E-Paper
Advertisement

Redmi Watch 5 Active: వారెవ్వా ఏముందీ రెడ్‌మీ స్మార్ట్‌వాచ్.. సింగిల్ ఛార్జ్‌తో 18 రోజులపాటు వాడేసుకోవచ్చు!

Redmi Watch 5 Active: వారెవ్వా ఏముందీ రెడ్‌మీ స్మార్ట్‌వాచ్.. సింగిల్ ఛార్జ్‌తో 18 రోజులపాటు వాడేసుకోవచ్చు!
Advertisement

Redmi Watch 5 Active: చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం రెడ్‌మీ తీసుకొచ్చిన సరికొత్త స్మార్ట్‌వాచ్ ‘Redmi Watch 5 Active’పై ప్రస్తుతం ఆఫర్ నడుస్తోంది. ఇది జింక్‌ అల్లాయ్ మెటల్‌తో కూడిన బాడీని కలిగి ఉంటుంది. IPX8 రేటింగ్‌తో కూడిన డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఈ ఏడాది ఆగస్టులో విడుదలైంది. కేవలం సింగిల్ ఛార్జ్‌తో గరిష్టంగా 18 రోజులపాటు బ్యాటరీ లైఫ్‌‌ను అందించే ఈ రెడ్‌మీ వాచ్ 5 యాక్టివ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి..

బడ్జెట్ ధరలోనే:

ఈ స్మార్ట్ వాచ్ బ్లూటూత్ కాలింగ్‌కు సపోర్టు ఇస్తుంది. అంతేకాదు.. ఈఎన్‌సీ-సపోర్టు గల మూడు-మైక్ సిస్టమ్, స్పీకర్‌తో అమర్చి ఉంటుంది. ఇకపోతే.. భారత మార్కెట్లో రెడ్‌మి వాచ్ 5 యాక్టివ్ రూ.2,799 ధరకు అందుబాటులో ఉంది. ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, షియోమి వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంది. ఆఫ్‌లైన్‌లో కొనాలనుకుంటున్న వాళ్లు షియోమి రిటైల్ స్టోర్‌ల కొనుటోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్ మాట్ సిల్వర్, మిడ్నైట్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

శరీరంలో జరిగే మార్పులనూ పట్టేస్తుంది:

Advertisement

ఈ రెడ్‌మీ వాచ్ 5 యాక్టివ్ 2-అంగుళాల దీర్ఘచతురస్రాకార LCD స్క్రీన్‌ను గరిష్టంగా 500 నిట్స్ వరకు బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంది. అలాగే ఇది ఇన్‌బిల్ట్ వాయిస్-యాక్టివేటెడ్ అసిస్టెంట్ అలెక్సాతో వస్తుంది. హార్ట్ రేట్ బ్లడ్ ఆక్సిజన్ లేదా ఎస్పీ ఓ2 లెవల్ వంటి హెల్త్ మానిటరింగ్ యూజర్లకు సాయపడుతుంది. ఈ స్మార్ట్‌వాచ్ స్లీప్, ప్రెజర్ లెవల్స్‌తో పాటు రుతుచక్రాలను కూడా ట్రాక్ చేస్తుంది. ఈ ట్రాకర్‌ల నుంచి డేటాను షావోమీ వేర్ యాప్‌తో పాటు స్ట్రావా, ఆపిల్ హెల్త్ అప్లికేషన్‌లతో సింకరైజ్ చేసుకోవచ్చు.

70mAh బ్యాటరీ లైఫ్: 

ఈ స్మార్ట్‌వాచ్ బ్లూటూత్ 5.3 కనెక్టివిటీకి, కనెక్ట్ చేసిన స్మార్ట్‌ఫోన్ ద్వారా కాల్స్ చేసేందుకు సపోర్టు ఇస్తుంది. అలాగే రెడ్‌మి వాచ్ 5 యాక్టివ్‌లో 70mAh బ్యాటరీ అమర్చి ఉంటుంది. సాధారణ వినియోగంతో 18 రోజుల వరకు లేదా ఒక ఛార్జ్‌పై భారీ వినియోగంతో 12 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. ఈ ఏడాది ఆగస్టులో విడుదలైన ఈ స్మార్ట్‌వాచ్‌ను ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×