E-Paper
Advertisement

హ్యుందాయ్ నుంచి క్రేజీ ప్లాన్.. క్రెటా హైబ్రిడ్ సహా కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

హ్యుందాయ్ నుంచి క్రేజీ ప్లాన్.. క్రెటా హైబ్రిడ్ సహా కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!
Advertisement

Next Gen Hyundai Creta Hybrid: భారత కారు మార్కెట్ లో హైబ్రిడ్ వెహికల్స్ డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో హ్యుందాయ్ కూడా తన SUV లైనప్‌ లో కీలక మార్పులు చేయడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే టయోటా, మారుతి సుజుకి లాంటి సంస్థలు హైబ్రిడ్ సెగ్మెంట్‌ లో బలంగా సత్తా చాటుతున్న నేపథ్యంలో హ్యుందాయ్ కూడా  కొత్త హైబ్రిడ్ SUVలను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

న్యూ జెనరేషన్ క్రెటా హైబ్రిడ్

హ్యుందాయ్ కొత్త లైనప్‌ లో ప్రధాన ఆకర్షణగా నెక్ట్స్ జనరేషన్ క్రెటా హైబ్రిడ్ నిలవనుంది. భారత మార్కెట్లో మంచి ఆదరణ పొందిన SUVలలో క్రెటా ఒకటి కావడంతో, దీని హైబ్రిడ్ వెర్షన్‌ పై భారీ అంచనాలు ఉన్నాయి. అటు SX3 కోడ్‌ నేమ్‌ తో రెడీ అవుతున్న ఈ మోడల్ 2027 నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు, హ్యుందాయ్ నుంచి వచ్చే మొదటి హై వాల్యూమ్ హైబ్రిడ్ SUVగా  గుర్తింపు తెచ్చుకోనుంది.

కొత్త K3 ప్లాట్‌ ఫారమ్‌పై తయారీ

Advertisement

నెక్ట్స్ జెనరేషన్ క్రెటా పూర్తిగా కొత్త K3 ప్లాట్‌ ఫారమ్‌ పై తయారు కానుంది. ప్రస్తుత మోడల్ కంటే కొద్దిగా పెద్ద సైజ్‌ తో పాటు మరింత ప్రీమియం డిజైన్‌ ను తీసుకురావచ్చని అంచనా. లోపల పెద్ద టచ్‌ స్క్రీన్ డిస్‌ ప్లేలు, లేటెస్ట్ కనెక్టెడ్ కార్ ఫీచర్లు, మెరుగైన ఇంటీరియర్ మెటీరియల్స్ లాంటి పలు అప్‌ గ్రేడ్లు ఉండే అవకాశం ఉంది. హైబ్రిడ్ సిస్టమ్‌ తో పాటు పెట్రోల్, టర్బో పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు కూడా కొనసాగుతాయని భావిస్తున్నారు.

మరో కొత్త 3-రో SUV తయారీ

క్రెటా తర్వాత హ్యుందాయ్ మరో కొత్త 3-రో SUVపై కూడా పని చేస్తోంది. Ni1i అనే కోడ్‌ నేమ్‌ తో అభివృద్ధి చెందుతున్న ఈ మోడల్ 2027 చివర్లో విడుదల కావచ్చు. ఇది ప్రస్తుతం ఉన్న అల్కాజార్, పాత టక్సన్ మధ్య స్థాయిలో ఉండే అవకాశం ఉంది. ఫ్యామిలీ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ఈ SUVను రూపొందిస్తున్నారు.  ఈ కొత్త 7-సీటర్ SUVలో హైబ్రిడ్ టెక్నాలజీ ప్రధాన హైలైట్‌ గా ఉండనుంది. సవరించిన 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ తో పాటు ఎలక్ట్రిక్ మోటార్ కలయికతో ఇది పని చేయవచ్చు. తక్కువ వేగంలో కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌ లో నడిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నగరాల్లో ట్రాఫిక్ పరిస్థితుల్లో ఇంధన వినియోగాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

2028లో విడుదల కానున్న పాలిసేడ్ హైబ్రిడ్

Advertisement

ఇక హ్యుందాయ్ లైనప్‌ లో అగ్రస్థానంలో ఉండే మరో మోడల్ పాలిసేడ్ హైబ్రిడ్ కావచ్చు. ఇది ఫుల్ సైజ్ ప్రీమియం SUVగా 2028లో భారత మార్కెట్లోకి రావచ్చని అంచనా. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో అమ్ముడవుతున్న పాలిసేడ్, పెద్ద క్యాబిన్ స్పేస్, అధునాతన ఫీచర్లు, లగ్జరీ అనుభూతితో గుర్తింపు పొందింది. ఇది భారత్ లో విడుదలైతే, హ్యుందాయ్  అత్యంత ఖరీదైన,  ప్రీమియం SUVగా నిలిచే అవకాశం ఉంది. హైబ్రిడ్ పవర్‌ ట్రెయిన్‌ తో పాటు ఆధునిక భద్రతా ఫీచర్లు కూడా ఇందులో ఉండే అవకాశం ఉంది.

Read Also: 160 సీసీ ఇంజన్‌తో కొత్త TVS మ్యాక్సీ స్కూటర్.. ఏరాక్స్‌కు షాక్ తప్పదా?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×