E-Paper
Advertisement

Jio AI Jobs: జియో ఓపెన్ జాబ్ ఆఫర్.. ఏఐ స్కిల్స్ ఉంటే చాలు ఉద్యోగం రెడీ

Jio AI Jobs: జియో ఓపెన్ జాబ్ ఆఫర్.. ఏఐ స్కిల్స్ ఉంటే చాలు ఉద్యోగం రెడీ
Advertisement

Jio AI Jobs| న్యూ ఢిల్లీలో జరుగుతున్న ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ఏఐ ఉద్యోగాల భర్తీ కోసం కసరత్తు భారీగా జరుగుతోంది. రిలయన్స్ జియో అడ్వాన్స్‌డ్ AI సిస్టమ్స్‌పై పనిచేసే నైపుణ్యం ఉన్న ఇంజినీర్ల కోసం వెతుకుతోంది. ఇది జియో AI ఇన్నోవేషన్‌పై ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు చూపిస్తోంది.

జియో AI లీడర్ నుంచి డైరెక్ట్ హైరింగ్

జియో చీఫ్ AI సైంటిస్ట్ గౌరవ్ అగర్వాల్ సమ్మిట్‌లో పబ్లిక్‌గా ఒక ప్రకటన చేశారు. అడ్వాన్స్‌డ్ AI మోడల్స్ పై పనిచేసే డెవలపర్లు తనతో డైరెక్ట్‌గా కనెక్ట్ అవ్వాలని ఆహ్వానించారు. ఆప్టిమైజేషన్, ప్లాట్‌ఫాం ఇన్నోవేషన్‌లో నిపుణులు కావాలని ఆయన ప్రత్యేకంగా కోరారు. అర్హత ఉన్నవారికి ఫాస్ట్ ట్రాక్ రిక్రూట్‌మెంట్ (వెంటనే ఉద్యోగాలిస్తామని) ఇస్తామని చెప్పారు. సాధారణ హైరింగ్ ప్రాసెస్ ఆలస్యం లేకుండా త్వరగా జాయిన్ చేయవచ్చు. సమ్మిట్ వీక్ జరిగేంతవరకు గౌరవ్ అగర్వాల్, ఆయన AI టీమ్ అందుబాటులో ఉంటారు. టాప్ టెక్నికల్ టాలెంట్ అయిన “క్రాక్డ్ ఇంజినీర్లు” ధైర్యంగా వచ్చి మాట్లాడాలని చెప్పారు. ఫ్రంటియర్ లెవల్ AI డెవలపర్లకు ప్రత్యేక స్వాగతం పలికారు.

రిలయన్స్ పెద్ద AI ప్లాన్ భాగం

Advertisement

రిలయన్స్ ఇండస్ట్రీస్ ముకేష్ అంబానీ నాయకత్వంలో AI రంగంలో వేగంగా విస్తరిస్తోంది. ఇటీవల AI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై భారీ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసింది. ఇండియాకు సరిపడే స్కేలబుల్ AI మోడల్స్ బిల్డ్ చేయాలని జియో లక్ష్యంగా పెట్టుకుంది. బిజినెస్, గవర్నమెంట్, కన్స్యూమర్ల కోసం లార్జ్ స్కేల్ AI ప్లాట్‌ఫామ్‌లు తీసుకొస్తోంది. ఈ హైరింగ్ పుష్ రిలయన్స్ లాంగ్ టర్మ్ AI రోడ్‌మ్యాప్‌తో సరిపోతుంది. ఇన్-హౌస్ AI రీసెర్చ్ బలంగా ఉండాలని కోరుకుంటోంది.

ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 గురించి

ఈ సమ్మిట్ ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు న్యూ ఢిల్లీలో జరుగుతోంది. గ్లోబల్ సౌత్‌లో అతిపెద్ద AI ఈవెంట్‌గా పరిగణిస్తున్నారు. సుందర్ పిచాయ్, సామ్ ఆల్ట్‌మాన్, బిల్ గేట్స్ హాజరవుతున్నారు. ఇండియా IT లీడర్ కె. కృతివాసన్ కూడా పాల్గొంటున్నారు. ఇంటర్నేషనల్ లీడర్లు ఎమ్మాన్యుయల్ మాక్రాన్, లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా కూడా వస్తున్నారు. AI ఇన్నోవేషన్, రెగ్యులేషన్, రియల్-వరల్డ్ డెప్లాయ్‌మెంట్‌పై గ్లోబల్ కోలాబరేషన్ జరుగుతోంది.

Advertisement

Also Read: లాయర్, అకౌంటెంట్, మేనేజర్ లాంటి ఉద్యోగాలు ఇక ఉండవు.. మరో ఏడాదిలో అన్నీ మాయం

జియో ఓపెన్ ఇన్విటేషన్ ద్వారా బలంగా AI టాలెంట్ తీసుకుంటోంది. అడ్వాన్స్‌డ్ AI సిస్టమ్స్‌పై పనిచేసే డెవలపర్లకు ఇది గొప్ప అవకాశం. క్వాలిఫైడ్ క్యాండిడేట్స్‌కు త్వరగా హైరింగ్ డిసిషన్స్ ఇస్తారు. ఇండియా నుంచి, విదేశాల నుంచి కూడా టాప్ ఇంజినీర్లను ఆకర్షిస్తోంది. ట్రడిషనల్ అప్లికేషన్ బారియర్స్ లేకుండా లీడర్‌షిప్‌తో డైరెక్ట్ మాట్లాడే అవకాశం ఇస్తోంది. ఇది ఇండియా AI ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేసే దిశగా రిలయన్స్ కట్టుబడి ఉందని చూపిస్తోంది.

రిలయన్స్ జియో టాప్ AI టాలెంట్‌ను బలంగా రిక్రూట్ చేస్తోంది. పెద్ద AI సమ్మిట్‌ను హైరింగ్ ప్లాట్‌ఫాంగా ఉపయోగిస్తోంది. నెక్స్ట్ జనరేషన్ AI సొల్యూషన్స్ బిల్డ్ చేసే ఇంజినీర్లను వెతుకుతోంది. ఇది రిలయన్స్ AI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విస్తరణ ప్లాన్‌లకు మద్దతు ఇస్తోంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×