E-Paper
Advertisement

Samsung Satellite App: ఇంటర్నెట్ లేకున్నా వాట్సాప్, ట్విట్టర్ X.. శాంసంగ్ ఫోన్లలో గేమ్ ఛేంజింగ్ ఫీచర్

Samsung Satellite App: ఇంటర్నెట్ లేకున్నా వాట్సాప్, ట్విట్టర్ X.. శాంసంగ్ ఫోన్లలో గేమ్ ఛేంజింగ్ ఫీచర్
Advertisement

Samsung Satellite App Network | స్మార్ట్‌ఫోన్ కంపెనీలు కొత్త కొత్త ఫీచర్స్‌తో మార్కెట్లో ఇతర బ్రాండ్లకు గట్టిపోటీనిస్తున్నాయి. ఈ క్రమంలో శాంసంగ్ కంపెనీ కనెక్టివిటీ ఫీచర్‌పై దృష్టిపెట్టింది. స్మార్ట్‌ఫోన్స్ లో దాదాపు అన్ని యాప్‌లకు ఇంటర్నెట్ తప్పనిసరి. కానీ శాంసంగ్ ఇప్పుడు ఒక కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. కొన్ని గెలాక్సీ ఫోన్లలో “శాటిలైట్-రెడీ యాప్‌లు” పనిచేస్తాయి. ఇవి సాధారణ మొబైల్ డేటా లేదా వై-ఫై లేకుండానే శాటిలైట్ సిగ్నల్స్ ద్వారా పనిచేస్తాయి. నిర్మానుష, అటవి ప్రాంతాల్లో లేదా నెట్‌వర్క్ లేనప్పుడు ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

శాటిలైట్-రెడీ యాప్‌లు ఎలా పనిచేస్తాయి?

ఈ యాప్‌లు శాటిలైట్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ద్వారా కనెక్ట్ అవుతాయి. సాధారణ మొబైల్ ఇంటర్నెట్ అవసరం లేదు. శాంసంగ్ పలు దేశాల్లోని మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్లతో భాగస్వామ్యం చేసింది. ఈ భాగస్వామ్యాల వల్ల శాటిలైట్ కనెక్షన్ సాధ్యమవుతుంది. X ప్లాట్‌ఫాంలో @theoneacid అనే యూజర్ ఈ వివరాలు షేర్ చేశాడు. కొన్ని గెలాక్సీ ఫోన్లలో ఇప్పటికే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.

ఆపిల్‌ శాటిలైట్ ఫీచర్ కంటే భిన్నంగా శాంసంగ్

Advertisement

స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీలో శాటిలైట్ కనెక్టివిటీ కొత్తది కాదు. ఆపిల్ ఫోన్లలో ఎమర్జెన్సీ సర్వీసెస్ కోసం శాటిలైట్ కనెక్టివిటీని ఉపయోగిస్తోంది. అంటే ఒక ఐఫోన్ యూజర్ ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు ఫోన్‌లో నెట్‌వర్క్ లేకుంటే శాటిలైట్ కనెక్షన్ ద్వారా కాలింగ్ లేదా మెసేజ్ చేయగలడు. శాటిలైట్ ఇంటర్నెట్ కోసం ఆపిల్ ప్రధానంగా స్పేస్‌ఎక్స్ స్టార్‌లింక్ వంటి ప్రొవైడర్లపై ఆధారపడుతుంది. ఎమర్జెన్సీ మెసేజ్‌లు, కాల్స్, SMS మాత్రమే సాధ్యం. కానీ శాంసంగ్ మరింత విస్తృతంగా శాటిలైట్ ఫీచర్‌ని వినియోగించబోతోంది. ఎమర్జెన్సీ మాత్రమే కాకుండా కొన్ని యాప్‌లు నార్మల్‌గా పనిచేసేలా చేసింది. దీని కోసం స్థానిక టెలికాం ఆపరేటర్లతో పార్టనర్‌షిప్ చేసింది.

ప్రపంచవ్యాప్తంగా టెలికాం భాగస్వామ్యాలు

శాంసంగ్ కంపెనీ పలు దేశాల టెలికాం కంపెనీలతో ఇప్పటికే భాగస్వామ్యం చేసింది. ఉత్తర అమెరికాలో AT&T, Verizon, T-Mobileతో పనిచేస్తోంది. యూరప్‌లో MasOrange, Virgin Media O2తో భాగస్వామ్యం ఉంది. జపాన్‌లో NTT Docomo, KDDI, Rakuten Mobileతో కలిసి పనిచేస్తోంది. ఈ భాగస్వామ్యాల వల్ల వివిధ మార్కెట్లలో శాటిలైట్ కనెక్టివిటీ సాధ్యమవుతుంది.

ఇంటర్నెట్ లేకుండా శాంసంగ్ ఫోన్స్‌లో పనిచేసే యాప్‌లు

Advertisement

శాంసగ్ కొన్ని పాపులర్ యాప్‌లకు శాటిలైట్ సపోర్ట్ ఇచ్చింది. ఇవి సాధారణ ఇంటర్నెట్ లేకుండానే పనిచేస్తాయి.

ఉదాహరణకు: వాట్సాప్, ఎక్స్ (ట్విట్టర్), గూగుల్ మ్యాప్స్, గూగుల్ ప్లే సర్వీసెస్, మెసెంజర్, శాంసంగ్ ఫైండ్, శాంసంగ్ హెల్త్, ఫైండ్ మై మొబైల్, శాంసంగ్ అకౌంట్, వెదర్ (వాతావరణం), మెసేజింగ్ సర్వీసెస్. ఈ యాప్‌లన్నీ శాటిలైట్ ద్వారా కనెక్ట్ అవుతాయి.

Also Read: ఆపిల్, చైనా ఫోన్ కంపెనీలకు చుక్కలే.. 20,000mAh బ్యాటరీ ఫోన్స్‌తో శాంసంగ్ సంచలనం

ఈ ఫీచర్ ఎందుకు ముఖ్యం?

గ్రామీణ, అటవి ప్రాంతాల్లో మొబైల్ నెట్‌వర్క్ స్థిరంగా ఉండదు. ఈ సమస్యను శాటిలైట్ కనెక్టివిటీ పరిష్కరిస్తుంది. నెట్‌వర్క్ లేనప్పుడు కూడా ముఖ్యమైన సర్వీసెస్ అందుబాటులో ఉంటాయి. ఎమర్జెన్సీ సమయాల్లో, వరదలు, భూకంపాలు లాంటి వైపరీత్యాల ప్రతికూల సమయంలో కూడా కమ్యూనికేషన్ సులభమవుతుంది. భవిష్యత్ గెలాక్సీ ఫోన్లలో ఈ ఫీచర్ మరింత విస్తృతంగా ఉంటుంది. శాటిలైట్, టెలికాం నెట్‌వర్క్‌ల కాంబినేషన్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీని మార్చేస్తుంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×