E-Paper
Advertisement

Salt Size Robot: ఉప్పు రేణువు కంటే చిన్న డాక్టర్.. శస్త్ర చికిత్స లేకుండా ఆపరేషన్ చేసే రోబో

Salt Size Robot: ఉప్పు రేణువు కంటే చిన్న డాక్టర్.. శస్త్ర చికిత్స లేకుండా ఆపరేషన్ చేసే రోబో
Advertisement

Salt Size Micro Robot| ఉప్పు రేణువు కంటే చిన్నదైన ఒక రోబోను శాస్త్రవేత్తలు సృష్టించారు. ఈ అద్భుతం చూస్తుంటే ఒకప్పుడు కేవలం సైన్స్ ఫిక్షన్ కథల్లో మాత్రమే కనిపించేది. కానీ నిజజీవితంలో సాధ్యమైంది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా పరిశోధకులు సంయుక్తంగా ఈ సూక్ష్మ యంత్రాన్ని అభివృద్ధి చేశారు. దీని పరిమాణం చాలా చిన్నదైనా, ఈ రోబో మనుషుల కమాండ్స్‌ని అర్థం చేసుకోగలదు, స్వయంగా నిర్ణయాలు తీసుకోగలదు, పనిచేయగలదు.

ఇంత చిన్న ఆకారంలో కంప్యూటర్లు, సెన్సార్లు, మోటార్లను అమర్చడానికి నిపుణులు చాలా సంవత్సరాలు కష్టపడ్డారు.

మైక్రో (సూక్ష్మ) యంత్రాల యుగం

Advertisement

ఈ రోబో ఒక మిల్లీమీటర్ కంటే తక్కువ పరిమాణంలో ఉంది. కేవలం 55-నానోమీటర్ల సైజులో ఉండే అతిచిన్న కంప్యూటర్‌ను ఉపయోగిస్తుంది. ఈ చిన్న కంప్యూటర్ అవసరమైన అన్ని తెలివితేటలను తనలో ఇముడ్చుకుంది. తన పరిసరాలను గుర్తించి, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుంది.

సూర్యరశ్మి నుండి ఛార్జింగ్

ఈ మైక్రో-రోబో ఛార్జింగ్ నేరుగా లైట్ (సూర్యరశ్మి లేదా ఇతర కాంతి) నుండి తీసుకుంటుంది. ఇందులో అంతర్గత బ్యాటరీ అవసరం లేదు. ఈ ప్రత్యేకత దీనిని చాలా సమర్థవంతంగా పనిచేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ రోబో చుట్టూ ఒక ప్రత్యేక రక్షణ పూత (Protective Coating) ఉంటుంది. ఈ లేయర్ సెక్యూరిటీని, పవర్‌ని ఆదా చేయడాన్ని నిర్ధారిస్తుంది.

గ్రహణ శక్తి చాలా ఎక్కువ

Advertisement

ఈ బుల్లి రోబో సెన్సార్లు చాలా చిన్న మార్పులను కూడా గుర్తించగలవు. కేవలం 0.3 డిగ్రీల ఉష్ణోగ్రత మార్పులను కూడా అవి పసిగట్టగలవు. రోబో తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని బాగా అర్థం చేసుకొని, ఆ తర్వాత తగిన చర్యను స్వయంగా ఎంచుకుంటుంది. ఇలాంటి అధునాతనమైన, అంతర్నిర్మిత తెలివితేటలు పాత మైక్రోరోబోలలో లేవు.

వైద్య రంగంలో విప్లవం

ఈ టెక్నాలజీ వైద్య శాస్త్రాన్ని సమూలంగా మార్చగలదు. ఈ రోబోను నియంత్రించడం చాలా సులభం. దీనిని ఒక సాధారణ మైక్రోస్కోప్ ఉపయోగించి ఆపరేట్ చేయవచ్చు. ఈ రోబోలు మనిషి రక్తనాళాలలో ప్రయాణించగలుగుతాయి. అవి మందులను కచ్చితమైన ప్రదేశాలకు అందించగలవు. సూక్ష్మ స్థాయిలో శస్త్ర చికిత్స నిపుణులు వీటిని ఉపయోగించి రక్తనాళాలలోని అడ్డంకులను తొలగించవచ్చు. ఉదాహరణకు గుండె కవటాల్లో, మెదడు నాళాల్లో రక్తం గడ్డ కడితే ఆపరేషన్ సమర్థవంతంగా, సులభంగా చేయగలరు. శస్త్ర చికిత్స చేసే అవసరం భవిష్యత్తులో తగ్గిపోతుంది.

Also Read: స్వయంగా పనులన్నీ చేసే ఫోన్ లాంచ్.. టచ్ చేయాల్సిన అవసరం లేదు

నిజజీవితంలో వినియోగం ఎప్పుడు

ఈ రోబోలను వాస్తవ ప్రపంచంలో ఉపయోగించడానికి మరో 10 సంవత్సరాలు పట్టవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి, ప్రొటోటైప్‌లు కేవలం ప్రయోగశాలల్లోని మంచి నీటిలో మాత్రమే పనిచేస్తున్నాయి. వీటిని ఉప్పుతో కూడిన ద్రవాలకు (రక్తం వంటివి) అనుగుణంగా మార్చవలసిన అవసరం ఉంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×