E-Paper
Advertisement

OTT Movie : మనవరాలు మిస్సింగ్… ఒక్క క్లూ కూడా దొరకని మెంటల్ మాస్ కేసు… సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ భయ్యా

OTT Movie : మనవరాలు మిస్సింగ్… ఒక్క క్లూ కూడా దొరకని మెంటల్ మాస్ కేసు… సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ భయ్యా
Advertisement

OTT Movie:  సత్యరాజ్ లీడ్ రోల్ లో నటించిన సినిమా ‘త్రిబానధారి బర్బరిక్’. థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా, ఓటీటీలో కూడా సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ తో ఆకట్టుకుంటోంది. ఈ కథ మహాభారతంలో భీముడి మనవడు గటోత్కచుడి కుమారుడు బర్బరిక్ ఆధారంగా తెరకెక్కింది. ఇందులో సత్యరాజ్ ఎమోషనల్ యాక్టింగ్ అదిరిపోతుంది. మిస్సింగ్ అయిన్స్ తన మనవారాలిని కనిపెట్టే ప్రయత్నంలో ఈ స్టోరీ తిరుగుతుంది. విలన్ గా ఉదాయభాను కేక పెట్టించింది. ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

‘త్రిబానధారి బర్బరిక్’ (Tribanadhari Barbarik) 2025లో విడుదలైన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. మోహన్ శ్రీవాస్తవ దర్శకత్వంలో ఇది రూపొందింది. ఇందులో సత్యరాజ్, వాసిష్ట న. సింహా, సత్యం రాజేష్, కృష్ణి కిరణ్, ఉదయ భాను, వీ.టి.వి. గణేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. 2 గంటల 8 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ఐ యండిబిలో 6.6/10 రేటింగ్ పొందింది.ఈ సినిమా 2025 ఆగస్ట్ 29 థియేట్రికల్ రిలీజ్ అయింది. 2025 అక్టోబర్ 10 నుంచి Sun NXT, ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.

Advertisement

Read Also : పోలీసులకు హింట్ ఇస్తూ మర్డర్లు… క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్… కేక పెట్టించే క్రైమ్ థ్రిల్లర్

స్టోరీ ఏమిటంటే

డాక్టర్ శ్యామ్ కత్తు (సత్యరాజ్) హైదరాబాద్‌లో ప్రముఖ సైకియాట్రిస్ట్. అతని కొడుకు కోడలు ఒక అక్సిడెంట్‌లో చనిపోయిన తర్వాత తన తొమ్మిదేళ్ల మనవరాలిని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాడు. శ్యామ్ మహాభారతంలోని బర్బరిక్ (మూడు బాణాలతో యుద్ధాన్ని ఒక్క క్షణంలో ముగించగల యోధుడు)ని ఆరాధిస్తాడు. బర్బరిక్ ఎప్పుడూ బలహీనుల పక్షం వహిస్తాడు. శ్యామ్ కూడా తన క్లయింట్స్‌లో బలహీనులకు జస్టిస్ కోసం పోరాడతాడు. ఒక రోజు నిధి స్కూల్ నుంచి ఇంటికి రాకపోవడంతో శ్యామ్ కంగారు పడతాడు. ఎంతవెతికినా కనిపించకపోవడంతో శ్యామ్ పోలీస్‌కి కంప్లైంట్ ఇస్తాడు. ఈ కేసు ఆఫీసర్ చంద్ర (వాసిష్ట న. సింహా)కి వస్తుంది. ఇద్దరూ కలిసి ఇన్వెస్టిగేట్ చేస్తారు. క్లూస్ చాలా కష్టంగా మారుతాయి. అతికష్టం మీద ఇద్దరు యంగ్ క్రిమినల్స్ కి కనెక్ట్ అవుతాయి. వాళ్లు చిన్న చిన్న దొంగతనాలు చేసి బతుకుతున్నారు. శ్యామ్‌కి ఒకప్పుడు వీళ్ళు పాత క్లయింట్స్. శ్యామ్ గతంలో వాళ్లని ట్రీట్ చేసి సరైన మార్గంలో పెట్టాడానికి ప్రయత్నించాడు. కానీ వీళ్ళు నిధిని కిడ్నాప్ చేసి శ్యామ్ పై రివెంజ్ తీర్చుకుంటున్నారు. వాళ్ళు నిధిని ఎందుకు కిడ్నాప్ చేశారు ? గతంలో ఏం జరిగింది ? శ్యామ్ తన మనవరాలిని కాపాడుకుంటాడా ? అనే విషయాలను, ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

 

 

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×