E-Paper
Advertisement

AI ఫీచర్లు, అమోలెడ్ డిస్‌ప్లే.. శాంసంగ్ కొత్త స్కెచ్.. Galaxy A27 5G లీకైన పూర్తి వివరాలివే!

AI ఫీచర్లు, అమోలెడ్ డిస్‌ప్లే.. శాంసంగ్ కొత్త స్కెచ్.. Galaxy A27 5G లీకైన పూర్తి వివరాలివే!
Advertisement

Samsung Galaxy A27 5G: శాంసంగ్ తమ పాపులర్ గెలాక్సీ A సిరీస్‌లో మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ Samsung Galaxy A27 5G మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఈ ఫోన్ అధికారికంగా విడుదల కాకముందే.. దీనికి సంబంధించిన డిజైన్, స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీకై సందడి చేస్తున్నాయి. మిడ్‌రేంజ్ మార్కెట్లో గట్టిపోటీ ఇవ్వడమే లక్ష్యంగా శాంసంగ్ ఈ ఫోన్‌ను రూపుదిద్దుతోంది.

ఆకట్టుకునే డిజైన్, డిస్‌ప్లే:

యూత్‌ను, ఫొటోగ్రఫీ ప్రియులను ఆకట్టుకునేలా శాంసంగ్ ఈ ఫోన్ డిజైన్‌లో కొన్ని మార్పులు చేస్తోంది. సరికొత్త కలర్ ఆప్షన్లలో ఇది లభించనుంది. దీనిలో అదిరిపోయే విజువల్స్ కోసం పెద్ద AMOLED డిస్‌ప్లేను ఇస్తున్నారు. దీనివల్ల గేమింగ్ ఆడినా, సినిమాలు చూసినా కలర్స్ చాలా రిచ్‌గా, స్క్రీన్ స్మూత్‌గా అనిపిస్తుంది.

అదిరిపోయే 50MP కెమెరా:

Advertisement

ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని కెమెరానే అని చెప్పాలి. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో కూడిన 50MP ప్రైమరీ కెమెరాను అందిస్తున్నారు. దీనివల్ల రాత్రిపూట లేదా తక్కువ వెలుతురులో కూడా అద్భుతమైన ఫొటోలు వస్తాయి. అలాగే వీడియోలు తీసేటప్పుడు చేతులు వణికినా అవుట్‌పుట్ మాత్రం చాలా స్టెబిల్‌గా ఉంటుంది.

Also Read: వావ్.. వాషింగ్ మిషన్లలో ఈ రేంజ్ AI టెక్నాలజీనా? బట్టలు ఉతకడం, ఆరబెట్టడం ఇక చిటికెలోనే!

మెరుగైన స్టోరేజ్, ఏఐ ఫీచర్లు:

Advertisement

ఫొటోలు, యాప్స్ దాచుకోవడానికి ఇందులో ఏకంగా 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ ఉండనుంది. మార్కెట్‌ను బట్టి వేర్వేరు RAM వేరియంట్లలో ఇది దొరకవచ్చు. వీటికి తోడు ఈసారి శాంసంగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లపై కూడా దృష్టి పెట్టింది. ఏఐ కెమెరా టూల్స్, స్మార్ట్ బ్యాటరీ మేనేజ్‌మెంట్ వంటి ఫీచర్లు Samsung Galaxy A27 5Gలో ఉండబోతున్నాయి.

గట్టి పోటీ ఇచ్చేందుకే..

లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్, One UI సాఫ్ట్‌వేర్‌తో రానున్న ఈ ఫోన్ 5G కనెక్టివిటీని సపోర్ట్ చేస్తుంది. వన్‌ప్లస్, రెడ్‌మి, రియల్‌మి వంటి బ్రాండ్ల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేలా, తక్కువ ధరలోనే ఫ్లాగ్‌షిప్ లాంటి ఫీచర్లను శాంసంగ్ అందిస్తోంది. త్వరలోనే ఈ ఫోన్ ఇండియాలో అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉంది.

Also Read: నెలనెలా రీఛార్జ్ తిప్పలు వద్దు బాబోయ్.. Jio, Airtel, Viలలో రూ.500 లోపే 84 రోజుల బెస్ట్ ప్లాన్స్ ఇవే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×