// // White House shooter Thomas Allen: చదువులో గోల్డ్ మెడలిస్ట్.. ఇప్పుడు వైట్‌హౌస్ షూటర్ ఎవరీ థామస్ అలెన్? -->
E-Paper
Advertisement

చదువులో గోల్డ్ మెడలిస్ట్.. ఇప్పుడు వైట్‌హౌస్ షూటర్.. ఎవరీ థామస్ అలెన్?

చదువులో గోల్డ్ మెడలిస్ట్.. ఇప్పుడు వైట్‌హౌస్ షూటర్.. ఎవరీ థామస్ అలెన్?
Advertisement

White House shooter Thomas Allen: అమెరికాలొ వాషింగ్టన్ డీసీలోని వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ విందు కార్యక్రమంలో తుపాకీతో కలకలం సృష్టించిన నిందితుడిని కాలిఫోర్నియాలోని టోరెన్స్‌కు చెందిన 31 ఏళ్ల కోల్ థామస్ అలెన్గా అధికారులు గుర్తించారు. అలెన్ వద్ద షాట్‌గన్, హ్యాండ్‌గన్ అనేక కత్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

కోల్ థామస్ అలెన్ ఒక అత్యున్నత విద్యావంతుడు, నిపుణుడు కావడం గమనార్హం. ఆయన లాస్ ఏంజిల్స్ కేంద్రంగా మెకానికల్ ఇంజనీర్, కంప్యూటర్ సైంటిస్ట్, ఇండిపెండెంట్ గేమ్ డెవలపర్‌గా పనిచేస్తున్నాడు. 2017లో ప్రతిష్టాత్మకమైన కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (Caltech) నుండి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందాడు. అనంతరం కాలిఫోర్నియా స్టేట్ యూనివర్శిటీ-డొమింగ్యూజ్ హిల్స్ నుండి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశాడు.

Advertisement

అలెన్ కెరీర్‌లో అనేక మైలురాళ్లు ఉన్నాయి. కాల్టెక్‌లో చదువుతున్న సమయంలో Blitzkrieg Bots రోబోటిక్స్ టీమ్‌లో సభ్యుడిగా ఉండి, 2016లో జరిగిన రోబోటిక్ వెహికల్ డిజైన్ పోటీలో విజయం సాధించాడు. అంతేకాకుండా, నాసా (NASA) జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీలో సమ్మర్ అండర్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ ఫెలోషిప్‌లో పాల్గొన్నాడు. దీనివల్ల ఆయనను కొన్ని నివేదికల్లో ‘నాసా ఫెలో’గా కూడా అభివర్ణించారు. వృత్తిపరంగా IJK కంట్రోల్స్స‌ లో మెకానికల్ ఇంజనీర్‌గా, కాల్టెక్‌లో టీచింగ్ అసిస్టెంట్‌గా ప‌ని చేశాడు.

కేవలం టెక్ లోనే కాకుండా, అలెన్ ఒక టీచ‌ర్ గా కూడా గుర్తింపు పొందాడు. లాస్ ఏంజిల్స్ ఏరియాలోని C2 ఎడ్యుకేషన్ లో పార్ట్ టైమ్ టీచర్‌గా పనిచేస్తూ, గతంలో లాస్ ఏంజిల్స్ కౌంటీలో టీచర్ ఆఫ్ ద మంత్ గా కూడా ఎంపికయ్యాడు. గేమింగ్ రంగంపై ఆసక్తితో మాలిక్యులర్ కెమిస్ట్రీ ఆధారంగా Steam ప్లాట్‌ఫారమ్ కోసం ఒక వీడియో గేమ్‌ను అభివృద్ధి చేశాడు. కాల్పుల ఘటనకు ముందు, ఆయన అంతరిక్ష నేపథ్యంలో సాగే కొత్త ‘టాప్-డౌన్ షూటర్’ యుద్ధ గేమ్‌ను రూపొందించే పనిలో ఉన్నట్లు తన సోషల్ మీడియా ప్రొఫైల్స్‌లో పేర్కొన్నాడు.

Advertisement

Read Also: తూటాలు పేలుతాయంటూ.. కాల్పులకు ముందు ట్రంప్ ప్రెస్ సెక్రటరీ వ్యాఖ్యలు వైరల్!

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×