‌ఫోన్లను లాంచ్ చేసింది. CX 80U, HD 400U పేరుతో వచ్చిన ఈ మోడల్స్ స్పెషాలిటీ ఏంటంటే.. వీటికి నేరుగా USB Type-C కనెక్టివిటీ ఉంటుంది. ఇప్పుడు వచ్చే చాలా స్మార్ట్‌ఫోన్లలో హెడ్‌ఫోన్ జాక్ ఉండట్లేదు కదా.. అందుకే ఎలాంటి అడాప్టర్లు వాడకుండా నేరుగా ప్లగ్ చేసుకుని వాడుకునేలా వీటిని తయారు చేశారు.

అద్భుతమైన సౌండ్ క్వాలిటీ..

ఈ హెడ్‌ఫోన్లు కేవలం చూడటానికే కాదు.. మ్యూజిక్ వినడానికి కూడా చాలా బాగుంటాయి. వీటిలో 24-బిట్/96kHz హై-రిజల్యూషన్ ఆడియో సపోర్ట్ ఉంటుంది. దీంతో మనం వినే పాటలు గానీ, ఆడే గేమ్స్‌లో సౌండ్స్ గానీ ఎక్కడా క్వాలిటీ తగ్గకుండా ఒరిజినల్ లాగా వినిపిస్తాయి. వైర్‌లెస్ హెడ్‌ఫోన్లలాగా వీటిని ఛార్జింగ్ పెట్టే తలనొప్పి ఉండదు. అలాగే బ్లూటూత్ పేరింగ్ ఇబ్బందులు అస్సలు ఉండవు. గేమర్స్‌కైతే సౌండ్ లేట్ అవ్వకుండా చాలా క్లియర్‌గా వినిపిస్తుంది.

Advertisement

Also Read: భారీగా తగ్గిన Redmi Note 13 5G ధర.. స్టాక్ అయిపోయే లోపే ఆఫర్‌ను పట్టేయండి బ్రో!

ధర ఎంతంటే?

మంచి బడ్జెట్‌లో ఇయర్ ఫోన్స్ కావాలనుకునే వారి కోసం CX 80U మోడల్‌ను తెచ్చారు. దీని ధర రూ.1,990 మాత్రమే. ఇది బ్లాక్, వైట్, లేత గులాబీ రంగుల్లో లభిస్తుంది. ఇక ఫుల్ ప్రీమియం లుక్, ఓవర్ ఇయర్ అనుభవం కావాలనుకునే వారి కోసం HD 400U మోడల్ ఉంది. దీని ధర రూ.5,990. ఇవి సెన్హైజర్ వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి.

స్పెసిఫికేషన్స్ ఇలా..

Advertisement

CX 80U లో 9.7mm డైనమిక్ డ్రైవర్లను వాడారు. ఇది కేవలం 14 గ్రాముల బరువు మాత్రమే ఉండటం వల్ల చెవిలో పెట్టుకున్నా అసలు భారంగా అనిపించదు. ఇక HD 400U విషయానికి వస్తే.. ఇది క్లోజ్డ్ బ్యాక్ డిజైన్‌తో వస్తుంది. దీంతో పాటలు వింటున్నప్పుడు బయటి సౌండడ్ అస్సలు వినిపించదు. అలాగే వీటిని ఈజీగా మడతపెట్టుకుని బ్యాగులో పెట్టుకోవచ్చు. రెండింటిలోనూ కాల్స్ మాట్లాడుకోవడానికి నాణ్యమైన మైక్రోఫోన్లు కూడా ఉన్నాయి.

కంఫర్ట్ కోసం స్పెషల్ ఫీచర్స్..

మన చెవులకు తగ్గట్టుగా ఉండేలా CX 80Uతో పాటు మూడు రకాల ఇయర్ టిప్స్ ఇస్తున్నారు. దీని వైర్ పొడవు 1.2 మీటర్లు ఉంటుంది. ఇక పెద్ద హెడ్‌ఫోన్ HD 400Uలో 1.4 మీటర్ల కేబుల్ వస్తుంది. దీన్ని అవసరమైతే విడదీయవచ్చు. ఫోన్లు మాత్రమే కాదు.. ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లకు కూడా ఇవి చక్కగా సెట్ అయిపోతాయి. వైర్డ్ హెడ్‌ఫోన్లు ఇష్టపడే వారికి ఇది మంచి ఆప్షన్.

Also Read: యాపిల్ ఫ్యాన్స్‌కు పండగే.. iPhone 17పై ఊహించని డిస్కౌంట్, ఎక్కడో తెలుసా?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×