// // టోస్టర్ vs శాండ్‌విచ్ మేకర్.. ఏది బెస్ట్ ఛాయిస్? -->
E-Paper
Advertisement

టోస్టర్ vs శాండ్‌విచ్ మేకర్.. మార్నింగ్ టిఫిన్ కోసం.. ఏది బెస్ట్ ఛాయిస్?

టోస్టర్ vs శాండ్‌విచ్ మేకర్.. మార్నింగ్ టిఫిన్ కోసం.. ఏది బెస్ట్ ఛాయిస్?
Advertisement

Sandwich Maker vs Toaster: ప్రస్తుత బిజీ జీవితాల్లో ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ చేసుకోవడం కూడా కష్టంగా మారుతోంది. అయితే తక్కువ సమయంలో రుచికర టిఫిన్ చేసుకోవడానికి కొన్ని రకాల కిచెన్ పరికరాలు మార్కెట్లో లభిస్తున్నాయి. వాటిలో ముందుగా గుర్తుకు వచ్చేవి ‘శాండ్‌విచ్ మేకర్’, ‘టోస్టర్’. అయితే ఈ రెండింటిలో ఏది బెస్ట్? ఏది కొంటే పెట్టిన ప్రతీ రూపాయికి న్యాయం జరుగుతుంది? ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

టోస్టర్ వల్ల బెనిఫిట్స్

ఉదయం పూట చాలా వేగంగా టిఫిన్ రెడీ చేయాలనుకునేవారికి టోస్టర్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పవచ్చు. కేవలం రెండు నిమిషాల్లో బ్రెడ్ ముక్కలను క్రిస్పీగా ఎంతో రుచికరంగా ఇది మార్చేస్తుంది. బ్రెడ్ స్లైస్‌లను ఇందులో పెట్టి బటన్ నొక్కితే.. నిమిషాల వ్యవధిలోనే కరకరలాడే టోస్ట్ సిద్ధమవుతుంది. దీని ధర కూడా శాండ్‌విచ్ మేకర్‌తో పోలిస్తే తక్కువగా ఉండటం విశేషం. అయితే దీని వల్ల బెనిఫిట్స్ చాలా తక్కువనే చెప్పాలి. కేవలం బ్రెడ్ టోస్ట్ చేయడానికి మాత్రమే ఇది పనికొస్తుంది. ఇందులో చీజ్, కూరగాయలు, ఇతర స్టఫింగ్స్ పెట్టడానికి వీలులేకపోవడం మైనస్ గా చెప్పవచ్చు.

శాండ్‌విచ్ మేకర్

Advertisement

బ్రెడ్ ముక్కలు తినడం బోర్ కొట్టిన వారికి శాండ్ విచ్ మేకర్ అద్భుతమైన ప్రత్యామ్నయంగా నిలుస్తుంది. ఇది బ్రెడ్‌ను కాల్చడమే కాకుండా లోపల పెట్టిన చీజ్, ఆలుగడ్డ, కూరగాయలను చక్కగా ఉడికించి పర్ఫెక్ట్ గ్రిల్డ్ శాండ్‌విచ్‌ను అందిస్తుంది. కొన్ని మల్టీ-ఫంక్షనల్ మోడల్స్‌లో వాఫ్ఫిల్స్ (Waffles) సైతం చేసుకోవచ్చు. చిరుతిళ్లు కూడా గ్రిల్ చేసుకోవచ్చు. పిల్లలున్న ఇళ్లకు ఇది చాలా ఉపయోగకరమని నిపుణులు అంటున్నారు. ఇక మైనస్ ల విషయానికి వస్తే.. టోస్టర్‌తో పోలిస్తే ఇది వేడెక్కడానికి చాలా సమయం తీసుకుంటుంది. అలాగే దీన్ని క్లీన్ చేయడానికి సైతం శ్రమించాల్సిందే. అలాగే కిచెన్ లో ఇది ఎక్కువ ప్లేస్ ను ఆఖ్యుపై చేస్తుంది.

Also Read: ఏసీలు లేకుండానే ఊరంతా చల్లదనం.. చైనా మైండ్ బ్లోయింగ్ ఐడియా!

కిచెన్‌కు ఏది బెస్ట్?

Advertisement

ఉదయాన్నే వండుకునే సమయం లేక కేవలం బ్రెడ్-బటర్ లేదా బ్రెడ్-జామ్ తిని పరుగు తీసే అలవాటు ఉంటే బడ్జెట్‌లో వచ్చే టోస్టర్ బెస్ట్ ఆప్షన్. అలా కాకుండా ఇంట్లో పిల్లలు ఉండి, రోజువారీ టిఫిన్లలో వెరైటీ కోరుకునే వారికోసం, కూరగాయలతో చేసే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ చేయాలనుకునే వారికి శాండ్‌విచ్ మేకర్ ఉపయోగకరంగా ఉంటుంది. ఇది కేవలం బ్రేక్‌ఫాస్ట్ గానే కాకుండా ఈవెనింగ్ స్నాక్స్‌కు కూడా చక్కగా పనికొస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

Also Read: ఏఐ క్లీనిక్స్.. డాక్టర్ లేకుండానే సెకన్లలో రోగ నిర్ధరణ, చికిత్స.. మందులు కూడా అవే ఇచ్చేస్తాయ్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×