E-Paper
Advertisement

Galaxy S25 Ultra Price Cut: బిగ్గెస్ట్ ప్రైస్ డ్రాప్.. శాంసంగ్ ప్రీమియం ఫోన్‌పై ఏకంగా రూ.20,000 తగ్గింపు!

Galaxy S25 Ultra Price Cut: బిగ్గెస్ట్ ప్రైస్ డ్రాప్.. శాంసంగ్ ప్రీమియం ఫోన్‌పై ఏకంగా రూ.20,000 తగ్గింపు!
Advertisement

Galaxy S25 Ultra Price Cut: ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ ప్రియులకు ఇది నిజంగా తీపి కబురు. ఇటీవల మార్కెట్లోకి సరికొత్త గెలాక్సీ S26 అల్ట్రా విడుదల కావడంతో, అంతకుముందు మోడల్ అయిన గెలాక్సీ S25 అల్ట్రా ధరను కంపెనీ భారీగా తగ్గించింది. ప్రస్తుతం ఈ ప్రీమియం ఫోన్ కొనుగోలుపై వినియోగదారులు ఏకంగా రూ.20,000 వరకు ఆదా చేసుకునే అవకాశం లభిస్తోంది. కేవలం అధికారిక ధర తగ్గింపు మాత్రమే కాకుండా, ప్రముఖ రిటైల్ స్టోర్లలో లభిస్తున్న అదనపు బ్యాంక్ ఆఫర్లు ఈ డీల్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చాయి.

విజయ్ సేల్స్‌లో కొంటే?

శాంసంగ్ వెబ్‌సైట్‌లో S25 అల్ట్రాలోని అన్ని వేరియంట్ల రేట్లను మార్చేసింది. ఇదివరకు రూ.1,29,999 ఉన్న 256GB బేస్ మోడల్, ఇప్పుడు రూ.1,19,999కే వచ్చేస్తోంది. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడ కాదు.. విజయ్ సేల్స్ లాంటి చోట్ల మీరు HDFC లేదా ICICI కార్డులతో కొంటే మరో రూ.10,000 అదనంగా తగ్గుతుంది. ఫైనల్‌గా ఈ ఫోన్ మీకు రూ.1,09,999కే దక్కుతుందన్నమాట. లక్షా పాతిక వేల ఫోన్ లక్షా పది వేలకే వస్తుందంటే గ్రేట్ కదా.

Advertisement

Also Read: 54 గంటల బ్యాటరీ, లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్‌తో వన్‌ప్లస్ న్యూ బడ్స్ లాంచ్.. ధర కూడా తక్కువే!

మల్టీ టాస్కింగ్‌కు బెస్ట్..

కొత్తగా వచ్చిన S26 అల్ట్రా రేటు చూస్తే రూ.1,40,000 దాటిపోతోంది. పాత మోడల్ కంటే దాదాపు రూ.30వేలు ఎక్కువన్నమాట. సరే.. కొత్త ఫోన్‌లో మంచి ప్రాసెసర్, కొత్త స్క్రీన్ ఫీచర్లు ఉన్న మాట నిజమే కానీ, S25 అల్ట్రా కూడా తక్కువేం కాదు. దీనిలో ఉన్న స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్ గేమింగ్‌కు కానీ, మల్టీ టాస్కింగ్‌కు కానీ అదిరిపోతుంది. మరీ అంత భారీ బడ్జెట్ పెట్టలేం అనుకునే వాళ్లకు ఇది బెస్ట్ ఆప్షన్.

ఇప్పుడే కొనాలా లేక వెయిట్ చేయాలా?

Advertisement

మీరు గనుక అర్జెంట్‌గా ఫోన్ మార్చాలి అనుకుంటే మాత్రం ఈ ప్రైస్ చాలా రీజనబుల్‌గా ఉంది. లేదు.. మాకు అంత తొందర లేదు అనుకుంటే దీపావళి సేల్స్ వరకు ఆగితే ఇంకా ఏమైనా తగ్గుతుందేమో చూడాలి. కానీ ఇప్పుడొస్తున్న రూ.20 వేల తగ్గింపు కూడా మామూలు విషయం కాదు. మంచి కెమెరా, స్టైలిష్ ఎస్‌పెన్, రోజంతా వచ్చే బ్యాటరీ.. ఇవన్నీ కావాలనుకుంటే ఈ డీల్ అస్సలు మిస్ చేసుకోవద్దు.

Also Read: ఇంటర్నెట్ లేకపోయినా.. అత్యవసర పరిస్థితుల్లో ఆదుకొనే ఎమర్జెన్సీ యాప్స్, మ్యాప్‌తో సహా అన్నీ!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×