E-Paper
Advertisement

Jio Happy New Year Plan: జియో హ్యాపీ న్యూ ఇయర్ రీఛార్జ్ ప్లాన్.. డేటాతో పాటు ఓటీటీ, జెమిని ప్రో ఏఐ ఉచితం

Jio Happy New Year Plan: జియో హ్యాపీ న్యూ ఇయర్ రీఛార్జ్ ప్లాన్.. డేటాతో పాటు ఓటీటీ, జెమిని ప్రో ఏఐ ఉచితం
Advertisement

Jio Happy New Year Plan 2026| రిలయన్స్ జియా మరో కొత్త రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. కస్టమర్ల కోసం ఈ కొత్త ప్లాన్స్ లో ఎక్సైటింగ్ బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రీపెయిడ్ ప్లాన్‌ల జాబితాను జియో తాజాగా విస్తరించింది. ఇందులో భాగంగా.. కొత్తగా ‘హ్యాపీ న్యూ ఇయర్ 2026’ ప్రీపెయిడ్ ప్లాన్‌లను లాంచ్ చేసింది. ఈ కొత్త ప్లాన్‌లు ప్లాన్‌లు ఎక్కువ కాలం వాలిడిటీతో పాటు అదనంగా ఓటిటీ, జెనెరిటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ ప్రయోజనాలను కూడా అందిస్తున్నాయి.

వినియోగదారుల వివిధ అవసరాలకు అనుగుణంగా జియో ఈ ప్లాన్‌లను రూపొందించింది. ఈ కొత్త ప్లాన్‌లలో కస్టమర్‌లకు డేటా, కాలింగ్, వినోదం, ముఖ్యంగా AI సేవలు కూడా లభిస్తాయి. జియో ఈ ఆఫర్‌ల కోసం గూగుల్‌ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీనివల్ల కస్టమర్‌లు గూగుల్ జెమిని ప్రో ఏఐ (Google Gemini Pro AI) యాక్సెస్‌ను ఉచితంగా పొందుతారు. ఈ ప్లాన్‌లు ఇప్పుడు రూ.103 ప్రారంభ ధర నుండి మొదలై, వివిధ ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు జియో అధికారిక వెబ్‌సైట్, మై జియో (MyJio) యాప్ మరియు ఆఫ్‌లైన్ Jio స్టోర్‌ల ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు.

ప్లాన్ 1: జియో హీరో వార్షిక రీఛార్జ్ రూ.3599

Advertisement

ఈ ప్లాన్ ధర రూ.3599. ఎక్కువ కాలం టెలికాం ప్రయోజనాలు అవసరమైన వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని దీనిని రూపొందించారు.
వాలిడిటీ: ఈ ప్లాన్ 365 రోజులు వాలిడిటీని అందిస్తుంది.
డేటా బెనిఫిట్స్: ఇందులో రోజుకు 2.5GB డేటా లభిస్తుంది. దీంతో పాటు అన్‌లిమిటెడ్ 5G డేటా కూడా ఉంటుంది.
కాలింగ్, SMS: అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు సెండ్ చేసుకోవచ్చు.
AI బెనిఫిట్: వినియోగదారులకు 18 నెలల పాటు ఉచిత గూగుల్ జెమిన్ ప్రో (Google Gemini Pro) సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. ఈ ప్రమోషనల్ మెంబర్‌షిప్ విలువ రూ.35,100 వరకు ఉంటుంది.

ప్లాన్ 2: జియో సూపర్ సెలెబ్రేషన్ మంత్లీ ప్లాన్ రూ.500

ఈ నెలవారీ ప్లాన్ ధర రూ.500. కాలింగ్, డేటా, ఎంటర్‌టైన్మెంట్.. అన్నీ కోరుకునే వారికి ఈ ప్లాన్ అనుకూలంగా ఉంటుంది.

Advertisement

వాలిడిటీ: ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు.
డేటా బెనిఫిట్స్: ఇందులో రోజుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ లభిస్తాయి.
SMS: రోజుకు 100 SMS ప్రయోజనం కూడా ఉంటుంది.
ఎంటర్‌టైన్‌మెంట్ యాప్‌లు: ఈ ప్లాన్‌లో యూట్యూబ్ ప్రీమియం, జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీలివ్, జీ5, లయన్స్ గేట్ ప్లే, డిస్కవరీ+, సన్ ఎన్ఎక్స్‌టి, హోయిచోయి, ఫ్యాన్ కోడ్, ప్లానెట్ మరాఠీ వంటి అనేక ఎంటర్‌టైన్మెంట్ యాప్‌లు ఉచితంగా ప్యాక్‌లో చేయబడ్డాయి.

AI బెనిఫిట్: ఈ ప్లాన్ ద్వారా కూడా 18 నెలల పాటు ఉచిత Google Gemini Pro యాక్సెస్ లభిస్తుంది.

ప్లాన్ 3: జియో ఫ్లెక్సీ ప్యాక్ రూ.103

ఈ బడ్జెట్ ప్లాన్ ధర కేవలం రూ.103. ఇది కేవలం పరిమిత డేటా, ప్రాంతీయ కంటెంట్‌ను అందిస్తుంది.
వాలిడిటీ, డేటా: దీని వాలిడిటీ 28 రోజులు.. మొత్తం 5GB డేటా లభిస్తుంది.

ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్‌లు: వినియోగదారులు ఒక ప్రాంతీయ వినోద ప్యాక్‌ను ఎంచుకోవచ్చు.
హిందీ ప్యాక్: జియో హాట్ స్టార్, జీ5, సోనీ లివ్.
అంతర్జాతీయ ప్యాక్: జియో హాట్‌స్టార్, ఫ్యాన్ కోడ్, లయన్స్ గేట్ ప్లే, డిస్కవరీ+
ప్రాంతీయ ప్యాక్: జియో హాట్‌స్టార్, సన్ ఎన్ఎక్స్‌టి, హోయిచోయి, కంచ లంక

Also Read: : టీవీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? జనవరిలో ధరలు పెరగబోతున్నాయ్.. త్వరపడండి

లభ్యత, ముఖ్య భాగస్వామ్యం

ఈ కొత్త ప్లాన్‌లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. వీటిని Jio అధికారిక వెబ్‌సైట్‌లో, MyJio యాప్‌లో ఇతర రీటైల్ షాపుల్లో పొందవచ్చు. గూగుల్ లో జియో పార్ట్‌నర్‌షిప్ చేసి ఈ ఆఫర్‌లో ముఖ్యమైన ఫీచర్ ఉంది. ఇది ప్రతి ప్లాన్‌కు ఉచిత జెమిని ప్రో ఏఐ సర్వీస్‌ని జోడించి, గణనీయమైన విలువను అందిస్తోంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×