E-Paper
Advertisement

భారత్‌ లో E100 ప్యూయల్ కు గ్రీన్ సిగ్నల్.. ఆటో రంగంలో మరో ముందడుగు!

భారత్‌ లో E100 ప్యూయల్ కు గ్రీన్ సిగ్నల్.. ఆటో రంగంలో మరో ముందడుగు!
Advertisement

E100 Approved: దేశం ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని మరింత విస్తరించే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వాహనాల్లో E100 ఇంధనాన్ని ఉపయోగించేందుకు అవసరమైన నిబంధనలకు తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయంతో భవిష్యత్తులో హై ఇథనాల్‌ తో పని చేసే కార్లు, బైక్‌లు మార్కెట్ లోకి అడుగు పెట్టేందుకు మార్గం సుగమం అయ్యింది.

ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల రాక మరింత ఈజీ

ప్రస్తుతం దేశంలో E20 ప్యూయల్ అందుబాటులో ఉండగా, ఇప్పుడు E85, E100 వంటి అధిక ఇథనాల్ మిశ్రమాలకు కూడా ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం ఆటో రంగంలో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఈ నిర్ణయం ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాల అభివృద్ధికి మరింత ఊతం ఇవ్వనుంది.

E100 ప్యూయల్ గురించి..

Advertisement

E100 అనేది కంప్లీట్ ఇథనాల్ కాదు. ఇందులో 93 నుంచి 95 శాతం వరకు ఇథనాల్ ఉంటుంది. మిగతా మొత్తంలో పెట్రోల్ ఉంటుంది. ఈ ఫ్యూయల్ ను ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల్లో మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. అంటే, ఇథనాల్ తో నడిచేలా రూపొందించిన ప్రత్యేక వాహనాల్లో మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాధారణ కార్లలో ఈ ఫ్యూయల్ ను ఉపయోగించే అవకాశం లేదు. ఇందుకోసం ప్రత్యేక ప్యూయల్ సిస్టమ్ ఉండాలి. ఇథనాల్ ను తట్టుకునేలా ఇంజిన్ భాగాలను రూపొందించాల్సి ఉంటుంది. సెన్సార్లు, సాఫ్ట్‌ వేర్, ఇంజిన్ ట్యూనింగ్ అవసరం అవుతుంది. ప్రస్తుతం ఉన్న వాహనాల ఇంజిన్ లో ఈ ఫ్యూయల్ పోస్తే, చెడిపోయే అవకాశం ఉంటుంది.

మార్కెట్ లోకి ఫ్లెక్స్ ప్యూయల్ వాహనాలు

కొద్ది రోజుల క్రితం మారుతీ సుజుకి, హీరో మోటోకార్ప్ లాంటి దిగ్గజ సంస్థలు ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలను ప్రదర్శించాయి. టయోటా, హ్యుందాయ్, ఎంజీ లాంటి సంస్థలు కూడా భవిష్యత్తులో ఇథనాల్‌ కు అనుకూలమైన వాహనాలను తీసుకురావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి.

ఇంధన దిగుతమతులు తగ్గే అవకాశం

Advertisement

తాజాగా కేంద్రం ఆమోదించిన E100 ఇంధనం అందుబాటులోకి వస్తే, విదేశాల నుంచి మనం చేసుకునే చమురు దిగుమతులు తగ్గే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం భారత్ తన చమురు అవసరాల్లో ఎక్కువ భాగాన్ని విదేశాల నుంచి తెచ్చుకుంటుంది. ఇథనాల్ వినియోగం పెరిగితే దేశీయంగా ఉత్పత్తి అయ్యే ఇంధనంపై ఆధారం పెరిగి, విదేశాలపై ఆధారపడే ఆవకాశం తగ్గుతుంది. ఇథనాల్ మిశ్రమాల వినియోగంతో భారత్ కు పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది.

రైతులకు లాభం కలిగే అవకాశం

అటు ఇథనాల్ తో రైతులకు లాభదాయకం కానుంది. చెరకు, మొక్కజొన్న, ధాన్యాలు లాంటి పంటల నుంచి ఇథనాల్ ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా రైతులకు అదనపు ఆదాయం లభిస్తుంది. ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల వినియోగం పెరిగితే వేల కోట్ల రూపాయల ఆదాయం గ్రామీణ ఆర్థిక వ్యవస్థలోకి పంప్ కానుంది.

Read Also: భారత్‌ లో మళ్లీ హైబ్రిడ్ కార్ల హవా.. ఏడాదిలో 6 కొత్తమోడల్స్ వచ్చేస్తున్నాయ్!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×