E-Paper
Advertisement

జియో దుమ్మురేపే ప్లాన్స్.. అపరిమిత 5G డేటా, నాన్‌స్టాప్ కాల్స్.. ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్!

జియో దుమ్మురేపే ప్లాన్స్.. అపరిమిత 5G డేటా, నాన్‌స్టాప్ కాల్స్.. ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్!
Advertisement

Jio Postpaid Plans: దేశంలో అత్యధిక మంది యూజర్లు కలిగిన టెలికాం సంస్థ రిలయన్స్ జియోకు పేరుంది. జియో ఇప్పటికే తన కస్టమర్ల కోసం అనేక రకాల ప్రీపెయిడ్ ప్లాన్స్ ను అందుబాటులోకి వచ్చింది. అలాగే నెల రోజుల వ్యవధితో పోస్ట్ పెయిడ్ సేవలను సైతం ఆఫర్ చేస్తోంది. అయితే ఈ పోస్ట్ పెయిడ్ సేవలు.. కేవలం డేటా, కాల్స్ కోసం మాత్రమే అని చాలా మంది భావిస్తుంటారు. కానీ జియో.. ఈ ప్లాన్స్ లో ఉచితంగా ఓటీటీ సేవలను సైతం అందిస్తోంది. నెట్ ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ వంటి ప్రముఖ ఓటీటీ ఫ్టాట్ ఫామ్ లను అందిస్తోంది.

జియో రూ.749 ఫ్యామిలీ ప్లాన్

ఇంట్లోని కుటుంబ సభ్యులు అందరికీ ఒకే ప్లాన్ ఉండాలని భావించే వారికోసం జియో దీనిని తీసుకొచ్చింది. ఇందులో 100జీబీ డేటాతో పాటు ముగ్గురు అదనపు ఫ్యామిలీ మెంబర్స్‌ని యాడ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అదనంగా చేరిన ప్రతి వ్యక్తికి 5 జీబీ చొప్పున డేటా లభిస్తుంది. అంతేకాకుండా నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్  సబ్‌స్క్రిప్షన్లు ఉచితంగా యూజర్ పొందొచ్చు.

జియో రూ.1,549 ప్రీమియం ప్లాన్

Advertisement

డేటా వినియోగం అధికంగా ఉండేవారి కోసం జియో ఈ పోస్ట్ పెయిడ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కింద యూజర్లకు ఏకంగా 300జీబీ డేటా లభించనుంది. 500 GB వరకు డేటా రోల్‌ఓవర్ (మిగిలిపోయిన డేటాను తిరిగి వాడుకునే వెసులుబాటు) సౌకర్యం కూడా జియో అందిస్తోంది. దీనితో పాటు నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్లు సైతం యూజర్ కు లభిస్తాయి. అంతేకాకుండా ఈ ప్లాన్ ద్వారా అపరిమిత వాయిస్ కాల్స్, ప్రతీరోజూ 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి.

అన్‌లిమిటెడ్ 5G ప్రయోజనం

జియో తన వెల్‌కమ్ ఆఫర్ కింద ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను వాడుతున్న యూజర్లందరికీ అపరిమిత 5జీ డేటా ఆఫర్‌ను అందిస్తోంది. 5G స్మార్ట్‌ఫోన్ ఉండి.. జియో 5G నెట్‌వర్క్ ఉన్న ప్రాంతంలో ఉన్నట్లయితే డేటా ప్లాన్ లిమిట్‌తో సంబంధం లేకుండా ఎంత డేటా అయినా వాడుకోవచ్చు. ఇది హై క్వాలిటీ వీడియో స్ట్రీమింగ్, గేమింగ్‌ లవర్స్ కు ఎంతగానో ఉపయోగపడుతుందని జియో వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement

Also Read: KYC సేవలు నిలిపివేత.. 24 గంటల్లో BSNL సిమ్ బ్లాక్.. ఈ ప్రచారంలో నిజమెంత?

జియో యాప్స్ ఫ్రీ యాక్సెస్..

రూ.749, రూ.1,549 ప్రీపెయిడ్ ప్లాన్స్ రెండూ జియో యాప్స్ కు ఉచిత యాక్సెస్ ను అందిస్తాయి. జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ వంటి జియో సొంత యాప్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తుంది. ముఖ్యంగా ప్రైమ్ వీడియో ద్వారా లేటెస్ట్ సినిమాలు, నెట్‌ఫ్లిక్స్ ద్వారా అంతర్జాతీయ కంటెంట్‌ను ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా ఫోన్, టీవీలో వీక్షించే అవకాశం దొరుకుతుంది. అయితే ఈ ప్లాన్‌ల ధరలకు అదనంగా 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ సేవలను మైజియో (MyJio) యాప్ లోకి వెళ్లి యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

Also Read: Window AC vs Desert Cooler: ఏసీ వాడాలా? కూలర్ వాడాలా? సామాన్యులకు ఏది బెస్ట్?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×