E-Paper
Advertisement

ఫ్లిప్‌కార్ట్ మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. Samsung Galaxy A37 5G ధర ఇంతలా పడిపోయిందేంటి? ఇవిగో పూర్తి వివరాలు..

ఫ్లిప్‌కార్ట్ మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. Samsung Galaxy A37 5G ధర ఇంతలా పడిపోయిందేంటి? ఇవిగో పూర్తి వివరాలు..
Advertisement

Galaxy A37 Price Cut: మంచి బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్ కొనాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇంతకంటే మంచి అవకాశం మళ్లీ రాదనే చెప్పాలి. ఎందుకంటే.. ప్రముఖ టెక్ సంస్థ శాంసంగ్ తమ లేటెస్ట్ మోడల్ Galaxy A37 5Gపై భారీ రేటు తగ్గించి అందరినీ సర్ప్రైజ్ చేసింది. స్టైలిష్ లుక్, అదిరిపోయే ఫీచర్లు ఉన్న ఈ ఫోన్ ఇప్పుడు సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఏమిటీ ఆఫర్? ఎంత ధర తగ్గింది? ఎక్కడ కొనుగోలు చేయాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

ధర ఎంత తగ్గిందంటే?

ఈ Samsung Galaxy A37 5G మార్కెట్లోకి వచ్చినప్పుడు దీని ధర రూ.41,999 వరకు ఉండేది. కానీ ఇప్పుడు మే నెల స్పెషల్ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ దీనిపై ఏకంగా రూ.9,000 వరకు ధర తగ్గించింది. దీంతో ఇప్పుడీ ఫోన్ అన్ని ఆఫర్లు పోను జస్ట్ రూ.33,000కే వచ్చేస్తుందన్నమాట. తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం ఫోన్ వాడాలనుకునే వారికి ఇది నిజంగా సూపర్ డీల్ అని చెప్పొచ్చు.

ఎక్కడ కొనుగోలు చేయాలి?

Advertisement

ఈ భారీ ఆఫర్ ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఫోన్ మీద వచ్చే డిస్కౌంట్ మాత్రమే కాకుండా.. SBI, HDFC లేదంటే Axis బ్యాంక్ కార్డులు వాడేవారికి అదనంగా క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. ఒకవేళ మీరు గనుక మీ పాత ఫోన్‌ను ఎక్ఛేంజ్ చేసుకోవాలనుకుంటే.. మరో రూ.5,000 నుండి రూ.10,000 వరకు తగ్గింపు పొందొచ్చు. కాస్త తెలివిగా ప్లాన్ చేసుకుంటే.. ఇంకా తక్కువ ధరకే ఈ ఫోన్ మీ సొంతం అయిపోతుందన్నమాట.

Also Read: అలెర్ట్.. మీ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 5.0 వెర్షనా? అయితే ఇక వాట్సప్ శాశ్వతంగా క్లోజ్, వెంటనే ఇది చెక్ చేయండి!

Galaxy A37 స్పెసిఫికేషన్స్..

Advertisement

ఈ ఫోన్‌ 6.7 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. తద్వారా వీడియోలు క్లారిటీగా, కలర్‌ఫుల్‌గా కనిపిస్తాయి. ఇక గేమింగ్ ప్రియుల కోసం 120Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చారు. దీంతో ఫోన్ అస్సలు హ్యాంగ్ అవ్వదు. ఇక కెమెరా విషయానికి వస్తే.. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో రాత్రిపూట కూడా అద్భుతమైన ఫొటోలు క్యాప్చర్ చేయొచ్చు.

ఆరేళ్లపాటు సాఫ్ట్‌వేర్ అప్డేట్స్..

ఈ ఫోన్ కొంటే మరో పెద్ద అడ్వాంటేజ్ ఏమిటంటే.. శాంసంగ్ ఈ మోడల్‌కు ఏకంగా 6 ఏళ్ల పాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ఇస్తామని ప్రామిస్ చేసింది. అంటే.. 2032 వరకు కూడా లేటెస్ట్ ఫీచర్లను వాడుకోవచ్చు. దీనికి తోడు నీటిలో పడినా, దుమ్ము పట్టినా ఫోన్ పాడవకుండా ఉండేందుకు ఐపీ68 రేటింగ్‌ను కూడా ఇచ్చారు. క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా, తక్కువ ధరలో మంచి ఫోన్ కావాలనుకునే వారు వెంటనే ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ వివరాలను పరిశీలించవచ్చు.

Also Read: రూ.20 వేలకే వన్‌ప్లస్ కొత్త ఫోన్.. Nord CE 6 సిరీస్ అదిరిపోయే ఎంట్రీ, సేల్ ఎప్పటి నుంచంటే?

ముఖ్య గమనిక:

ఈ కథనంలో మీకు పరిచయం చేసిన ప్రొడక్ట్ లేదా దాని ధరలు.. ఆయా కంపెనీల ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు తప్పకుండా సరిచూసుకోగలరు. మీరు కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. కాబట్టి.. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×