E-Paper
Advertisement

25 పైసల ఖర్చుతో నడిచే.. పోర్టబుల్ ఏసీ వచ్చిందోచ్.. సామాన్యులకు పండగే!

25 పైసల ఖర్చుతో నడిచే.. పోర్టబుల్ ఏసీ వచ్చిందోచ్.. సామాన్యులకు పండగే!
Advertisement

Portable AC: నానాటికీ పెరిగిపోతున్న ఎండలు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇంట్లోకి కొత్త ఏసీ కొందామంటే.. వేల రూపాయల ఖర్చు, కొన్న తర్వాత వచ్చే కరెంట్ బిల్లులను తలచుకుని సామాన్యులు వెనకడుగు వేస్తున్నారు. అయితే వీటన్నింటికి చెక్ పెడుతూ సరికొత్త పోర్టబుల్ ఎయిర్ కండిషనర్ (Portable AC) మార్కెట్లోకి వచ్చింది. ఇది గంటకు కేవలం 25 పైసల కంటే తక్కువ ఖర్చుతోనే ఇంటిని హిమాలయాలంత చల్లగా మార్చేస్తుంది. ఆ పోర్టబుల్ ఏసీకి సంబంధించిన ప్రధాన ఫీచర్లు, ఇతర విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

పోర్టబుల్ ఏసీ ప్రత్యేకతలు

యూకేకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ బ్రాండ్ మీకో (Meaco).. ‘మీకో కూల్ ఎంసీ 8000CHBTU’ పేరుతో ఈ సరికొత్త పోర్టబుల్ ఏసీని లాంచ్ చేసింది. దీని ప్రత్యేకతల విషయానికి వస్తే.. దీన్ని ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. బెడ్‌రూమ్, లివింగ్ రూమ్, ఆఫీస్ డెస్క్.. ఇలా ఎక్కడైనా దీనిని వాడుకోవచ్చు. దీని డిజైన్ చాలా కాంపాక్ట్‌గా ఉండటమే కాకుండా తక్కువ స్థలాన్ని ఆక్యుపై చేస్తుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.

ఎండలో చల్లగా.. చలిలో వేడిగా

Advertisement

ఈ పోర్టబుల్ కూలర్ 4 రకాల మోడ్స్ ను కలిగి ఉంది. ఎండలో గదిని చల్లబరచడానికి, చలిలో గదిని వేడి చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది ఏ క్లాస్ ఎనర్జీ రేటింగ్ ను కలిగి ఉన్నందున విద్యుత్ బిల్లు చాలా పరిమితంగా రానుంది. ఇందులో Wi-Fi కనెక్టివిటీ కూడా ఉంది. ‘Meaco App’ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్ నుంచే ఏసీని ఆన్, ఆఫ్ చేయవచ్చు. సాధారణ ఏసీల్లా కాకుండా ఇది 52 dB శబ్దాన్ని మాత్రమే చేస్తూ రాత్రిళ్లు హాయిగా నిద్రపోయేందుకు వీలు కల్పిస్తుంది.

గంటకు 25 పైసలు మాత్రమే

ఈ పోర్టబుల్ ఏసీని వాడటం వల్ల కరెంట్ బిల్లు భారీగా తగ్గుతుందని తయారీదారులు చెబుతున్నారు. ఇది చాలా తక్కువ విద్యుత్‌ను వినియోగిస్తుందని పేర్కొంటున్నారు. గంటకు కేవలం కేవలం 25 పైసలు మాత్రమే విద్యుత్ బిల్లు ఖర్చు అవుతుందని స్పష్టం చేస్తున్నారు. ఫలితంగా నెలాఖరు వచ్చేసరికి కరెంటు బిల్లుల భారం భారీగా తగ్గుతందని పేర్కొంటున్నారు.

Advertisement

Also Read: ఏసీ కొంటున్నారా? ఇన్వర్టర్ vs నాన్-ఇన్వర్టర్.. మధ్యతరగతి ఇంటికి ఏది బెస్ట్?

కస్టమర్ల రివ్యూలు.. సూపర్ హిట్!

ఈ ప్రొడక్ట్‌ను కొనుగోలు చేసిన కస్టమర్లు ఆన్‌లైన్‌లో దీనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘ఇది పరిమాణంలో చిన్నదైనప్పటికీ కూలింగ్ మాత్రం అద్భుతంగా ఇస్తోంది’ అని ఒక యూజర్ కామెంట్ చేశారు. ‘కరెంట్ బిల్లు భయం లేకుండా హాయిగా వాడుకోవచ్చు’ అని ఇంకొకరు రివ్యూ ఇచ్చారు. ముఖ్యంగా బ్యాచిలర్స్, చిన్న కుటుంబాలకు ఇది ఒక వరంగా మారిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Split vs window vs portable AC: ఇంటికి ఏ ఏసీ బెస్ట్? కరెంట్ బిల్లు తక్కువ వచ్చేది ఏది?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×