E-Paper
Advertisement

ఫాతిమా కాలేజీపై హైడ్రా సంచలన నిర్ణయం.. సర్వే తర్వాతే అసలు యాక్షన్!

ఫాతిమా కాలేజీపై హైడ్రా సంచలన నిర్ణయం.. సర్వే తర్వాతే అసలు యాక్షన్!
Advertisement

Fatima College: ఫాతిమా కాలేజీ వ్యవహారంపై హైడ్రా (HYDRAA) కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అంశం ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉందని, కోర్టు ఆదేశాల ప్రకారమే తాము తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ వివాదానికి సంబంధించి పూర్తి వివరాలను పరిశీలిస్తే, ప్రధానంగా కాలేజీ నిర్మాణం జరిగిన స్థలంపై స్పష్టత రావాల్సి ఉంది.

ప్రస్తుతం హైకోర్టు ఈ బాధ్యతను నీటిపారుదల (Irrigation), రెవెన్యూ విభాగాలకు అప్పగించింది. ఈ రెండు శాఖల సమన్వయంతో క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే నిర్వహించనున్నారు. ఈ సర్వేలో ప్రధానంగా తేలాల్సింది ఏమిటంటే.. సదరు నిర్మాణాలు ఎఫ్.టి.ఎల్ (Full Tank Level) పరిధిలోకి వస్తాయా లేదా అనేది. దీనితో పాటు, కాలేజీ యాజమాన్యం ఎన్ని అనుమతులు తీసుకుంది, ఆ అనుమతులు నిబంధనల ప్రకారం ఉన్నాయా అనే విషయాలను కూడా అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.

Advertisement

సర్వే పూర్తయిన తర్వాత ఆ నివేదికను హైకోర్టుకు సమర్పిస్తారు. కోర్టు ఆ నివేదికను పరిశీలించి, తదుపరి చర్యల కోసం హెచ్.ఎమ్.డి.ఏ (HMDA) కు బదిలీ చేసే అవకాశం ఉంది. ఈ మొత్తం ప్రక్రియలో హైకోర్టు ఇచ్చే తీర్పు, రెవెన్యూ , ఇరిగేషన్ శాఖలు ఇచ్చే సర్వే రిపోర్టులే అత్యంత కీలకం. కమిషనర్ రంగనాథ్ చెబుతున్న దాని ప్రకారం, ఈ నివేదికలు అందిన తర్వాతే చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై హైడ్రా తుది నిర్ణయం తీసుకుంటుంది. ప్రస్తుతానికి సర్వే నివేదిక కోసం అందరూ వేచి చూస్తున్నారు.

Also Read: టీ-వ్యాలెట్‌పై ‘ప్రైవేట్’ పంజా.. 16 లక్షల మంది యూజర్ల డేటా సేఫ్‌నా?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×