E-Paper
Advertisement

Samsung Galaxy S24 Ultra: మరొ కొత్త కలర్‌లో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా వేరియంట్.. అద్దిరిపోయిందంతే..!

Samsung Galaxy S24 Ultra: మరొ కొత్త కలర్‌లో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా వేరియంట్.. అద్దిరిపోయిందంతే..!
Advertisement

Samsung Galaxy S24 Ultra in Titanium Yellow Color: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సామ్‌సంగ్ తన ఆదిపత్యాన్ని కొనసాగిస్తోంది. సామాన్యులు, ధనవంతులను దృష్టిలో పెట్టుకుని కొత్త కొత్త ఫోన్లను రిలీజ్ చేస్తుంది. అయితే అందులో Samsung Galaxy S24 Ultra ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ఒకటి. ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ రూ. 1,29,999 ధర నుండి ప్రారంభమవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో వినియోగదారులు భారీ స్క్రీన్, శక్తివంతమైన బ్యాటరీతో పాటు అనేక ఫీచర్లను పొందుతారు.

అయితే స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ శాంసంగ్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని అందిస్తూనే ఉంటుంది. ఇప్పుడు కంపెనీ Samsung Galaxy S24 Ultraని కొత్త కలర్ ఆప్షన్‌లో పరిచయం చేసింది. ప్రస్తుతానికి ఈ ఫోన్ టైటానియం గ్రే, టైటానియం వైలెట్, టైటానియం బ్లాక్ కలర్‌లలో అందుబాటులో ఉంది. కానీ ఇప్పుడు కంపెనీ ఈ మొబైల్‌ను టైటానియం ఎల్లో కలర్‌లో తీసుకొచ్చింది. దీని ఫొటోను Samsung తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ కొత్త కలర్ వేరియంట్ కొనుగోలుదారులకు మరిన్ని ఆప్షన్‌లను అందిస్తుందని కంపెనీ తెలిపింది.

Advertisement

Samsung Galaxy S24 Ultra Features

ఈ స్మార్ట్‌ఫోన్‌లో అతిపెద్ద ఫీచర్ గెలాక్సీ AI ఉంది. ఇది సర్కిల్ టు సెర్చ్, జెనరేటివ్ టెక్స్ట్, లైవ్ ట్రాన్స్‌క్రైబ్, లైవ్ ట్రాన్స్‌లేషన్ వంటి అనేక AI ఫీచర్‌లను కలిగి ఉంది. Galaxy S24 Ultra అనేది ప్రీమియం స్మార్ట్‌ఫోన్. ఇది బలమైన టైటానియం బాడీతో వచ్చిన కంపెనీ మొదటి ఫోన్. ఈ ఫోన్ 6.8 అంగుళాల QHD+ డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 2600 బ్రైట్‌నెస్ నిట్‌లకు చేరుకుంటుంది. అలాగే ఇది విజన్ బూస్టర్ టెక్నాలజీ, 1Hz నుండి 120Hz వరకు అనుకూల రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా ఇది Qualcomm Snapdragon 8 Gen 3 (4 nm) ప్రాసెసర్‌పై నడుస్తుంది. ఇది మెరుగైన పనితీరు, తక్కువగా వేడెక్కడం, ఎక్కువ బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది.

Advertisement

Also Read: సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌పై రూ.25 వేల డిస్కౌంట్.. ఇలాంటి ఆఫర్లు ఎలా ఇస్తారబ్బా?

ఈ ఫోన్ గరిష్టంగా 1TB స్టోరేజ్‌తో వస్తుంది. దీనికి వెనుకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. అందులో కొత్త 50MP 5x టెలిఫోటో సెన్సార్, OISతో 200MP వైడ్ కెమెరా, OISతో 10MP 3x టెలిఫోటో కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ కెమెరా వంటివి ఉన్నాయి. అలాగే ఫోన్ ముందువైపు 12MP డ్యూయల్ పిక్సెల్ కెమెరా కూడా ఉంది. కాగా Galaxy S24 Ultra అనేది వినూత్న టెక్నాలజీ, అద్భుతమైన డిజైన్‌లతో ఫోన్ ప్రియులను ఆకట్టుకుంటోంది.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×