E-Paper
Advertisement

షాకింగ్ ఫీచర్లతో శాంసంగ్ కొత్త స్మార్ట్‌వాచ్‌లు.. మార్కెట్లోకి వచ్చేది అప్పుడే!

షాకింగ్ ఫీచర్లతో శాంసంగ్ కొత్త స్మార్ట్‌వాచ్‌లు.. మార్కెట్లోకి వచ్చేది అప్పుడే!
Advertisement

Samsung Smartwatches: ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ తమ మోస్ట్ అవేటెడ్ స్మార్ట్‌వాచ్‌లను మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. గతంలో వచ్చిన గెలాక్సీ వాచ్ అల్ట్రాకు సీక్వెల్‌గా Galaxy Watch Ultra 2తో పాటు Galaxy Watch 9 సిరీస్‌ను కంపెనీ త్వరలోనే లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ రెండు వాచ్‌లు ఓ కీలక అనుమతిని సాధించడమే దీనికి కారణం.

త్వరలోనే చైనాలో ఎంట్రీ..

ఈ కొత్త స్మార్ట్‌వాచ్‌లు చైనాకు చెందిన 3C సర్టిఫికేషన్ డేటాబేస్‌లో కనిపించాయి. అక్కడ SM-L3550, SM-L7150 మోడల్ నెంబర్లతో ఇవి లిస్ట్ అయ్యాయి. ఈ మోడల్ నెంబర్లు Galaxy Watch Ultra 2, Galaxy Watch 9కి సంబంధించినవేనని టెక్ వర్గాలు చెబుతున్నాయి. చైనా సర్టిఫికేషన్ లభించడంతో ఈ రెండు వాచ్‌లు అక్కడ అతి త్వరలోనే విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఛార్జింగ్ ఫీచర్లు ఇవే..

Advertisement

ఈ సర్టిఫికేషన్ ద్వారా లీకైన వివరాల ప్రకారం.. ఈ రెండు కొత్త స్మార్ట్‌వాచ్‌లు కూడా 10W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేయనున్నాయి. దీనికోసం ప్రత్యేకమైన వైర్‌లెస్ ఛార్జింగ్ అందించనున్నారు. గతంలో వచ్చిన Galaxy Watch Ultra, Galaxy Watch 8 మోడళ్లలో ఉన్న ఛార్జింగ్ స్పీడ్‌నే ఈ కొత్త వెర్షన్లలోనూ శాంసంగ్ కొనసాగిస్తున్నట్లు దీని ద్వారా స్పష్టమవుతోంది.

Also Read: వైర్‌లెస్ ఛార్జింగ్ నుంచి ప్రో లెవెల్ కెమెరా వరకు.. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్సే ఇప్పుడు ట్రెండింగ్‌లో టాప్!

వెబ్‌సైట్‌లో లీకైన పేరు..

Advertisement

ఈ వాచ్‌ల గురించిన లీకులు రావడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు IMEI డేటాబేస్‌లో కూడా ఇవి కనిపించాయి. అంతేకాదు.. ఇటీవల శాంసంగ్ కెనడా అధికారిక వెబ్‌సైట్‌లో గెలాక్సీ వాచ్ 9 అనే పేరు కూడా పొరపాటున ప్రత్యక్షమైంది. దీన్ని బట్టి చూస్తే ఈ స్మార్ట్‌వాచ్‌ల లాంచ్ చాలా దగ్గర్లోనే ఉందని అర్ధమవుతోంది.

ఈ వేసవిలోనే విడుదల..

శాంసంగ్ కంపెనీ ఈ రెండు కొత్త స్మార్ట్‌వాచ్ సిరీస్‌లను ఈ వేసవిలోనే మార్కెట్లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. వీటితో పాటే సరికొత్త గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ల సిరీస్‌ను కూడా గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నట్లు సమాచారం. గ్లోబల్ మార్కెట్‌తో పాటు మనదేశంలోనూ ఇవి ఒకేసారి విడుదలయ్యే అవకాశం ఉంది.

Also Read: చైనాలో దుమ్మురేపిన ఫోన్ ఇక ఇండియాలోకి.. ఫీచర్లు చూస్తే వావ్ అనకుండా ఉండలేరు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×