E-Paper
Advertisement

Refrigerator Hacks: మీ ఫ్రిడ్జ్.. ఫ్రీజర్ నిండా ఐసు పెట్టేసిందా? ఈ ఒక్క పని చేయండి.. ఇంకెప్పుడూ అలా జరగదు!

Refrigerator Hacks: మీ ఫ్రిడ్జ్.. ఫ్రీజర్ నిండా ఐసు పెట్టేసిందా? ఈ ఒక్క పని చేయండి.. ఇంకెప్పుడూ అలా జరగదు!
Advertisement

Refrigerator Hacks: సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్లలో ఐస్ పేరుకుపోవడం అనేది చాలామంది ఎదుర్కొనే సాధారణ సమస్య. ఇది కేవలం ఫ్రిజ్‌లో స్పేస్‌ను తగ్గించడమే కాకుండా, కరెంటు బిల్లు పెరగడానికి, ఫ్రిజ్ సామర్థ్యం తగ్గిపోవడానికి మూల కారణమవుతుంది. ఈ సమస్యను అధిగమించడానికి ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు.

గాలి చొరబడకుండా చూడాలి:

ఫ్రిడ్జ్ లోపల ఐస్ గడ్డకట్టడానికి ప్రధాన కారణం బయటి గాలి లోపలికి వెళ్లడమే. ఫ్రిడ్జ్ డోర్‌కు ఉండే రబ్బర్ గ్యాస్కెట్ వదులుగా ఉన్నా లేదా పాడైపోయినా బయటి వేడి గాలి లోపలికి ప్రవేశించి తేమను పెంచుతుంది. ఇది త్వరగా ఐస్‌గా మారుతుంది. అందుకే డోర్ సీల్ ఎప్పుడూ శుభ్రంగా, గట్టిగా ఉండేలా చూసుకోవాలి. అవసరమైతే డోర్ హింజెస్‌ను కూడా అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండాలి.

Advertisement

Also Read: ఏంటీ.. AI చాట్‌బాట్‌లతో అతిగా మాట్లాడితే పిచ్చి పడుతుందా? దీనిలో నిజమెంత?

వేడి పదార్థాలు పెట్టొద్దు:

మనం ఫ్రిడ్జ్‌లో వస్తువులను ఎలా ఉంచుతామనే దానిపై కూడా ఐస్ గడ్డకట్టడం అనేది ఆధారపడి ఉంటుంది. వేడి పదార్థాలను నేరుగా ఫ్రిడ్జ్‌లో పెట్టడం అస్సలు మంచిది కాదు. అవి విడుదల చేసే ఆవిరి ఫ్రిడ్జ్ గోడలపై ఐస్‌లా పేరుకుపోతుంది. అలాగే, పండ్లు లేదా కూరగాయలను మూత లేని గిన్నెల్లో ఉంచడం వల్ల వాటిలోని తేమ బయటకు వచ్చి గడ్డకట్టే అవకాశం ఉంది. అందుకే గాలి చొరబడని కంటైనర్లను వాడాలి.

వస్తువులతో పూర్తిగా నింపేయొద్దు:

Advertisement

ఫ్రిడ్జ్ లోపల ఉష్ణోగ్రత మరీ తక్కువగా ఉండకూడదు. సాధారణంగా 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత సరిపోతుంది. అలాగే ఫ్రిడ్జ్‌ను వస్తువులతో పూర్తిగా నింపేయకూడదు. లోపల గాలి ఫ్రీగా తిరగడానికి కొంత ఖాళీ ఉండాలి. ఒకవేళ మీరు ఫుడ్ ఐటమ్స్‌ను లోపల ఉండే వెంట్స్‌కి అడ్డుగా పెడితే, కూలింగ్ సరిగ్గా స్ప్రెడ్ అవ్వక.. ఒకేచోట ఐస్ ఎక్కువగా పేరుకుపోతుంది.

వారానికోసారి డీఫ్రాస్ట్ చేయాలి:

సింగిల్ డోర్ ఫ్రిడ్జ్‌లు  సాధారణంగా మాన్యువల్ డీఫ్రాస్టింగ్ పద్ధతిలో పనిచేస్తాయి. అందుకే వారానికి ఒకసారి డీఫ్రాస్ట్ బటన్ నొక్కడం అలవాటు చేసుకోవాలి. ఐస్ ఎక్కువగా పేరుకు పోయినప్పుడు బలవంతంగా చాకులతో లేదా పదునైన వస్తువులతో దాన్ని తొలగించకూడదు. దీనివల్ల కూలింగ్ కాయిల్స్ దెబ్బ తింటుంది. ఫ్రిడ్జ్‌ను ఆఫ్ చేసి ఐస్, తనంతట తానుగా కరిగిపోయేలా చూడటమే బెటర్ సొల్యూషన్.

Also Read: మీ వాయిస్‌ను బట్టి మీకేమేం రోగాలు ఉన్నాయో చెప్పేసే కొత్త టెక్నాలజీ! ఇది నిజమేనా?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×