E-Paper
Advertisement

భారీ బ్యాటరీ, ఐఫోన్‌ను మించిన ఫీచర్లతో Redmi Turbo 5 లాంచ్.. ధర ఎంతంటే?

భారీ బ్యాటరీ, ఐఫోన్‌ను మించిన ఫీచర్లతో Redmi Turbo 5 లాంచ్.. ధర ఎంతంటే?
Advertisement

Redmi Turbo 5 Launch: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ షావోమి తమ సబ్‌బ్రాండ్ రెడ్‌మీ నుండి సరికొత్త టర్బో సిరీస్‌ను భారత్‌లో పరిచయం చేసింది. దీనిలో భాగంగా Redmi Turbo 5 స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. పవర్‌ఫుల్ ఫీచర్లు, అద్భుతమైన డిజైన్‌తో వచ్చిన ఈ ఫోన్ సేల్స్ త్వరలోనే ప్రారంభం కానున్నాయి.

ధర, ఆఫర్ల వివరాలు:

భారత మార్కెట్లో Redmi Turbo 5 బేస్ వేరియంట్ (8GB RAM+256GB స్టోరేజ్) ధర రూ.37,999గా ఉంది. అలాగే టాప్ వేరియంట్ (12GB RAM+256GB స్టోరేజ్) ధరను రూ.40,999గా నిర్ణయించారు. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసే వారికి రూ.2,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్ జూన్ 19 నుండి అమెజాన్ వేదికగా అమ్మకానికి రానుంది. ఇది అస్ఫాల్ట్ బ్లాక్, నైట్రో బ్లూ, టర్బో వైట్ రంగుల్లో లభిస్తుంది.

Advertisement

Also Read: అద్భుతం.. iPhone 18 Pro Max ఫైనల్ కలర్స్ ఇవే.. ఒక్కసారి చూస్తే కళ్లు తిప్పుకోలేరు!

ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్:

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్‌ఓఎస్ 3తో పనిచేస్తుంది. కంపెనీ దీనికి 4 ఏళ్ల ఓఎస్ అప్‌గ్రేడ్స్, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తోంది. ఇందులో 6.59 ఇంచుల 1.5K అమోలెడ్ డిస్‌ప్లే ఇచ్చారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 3,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. దీనికి గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ఉంది. మరో విశేషం ఏమిటంటే.. ధూళి, నీటి నుండి రక్షణ కోసం దీనికి ఐపీ66, ఐపీ68, ఐపీ69 రేటింగ్స్ ఇచ్చారు.

ఫోన్ లోపలే కూలింగ్ సిస్టమ్:

Advertisement

Redmi Turbo 5 ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్‌ను వాడారు. ఇది Mali-G720 గ్రాఫిక్స్, LPDDR5X ర్యామ్, UFS 4.1 స్టోరేజ్‌తో వస్తుంది. అంటుటు (AnTuTu) బెంచ్‌మార్క్‌లో ఈ ఫోన్ 23 లక్షలకు పైగా స్కోరు సాధించినట్లు కంపెనీ తెలిపింది. ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు దీనిలో 3D ఐస్‌లూప్ కూలింగ్ సిస్టమ్‌ను అమర్చారు.

ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్:

ఇక కెమెరాల విషయానికి వస్తే.. వెనుక వైపు OIS సపోర్ట్ ఉన్న 50MP ప్రధాన కెమెరాతో పాటు 8MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. ఇక సెల్ఫీల కోసం ముందు భాగంలో 20MP కెమెరా ఇచ్చారు. దీనితో 4K వీడియోలు రికార్డ్ చేయవచ్చు. నోటిఫికేషన్ల కోసం కెమెరా చుట్టూ పిక్సెల్ మ్యాట్రిక్స్ ఫీచర్ ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా ఇందులో 100W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో కూడిన భారీ 7,540mAh బ్యాటరీని అందించారు.

Also Read: iOS 27 కోడ్‌లో కీలక ఆధారాలు.. ఫోల్డబుల్ iPhone పేరు ఇదేనా?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×