E-Paper
Advertisement

సోష‌ల్ మీడియాపై దండెత్తిన కెమెరామెన్ గంగ‌తో రాంబాబు!

సోష‌ల్ మీడియాపై దండెత్తిన కెమెరామెన్ గంగ‌తో రాంబాబు!
Advertisement

కెమెరామెన్ గంగ‌తో రాంబాబు! ప‌వ‌న్ క‌ళ్యాణ్.. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో తీసిన సినిమా. పూరీ డైరెక్ట‌ర్‌. ఇందులో పూరీ పేరుకే డైరెక్ట‌ర్‌. అంతా ప‌వ‌న్ పైత్య‌మే క‌నిపిస్తుంది. తెలంగాణ ఉద్య‌మం.. కేసీఆర్‌, కేటీఆర్‌.. విజ‌య‌శాంతి.. ! ఈ పాత్ర‌ల‌ను ఆధారంగా చేసుకుని తీసిన సినిమా.

తెలంగాణ ఏర్ప‌డిన త‌రువాత త‌ను 11 రోజుల పాటు అన్నం ముట్ట‌లేద‌ని అన్న మాట‌ల్లోని భావ‌మే ఈ సినిమాలో క‌నిపిస్తుంది. త‌ను చెప్పాల‌నుకున్న భావాల‌న్నీ చిన్న చిన్న జ‌బ‌ర్ద‌స్త్ స్కిట్ల‌న్నీ క‌లిపిన‌ట్టుగా ఉన్న సినిమా ఇది. స‌రే, అస‌లు విష‌యానికొద్దాం.. ఈ సినిమాలో మీడియా మీదున్న త‌న క‌సంతా తీర్చుకున్నాడు ప‌వ‌న్‌.

Advertisement

అస‌లు మీడియా అంటే ఎట్లుండాలి? అది చేయాల్సిన క‌ర్త‌వ్యాలేమిటీ? కానీ ఇప్పుడు మీడియా ఏం చేస్తున్న‌ది..? బ్రేకింగుల కోసం.. రేటింగుల కోసం ఎలా దిగ‌జారుతున్న‌ది..? అనే నీతి సూత్రాలు బాగా చెప్పాల‌నుకున్నాడు.

బ్ర‌హ్మానందంను ఓ మీడియా జోక‌ర్‌గా పెట్టి .. చెడామ‌డా చెంప‌లు వాయిస్తూ త‌న క‌చ్చ తీర్చుకునే విధంగా మీడియాపై ప‌వ‌న్ ప్ర‌వ‌చ‌నాలు ఇందులో పుష్క‌లంగా ఉంటాయి. అచ్చంగా మళ్లీ అదే వేషం క‌ట్టాడు నిజం జీవితంలో. కెమెరామెన్ గంగ‌తో రాంబాబు.. పాత్ర‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేశాడు ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న సేనాని.

Advertisement

ముచ్చ‌టగా తాజాగా ఓ వీడియో విడుద‌ల చేశాడు. గౌర‌విస్తూ విమ‌ర్శించండి. ప్ర‌జాస్వామ్య‌యుతంగా విమ‌ర్శ‌లు చేయండి. అంతేగానీ హ‌ద్దులు దాటారో ఒక్కొక్క‌డి తాట తీస్తా..! కాస్కోండి అని వార్నింగ్ రూపంలో ఉన్న చిన్న‌పాటి వీడియో సందేశ‌మ‌ది. సందేశం అనే బ‌దులు.. రాంబాబు వ‌దిలిన మీడియాపై నీతి సూత్రాలు.. పాటించాల్సిన ప‌ద్ద‌తులు.. నిబంధ‌నావ‌ళి..! అని అనుకోవ‌చ్చు.

ఎందుకంటే ఆయ‌న ఈ మ‌ధ్య ఏ మాత్రం చిన్న‌పాటి విమ‌ర్శ‌ల‌ను కూడా త‌ట్టుకోవ‌డం లేదు. ఆ సినిమా పాత్ర‌ల నుంచి నిజ జీవిత పాత్ర‌లోకి రావ‌డం లేదు. అందులోనూ.. రాజ‌కీయ ప‌రిణ‌తి సాధించిన లీడ‌ర్‌గా ఎద‌గ‌కుండా ఇంకా ఓన‌మాల స్టేజిలోనే ఆగిపోయి ఉన్నాడు. అందుకే ప్రాక్టిక‌ల్ జీవిత పాఠాల‌ను నేర్చుకోని ఓ అప‌రిప‌క్వ లీడ‌ర్ మాట‌ల్లాగే ఉన్న‌దా వీడియో సందేశం.

ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ చేసిన రాజ‌కీయ విశ్లేష‌ణ‌పై అగ్గిమీద గుగ్గిల‌మై.. కొంప కొల్లేరు చేస‌కున్నంత ప‌ని చేశాడు. ఇది రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య కుంప‌టి పెట్టినంత ప‌నిచేసినా… మూర్ఖంగా త‌ను మాత్రం వెన‌క్కి త‌గ్గ‌లేదు. త‌ను చేసిన దాన్ని స‌మ‌ర్థించుకున్నాడు పైగా. ఇక తాజాగా కేవీఆర్ అట ఎవ‌రో యూట్యూబ‌ర్‌. ప్ర‌శ్న రావ‌ణ్ అని ఏపీ నేత‌ల‌పై ఏది పడితే అది మాట్లాడ‌టంతో అత‌న్ని బ‌ల‌వంతంగా తెలంగాణ కు వ‌చ్చి అరెస్టు చేసి తీసుకుపోయారు.

తెలంగాణ పోలీసులు కూడా మంచిగానే స‌హ‌కరించారు. ఈ విష‌యంలో తెలంగాణ సీఎం రేవంత్ కూడా ప‌వ‌న్ మ‌న‌స్త‌త్వంతో ఏకీభ‌వించిన‌ట్టుగానే ప్ర‌వ‌ర్తిస్తున్నారు. అది వేరే విష‌యం. ఇక ఇది ఏపీలో ర‌చ్చ రాజ‌కీయానికి తెర లేపింది. అందుకే సోష‌ల్ మీడియాకు రాంబాబు త‌ర‌హాలో ఓ వార్నింగ్ వీడియో విడుద‌ల చేసి .. త‌ను ఇంకా రాంబాబు పాత్ర‌లోనే ఉన్నాన‌ని మ‌రోసారి రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేసుకున్నాడు.

రాజ‌కీయాల్లో ఇవ‌న్నీ కామ‌న్ రాంబాబు గారు.. మీరింకా ఎద‌గాలె.. ఇవ‌న్నీ ప‌ట్టించుకోవ‌ద్దు. ప‌ట్టించుకుంటే గొంగ‌ట్లో అన్నం తింటు వెంట్రుక‌లు ఏరిన‌ట్టే ఉంటుంది..! ఆ రాంబాబు పాత్ర‌ను వ‌దిలేస్తే త‌ప్ప‌.. ఇది నీకిప్పుడు అర్థం కాదులే..! అని అనుకుంటున్నారంట ఏపీ జ‌నాలు

Related News

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

ఇత‌డు ఫామ్‌హౌజ్‌లోనే ఎందుకు? అత‌డు ఫామ్‌లో ఉన్నాడెందుకు!?

Big Stories

Advertisement
×