E-Paper
Advertisement

Gaming Laptops Discount: గేమింగ్ ల్యాప్‌టాప్స్‌పై రూ.40000 వరకు తగ్గింపు.. అమెజాన్ సూపర్ డీల్స్

Gaming Laptops Discount: గేమింగ్ ల్యాప్‌టాప్స్‌పై రూ.40000 వరకు తగ్గింపు.. అమెజాన్ సూపర్ డీల్స్
Advertisement

Gaming Laptops Discount| దేశవ్యాప్తంగా అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ప్రారంభించింది. ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయన్స్‌లపై పెద్ద డిస్కౌంట్లు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లపై మంచి ఆఫర్లు దొరుకుతున్నాయి. ఈ సారి గేమింగ్ ల్యాప్‌టాప్‌లు ప్రధాన హైలైట్‌గా నిలిచాయి. కొన్ని మోడల్స్‌పై గరిష్టంగా రూ.40,000 వరకు ఆదా చేయవచ్చు.

బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌తో అదనపు సేవింగ్స్

అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు ప్రత్యేక ఎర్లీ యాక్సెస్ ఉంది. SBI క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తే ప్రైమ్ యూజర్లకు 12.5 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు. నాన్-ప్రైమ్ కస్టమర్లకు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఉంది. అమెజాన్ పే ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ వస్తుంది. గోల్డ్ మెంబర్లకు కూడా 5 శాతం క్యాష్‌బ్యాక్ రివార్డ్స్ కూడా లభిస్తాయి. చాలా ప్రొడక్ట్స్‌పై ఎక్స్ఛేంజ్ బోనస్ ఉంది. పాత డివైస్ ఇచ్చి మరింత తక్కువ ధరకు కొనవచ్చు. కొన్ని ల్యాప్‌టాప్‌లకు నో-కాస్ట్ EMI ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

ఏసర్ గేమింగ్ ల్యాప్‌టాప్ డీల్స్

Advertisement

ఏసర్ నైట్రో V15 ల్యాప్‌టాప్ సేల్‌లో అతి తక్కువ ధరకు దొరుకుతోంది. ఒరిజినల్ ధర రూ.98,799. సేల్ ధర రూ.74,990కి తగ్గింది. ఈ ల్యాప్‌టాప్‌లో 15.6 ఇంచ్ డిస్‌ప్లే ఉంది. తక్కువ ధరలో మంచి పెర్ఫామెన్స్ కావాలనుకునే గేమర్లకు ఇది బెస్ట్ ఆప్షన్.

HP, Asus గేమింగ్ ల్యాప్‌టాప్‌లు తక్కువ ధరలో

HP స్మార్ట్‌చాయిస్ విక్టస్ 13th జెన్ మోడల్ డిస్కౌంట్‌లో ఉంది. ఒరిజినల్ ధర రూ.1,24,319. సేల్‌లో రూ.99,990కి దొరుకుతోంది. Asus TUF A15 ల్యాప్‌టాప్ కూడా పెద్ద డిస్కౌంట్‌తో లభిస్తుంది. పొందింది. ఒరిజినల్ ధర రూ.83,990 నుంచి రూ.64,990కి తగ్గింది. బడ్జెట్‌లో గేమింగ్ ల్యాప్‌టాప్ కావాలనుకునేవారికి ఇది చాలా మంచి డీల్.

Asus గేమింగ్ V16పై భారీ రూ.40,000 డిస్కౌంట్

Advertisement

Asus గేమింగ్ V16 మోడల్‌పై అతి పెద్ద తగ్గింపు ఉంది. ఒరిజినల్ ధర రూ.1,49,990. ఇప్పుడు రూ.1,09,990కి లభిస్తోంది. ఫ్లాట్ రూ.40,000 ఆదా అవుతుంది. హై-ఎండ్ గేమింగ్ పెర్ఫామెన్స్ కావాలనుకునేవారికి ఇది సూపర్ ఆఫర్.

Also Read: ప్రాణాపాయ స్థితిలో ఒక్క క్లిక్‌తో సాయం మీ చెంతకు.. స్మార్ట్‌ఫోన్‌లో ఈ ఫీచర్ గురించి తెలుసా?

లెనోవో గేమింగ్ ల్యాప్‌టాప్ మంచి డీల్

లెనోవో LOQ ఇంటెల్ కోర్ i7 13th జెన్ మోడల్ డిస్కౌంట్‌లో ఉంది. ఒరిజినల్ ధర రూ.1,62,090. సేల్ ధర రూ.1,15,990కి తగ్గింది. సీరియస్ గేమర్లు, పవర్ యూజర్లకు ఇది గొప్ప అవకాశం.

అమెజాన్ సేల్ – గేమింగ్ డీల్స్

ఫెస్టివల్ సేల్స్‌లో అమెజాన్ ఎప్పుడూ బెస్ట్ డీల్స్‌తో తక్కువ ధరలు ఆఫర్ చేస్తుంది. ఈ ఆఫర్లతో గేమింగ్ సెటప్‌ని చౌకగా అప్‌గ్రేడ్ చేయవచ్చు. స్టాక్ పరిమితంగా ఉంది కాబట్టి త్వరగా కొనుగోలు చేయాలి. ఈ సేల్‌ని మిస్ చేయకండి!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×