E-Paper
Advertisement

5000 నిట్స్ బ్రైట్‌నెస్, ఐదేళ్లు అప్‌డేట్స్.. శాంసంగ్ నుంచి కేక పుట్టించే స్మార్ట్‌వాచ్‌లు!

5000 నిట్స్ బ్రైట్‌నెస్, ఐదేళ్లు అప్‌డేట్స్.. శాంసంగ్ నుంచి కేక పుట్టించే స్మార్ట్‌వాచ్‌లు!
Advertisement

Samsung Smartwatches: ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ ఇటీవల నిర్వహించిన ‘గెలాక్సీ అన్‌ప్యాక్డ్’ ఈవెంట్‌లో సరికొత్త Galaxy Watch 9, Galaxy Watch Ultra 2 మోడళ్లను ఆవిష్కరించింది. ఈ కొత్త స్మార్ట్‌వాచ్‌లు కొనుగోలు చేయాలనుకునే వారికి కంపెనీ ఒక తీపి కబురు చెప్పింది. వినియోగదారులు వీటిని ఐదేళ్ల పాటు ఎలాంటి భయం లేకుండా వాడుకోవచ్చని స్పష్టం చేసింది.

దీర్ఘకాలిక సపోర్ట్..

సాధారణంగా స్మార్ట్‌ఫోన్లతో పోలిస్తే.. స్మార్ట్‌వాచ్‌లకు కంపెనీలు ఎక్కువ కాలం సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ఇవ్వవు. కానీ శాంసంగ్ ఈ ధోరణికి స్వస్తి పలికింది. ఈ కొత్త వాచ్‌లకు ఏకంగా ఐదేళ్ల పాటు Wear OS అప్‌డేట్స్ ఇస్తామని ప్రకటించింది. గతేడాది వచ్చిన గెలాక్సీ వాచ్ 8కి నాలుగు ఏళ్ల అప్‌డేట్స్ ఇస్తే, గూగుల్ పిక్సెల్ వాచ్‌లకు మూడేళ్లే సపోర్ట్ ఉంది. వాటితో పోలిస్తే శాంసంగ్ నిర్ణయం గొప్ప ఊరట అని చెప్పవచ్చు.

Advertisement

Also Read: SD కార్డ్, క్లౌడ్ పేమెంట్స్ అక్కర్లేదు.. ఈ 5 స్టెప్స్‌ ద్వారా ఫోన్ స్టోరేజ్‌ను పెంచుకోండి!

2031 వరకు అప్‌డేట్స్..

లేటెస్ట్ Wear OS 7తో పనిచేసే గెలాక్సీ వాచ్ 9, వాచ్ అల్ట్రా 2 మోడళ్లు 2031 వరకు అప్‌డేట్స్ పొందుతాయి. ఇది కంపెనీ ఇస్తున్న ఐదేళ్ల సెక్యూరిటీ ప్యాచెస్ సపోర్ట్‌కు పూర్తి అనుగుణంగా ఉంది. అంతకాలం ఒకే వాచ్‌ను వాడతారా లేదా అనేది పక్కన పెడితే.. సుదీర్ఘకాలం సెక్యూరిటీ, కొత్త ఫీచర్లు అందుబాటులో ఉంటాయనే నమ్మకం వినియోగదారులకు కలుగుతుంది.

అద్భుతమైన ఫీచర్లు..

Advertisement

అప్‌డేట్స్‌ మాత్రమే కాకుండా.. ఈ వాచ్‌లలో హార్డ్‌వేర్ పరంగానూ మంచి మార్పులు చేశారు. గెలాక్సీ వాచ్ 9 బ్యాటరీ లైఫ్ మునుపటి మోడల్ కంటే 20 శాతం పెరిగింది. ఇక వాచ్ అల్ట్రా 2 డిస్‌ప్లే బ్రైట్‌నెస్ ఏకంగా 5,000 నిట్స్‌కి చేరుకుంది. దీంతో ప్రకాశవంతమైన ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది.

ఆరోగ్య పర్యవేక్షణ..

ఈ రెండు స్మార్ట్‌వాచ్‌లలో కృత్రిమ మేధ (AI) ఆధారిత ఆరోగ్య పర్యవేక్షణ ఫీచర్లను అందించారు. ఇవి ఆరోగ్యాన్ని, ఫిట్‌నెస్‌ను మరింత ఖచ్చితంగా ట్రాక్ చేయడానికి ఉపయోగపడతాయి. అత్యుత్తమ డిస్‌ప్లే, మెరుగైన బ్యాటరీ లైఫ్, దీర్ఘకాలిక అప్‌డేట్స్ కోరుకునే వారికి ఇవి మంచి ఎంపికగా నిలుస్తాయి.

Also Read: ఫేస్‌బుక్‌లో పొరపాటున స్టోరీ పోస్ట్ చేశారా? ఇలా క్షణాల్లో డిలీట్ చేసేయండి!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×