E-Paper
Advertisement

అమెజాన్‌లో కనీవినీ ఎరుగని సూపర్ సేల్.. Galaxy S25 Ultraపై ఏకంగా రూ.35,000 ధర తగ్గింపు!

అమెజాన్‌లో కనీవినీ ఎరుగని సూపర్ సేల్.. Galaxy S25 Ultraపై ఏకంగా రూ.35,000 ధర తగ్గింపు!
Advertisement

Amazon Great Summer Sale: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది.. ఈసారి శాంసంగ్ ఫ్యాన్స్‌కు ఎగిరి గంతేసే గుడ్ న్యూస్ చెప్పింది కంపెనీ. ఇటీవలె శాంసంగ్ నుంచి వచ్చిన పవర్‌ఫుల్ ఫోన్ Galaxy S25 Ultra ధర భారీగా తగ్గింది. మొదటిసారిగా ఈ ఫోన్ ధర రూ.ల లోపుకు రావడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ ఎందుకు కొనాలి? దీనిలో ఉన్న స్పెషాలిటీస్ ఏంటో ఒకసారి చూద్దాం.

రూ.35,000 ధర తగ్గింపు..

నిజం చెప్పాలంటే.. Galaxy S25 Ultra లాంచ్ అయినప్పుడు దాని ధర రూ.1,29,999. అప్పటి నుండి ఇప్పటి వరకు పెద్దగా రేటు తగ్గలేదు. కానీ ఇప్పుడు అమెజాన్ సేల్‌లో ఏకంగా రూ.94,999కే లిస్ట్ అయ్యింది. అంటే.. దాదాపు రూ.35 వేల వరకు తగ్గుతోందన్నమాట. పైగా ఎలాంటి ఎక్స్ఛేంజ్ ఆఫర్లు లేకుండానే ఈ రేటుకు ఇస్తున్నారు. మీరు గనుక ఒకేసారి డబ్బులు కట్టలేకపోతే.. నెలకు రూ.7,900 చొప్పున ఎలాంటి వడ్డీ లేకుండా నో-కాస్ట్ EMI ద్వారా 12 నెలల పాటు కట్టుకునే ఛాన్స్ కూడా ఉంది.

ఇప్పటికీ తగ్గని పవర్..

Advertisement

చాలామందికి ఒక డౌట్ రావచ్చు.. కొత్త మోడల్ వస్తుంటే ఇప్పుడు ఈ పాత ఫోన్ ఎందుకు? అని. కానీ Galaxy S25 Ultraలో ఉన్న స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఇప్పటికీ సూపర్ ఫాస్ట్. హెవీ గేమ్స్ ఆడినా, ఎక్కువ సేపు వీడియోలు చూసినా ఫోన్ అస్సలు స్లో అవ్వదు. దీని 6.9 అంగుళాల డిస్‌ప్లే క్వాలిటీ అయితే వేరే లెవల్ అంతే. సినిమా చూస్తున్నప్పుడు వచ్చే ఆ క్లారిటీ మరే ఫోన్‌లోనూ దొరకదు.

Also Read: వన్‌ప్లస్ సమ్మర్ సేల్ మొదలైంది మామా.. ఫోన్స్, ట్యాబ్స్, బడ్స్‌పై భారీ డిస్కౌంట్లు.. ఇక చూసుకో నా సామి రంగా!

కెమెరా అంటే అల్ట్రానే..

Advertisement

ఫొటోగ్రఫీ లేదా వీడిగ్రఫీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లకైతే ఈ ఫోన్ పిచ్చ పిచ్చగా నచ్చేస్తుంది. దీనిలో 200MP మెయిన్ కెమెరా ఉంది. ఇక దీని జూమ్ గురించి అందరికీ తెలిసిందే.. ఎంత దూరంలో ఉన్నా సరే క్లారిటీగా ఫొటోలు తీయొచ్చు. ప్రస్తుతానికి మార్కెట్లో ఉన్న ఇతర ఫోన్లతో పోలిస్తే.. శాంం‌సంగ్ ఇచ్చే కెమెరా క్వాలిటీని అందుకోవడం కష్టమే. ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారికి ఇది బెస్ట్ ఛాయిస్.

S Pen ఇచ్చే మజాయే వేరు..

ఈ ఫోన్‌తో వచ్చే ఎస్-పెన్ వాడటం మొదలుపెడితే ఇక వదిలిపెట్టరు. నోట్స్ రాసుకోవడానికి, ఫొటోలు ఎడిట్ చేయడానికి, రిమోట్‌లా వాడుకోవడానికి ఇది చాలా బాగుంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. శాంసంగ్ ఈ ఫోన్‌కు ఏడేళ్ల పాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ఇస్తుంది. అంటే.. ఇప్పుడు కొన్నా సరే, మరో ఐదు ఆరేళ్ల వరకు ఫోన్ కొత్తగానే ఉంటుంది. ఛార్జింగ్ స్పీడ్ కొంచెం యావరేజ్‌గా అనిపించినా.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా వాడుకోవచ్చు.

పెద్ద మొత్తంలో డబ్బు ఆదా..

త్వరలో రాబోయే Galaxy S26 Ultra ధర సుమారు రూ.1.40 లక్షలు ఉండొచ్చు. దానికి, దీనికి మధ్య దాదాపు రూ.45,000 డిఫరెన్స్ ఉంది. అంత ఎక్స్‌ట్రా డబ్బులు పెట్టి కొత్తది కొన్నా.. వాడేటప్పుడు పెద్దగా తేడా కనిపించకపోవచ్చు. అందుకే అనవసరంగా ఎక్కువ ఖర్చు చేయకుండా.. రూ.లక్ లోపు బడ్జెట్‌లో మంచి ప్రీమియం ఫోన్ కావాలనుకుంటే ఈ S25 Ultraను మించిన ఆప్షన్ మరొకటి లేదనే చెప్పాలి.

Also Read: భారీగా తగ్గిన Samsung Galaxy S26 సిరీస్ ధరలు.. మే 27 వరకే ఛాన్స్, ఎలా కొనుగోలు చేయాలంటే?

ముఖ్య గమనిక:

ఈ కథనంలో మీకు పరిచయం చేసిన ప్రొడక్ట్ లేదా దాని ధరలు.. ఆయా కంపెనీల ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు తప్పకుండా సరిచూసుకోగలరు. మీరు కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. కాబట్టి.. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×