E-Paper
Advertisement

Bespoke AI Fridge: శాంసంగ్ 4 డోర్ల ఫ్రిడ్జ్.. కూలింగ్ ఒక్కటే కాదు.. చాలా మ్యాటర్ ఉంది!

Bespoke AI Fridge: శాంసంగ్ 4 డోర్ల ఫ్రిడ్జ్.. కూలింగ్ ఒక్కటే కాదు.. చాలా మ్యాటర్ ఉంది!
Advertisement

Bespoke AI Fridge: శాంసంగ్ కంపెనీకి గృహోపకరణ వస్తువులకు మార్కెట్ లో మంచి గుడ్ విల్ ఉంది. టీవీ, ఏసీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్ ఇలా ఏది తీసుకున్నా.. బడ్జెట్ లో నాణ్యమైన వస్తువులను శాంసంగ్ అందిస్తుంది. అయితే రిఫ్రిజిరేటర్లకు వచ్చే సరికి శాంసంగ్ ఓ ప్రీమియం రేంజ్ రిఫ్రిజిరేటర్ ను లాంచ్ చేసింది. అధునాతన సాంకేతికత కలిగిన Bespoke AI 4-Door Flex రిఫ్రిజిరేటర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులోని ఫీచర్లు.. ప్రతీ ఒక్కరినీ ఆకర్షిస్తున్నాయి. కాబట్టి దీనిలోని ప్రధాన ఫీచర్లతో పాటు వాటి వల్ల కలిగే లాభాలను ఇప్పుడు పరిశీలిద్దాం.

33 రకాల ఆహారపదార్థాలు..

ఈ రిఫ్రిజిరేటర్ లోపల అమర్చిన ఇంటెలిజెంట్ కెమెరా సహాయంతో లోపల ఏయే ఆహార పదార్థాలు ఉన్నాయో మీరు బయట నుండే డిజిటల్ స్క్రీన్ ద్వారా చూడవచ్చు. ఇందులో దాదాపు 33 రకాల ఆహార పదార్థాలను స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఫ్రిడ్జ్ కు నాలుగు డోర్లు ఉండటం వల్ల అవసరమైన డోర్ ను మాత్రమే తీసుకునే వెసులుబాటు ఉంటుంది. దీని వల్ల మిగతా డోర్ల నుంచి కూలింగ్ వృథాగా బయటకు వెళ్లే ఇబ్బంది ఉండదు.

నచ్చినట్లుగా మార్చుకోవచ్చు..

Advertisement

వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఉష్ణోగ్రతను మార్చుకునే సౌలభ్యం ఈ ఫ్రిడ్జ్ లో ఉంది. మీరు ఒక కంపార్ట్‌మెంట్‌ను ఫ్రీజర్‌గా లేదా సాఫ్ట్ ఫ్రీజ్‌గా, చిల్లర్‌గా మార్చుకోవచ్చు. దీనివల్ల మాంసాహారం, కూరగాయలు లేదా కూల్ డ్రింక్స్ ను వాటికి కావాల్సిన ఖచ్చితమైన ఉష్ణోగ్రత వద్ద ఎక్కువ కాలం తాజాగా ఉంచుకోవచ్చు.

టచ్ చేస్తే చాలు.. డోర్ ఓపెన్

వంటగది ఇంటీరియర్‌కు తగ్గట్టుగా వివిధ రంగుల్లో ఈ బెస్పోక్ రిఫ్రిజిరేటర్లు అందుబాటులో ఉన్నాయి. మీ వంటగదికి తగ్గట్లు గ్లాస్ లేదా స్టీల్ ప్యానెల్స్‌ను ఎంచుకోవచ్చు. అంతేకాకుండా దీనిలోని ‘ఆటో ఓపెన్ డోర్’ సెన్సార్ కేవలం ఒక టచ్ తో తలుపును సులభంగా తెరుస్తుంది. మీ చేతులు వస్తువులతో నిండి ఉన్నప్పుడు ఈ ఫీచర్ ఎంతో సహాయకరంగా ఉంటుంది.

ఇంటర్నల్ వాటర్ సెంటర్

Advertisement

రిఫ్రిజిరేటర్ లోపల వైపున ‘ఆటోఫిల్ వాటర్ పిచ్చర్’, వాటర్ డిస్పెన్సర్ ను అమర్చారు. ఇది చూడటానికి చాలా క్లీన్‌గా, స్టైలిష్‌గా ఉంటుంది. దీని ద్వారా ఎల్లప్పుడూ చల్లని, శుద్ధి చేసిన నీరు అందుబాటులో ఉంటుంది. అలాగే డ్యూయల్ ఆటో ఐస్ మేకర్ ఫీచర్ ద్వారా మీకు కావాల్సిన సైజులో ఐస్ క్యూబ్స్‌ను వేగంగా పొందవచ్చు.

Also Read: Iran Missile Strike: విస్తరించిన యుద్ధం.. హిందూ మహా సముద్రంపైకి మిసైళ్లు.. ట్రంప్‌కు ఇరాన్ చుక్కలు!

స్మార్ట్ థింగ్స్ ఎనర్జీ

ఈ రిఫ్రిజిరేటర్ ‘AI ఎనర్జీ మోడ్’తో రూపొందింది. ఇది ఫ్రిడ్జ్ వాడకాన్ని విశ్లేషించి కంప్రెసర్ వేగాన్ని సర్దుబాటు చేస్తుంది. ఫలితంగా విద్యుత్ వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. దీనివల్ల మీ కరెంట్ బిల్లు ఆదా అవ్వడమే కాకుండా, పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది.

Also Read: Telangana Budget: బడ్జెట్ అంతా ఓకే గానీ.. పాపం మూడు కార్పొరేషన్ల పరిస్థితే.. అగమ్య గోచరం!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×