E-Paper
Advertisement

Galaxy S24 Discount: గెలాక్సీ S24పై రూ.30000 ధర తగ్గింపు.. బంపర్ ఆఫర్ ఎక్కడంటే

Galaxy S24 Discount: గెలాక్సీ S24పై రూ.30000 ధర తగ్గింపు.. బంపర్ ఆఫర్ ఎక్కడంటే
Advertisement

Galaxy S24 Discount| శాంసంగ్ గెలాక్సీ S సిరీస్‌కు ఒక ప్రత్యేకత ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ గెలాక్సీ ప్రీమియం ఫోన్లకు డిమాండ్ ఉంది. లేటెస్ట్‌గా గెలాక్సీ S26 రాబోతున్నాయి. అయితే ఈ సిరీస్‌లో గెలాక్సీ S24కు డిమాండ్ తగ్గలేదు. ఇప్పుడు గెలాక్సీ S24 ఒక గుడ్‌న్యూస్.

శాంసంగ్ గెలాక్సీ S24 ఫోన్ ధర భారతదేశంలో భారీగా తగ్గింది. ఈ తగ్గింపు కొత్త గెలాక్సీ S26 సిరీస్ రాకముందే వచ్చింది. రిటైలర్లు పాత ఫ్లాగ్‌షిప్ మోడల్స్ స్టాక్ క్లియర్ చేయడానికి ధరలు తగ్గించారు. కొత్త అడ్వాన్స్ ప్రాసెసర్ అవసరం లేని వారికి ఈ డీల్ చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ ఫోన్ ఇప్పటికీ ఫ్లాగ్‌షిప్ స్థాయి పర్‌ఫామెన్స్, ప్రీమియం డిజైన్‌ను అందిస్తుంది.

అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 కొత్త ధర

Advertisement

8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ఇప్పుడు రూ.42,994కి అందుబాటులో ఉంది. లాంచ్ సమయంలో ధర రూ.74,999 ఉండేది. అంటే నేరుగా రూ.32,005 తగ్గింపు వచ్చింది. బ్యాంక్ ఆఫర్లు, కూపన్‌లతో మరింత తగ్గుతుంది. కొన్ని ఆఫర్లతో రూ.2,500 వరకు అదనపు సేవింగ్స్ వస్తాయి. దీంతో ఎఫెక్టివ్ ధర సుమారు రూ.40,494కి దిగివస్తుంది. ఈ ధర వద్ద ఇది చాలా బలమైన ప్రీమియం ఆప్షన్ అవుతుంది. చాలా మిడ్-రేంజ్ ఫోన్లతో సులభంగా పోటీ పడుతుంది. ఈ ఫోన్ ఓనిక్స్ బ్లాక్, యాంబర్ ఎల్లో రంగుల్లో అందుబాటులో ఉంది. రెండు రంగుల్లోనూ అదే స్పెసిఫికేషన్లు ఉంటాయి.

డిస్‌ప్లే, డిజైన్

శాంసంగ్ గెలాక్సీ S24లో 6.2 ఇంచ్ డైనమిక్ LTPO AMOLED 2X డిస్‌ప్లే ఉంది. ఇది స్మూత్ 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. స్క్రీన్ పీక్ బ్రైట్‌నెస్ 2600 నిట్స్ వరకు ఉంటుంది. ఎండలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ఉంది. ఫోన్‌పై స్క్రాచ్ గీతలు, ఫోన్ కింద పడిపోయినప్పుడు పెద్దగా డ్యామేజ్ కాదు. కాంపాక్ట్ సైజ్ వల్ల ఒక చేతితో సులభంగా ఉపయోగించవచ్చు. ప్రీమియం డిజైన్ ఫ్లాగ్‌షిప్ ఫీల్ ఇస్తుంది.

పర్‌ఫామెన్స్, సాఫ్ట్‌వేర్

Advertisement

ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. గేమింగ్ మరియు మల్టీటాస్కింగ్‌లో బలమైన పనితీరు ఇస్తుంది. అడ్రినో 750 GPU గ్రాఫిక్స్ స్మూత్‌గా హ్యాండిల్ చేస్తుంది. ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. శాంసంగ్ ఏడు పెద్ద ఆండ్రాయిడ్ అప్‌డేట్లు ఇస్తుంది. దీనివల్ల చాలా సంవత్సరాల పాటు స్మూత్ పర్‌ఫామెన్స్ ఉంటుంది.

కెమెరా కెపాసిటీ

ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. మెయిన్ కెమెరా 50MP రిజల్యూషన్‌తో ఉంది. పగలు వెలుగులో డీటెయిల్డ్, షార్ప్ ఫోటోలు తీస్తుంది. 12MP అల్ట్రా-వైడ్ కెమెరా 120 డిగ్రీల వ్యూ ఇస్తుంది. విశాలంగా ఉండే ల్యాండ్‌స్కేప్‌లు, గ్రూప్ ఫోటోలు సులభంగా తీయవచ్చు. 10MP టెలిఫోటో లెన్స్ 3x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేస్తుంది. దూరంగా ఉన్న వస్తువులను స్పష్టంగా క్యాప్చర్ చేయవచ్చు. ఫ్రంట్ కెమెరా 12MP రిజల్యూషన్‌తో సెల్ఫీలు, వీడియో కాల్స్‌లో మంచి నాణ్యత ఇస్తుంది.

Also Read: మనుషులపై జోకులు వేసే ఏఐలు.. మానవులకు నో ఎంట్రీ ప్లాట్‌ఫామ్.. చాలా ప్రమాదకరం

బ్యాటరీ, ఛార్జింగ్

ఫోన్‌లో 4000mAh బ్యాటరీ ఉంది. 25W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. సాధారణ ఉపయోగంతో ఒక రోజు పూర్తిగా బ్యాటరీ ఇస్తుంది. బిజీ రోజుల్లో త్వరగా ఛార్జ్ చేసుకోవచ్చు.

ఈ ధర తగ్గింపు వల్ల గెలాక్సీ S24 చాలా మంచి వాల్యూ ఆప్షన్ అయింది. ధర తగ్గడంతో ఫ్లాగ్‌షిప్ పర్‌ఫామెన్స్ మిడ్-రేంజ్ ధరలో దొరుకుతోంది. తాజా లాంచ్ స్కిప్ చేసి భారీగా ఆదా చేయాలనుకునేవారికి ఇది గొప్ప అవకాశం. రూ.45,000 లోపు ప్రీమియం ఫీచర్లు కావాలంటే ఈ డీల్ బెస్ట్.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×