E-Paper
Advertisement

Redmi Note 14 Pro: రెడ్‌మీ నోట్ ప్రో స్మార్ట్‌ఫోన్ ఇంత తక్కువ ధరకా?.. మిస్ చేసుకుంటే కచ్చితంగా ఫీలవుతారు!

Redmi Note 14 Pro: రెడ్‌మీ నోట్ ప్రో స్మార్ట్‌ఫోన్ ఇంత తక్కువ ధరకా?.. మిస్ చేసుకుంటే కచ్చితంగా ఫీలవుతారు!
Advertisement

Redmi Note 14 Pro: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో మంచి ఫీచర్లు, మంచి పనితీరు, సరసమైన ధరలో కావాలనుకుంటే.. ఈ ఆఫర్ మీకోసమే. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రెడ్‌మి నోట్ 14 ప్రో పై భారీ తగ్గింపు లభిస్తోంది. రూ. 8 వేలకుపైగా డైరెక్ట్ డిస్కౌంట్‌తో పాటు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ మొత్తం కలిపితే ఈ ఫోన్‌ను బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో కొనేసుకోవచ్చు. అమోల్డ్ డిస్‌ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 5,500mAh భారీ బ్యాటరీ వంటి ప్రీమియమ్ ఫీచర్లు ఉన్నా కూడా సరసమైన ధరకే లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఆఫర్‌ను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌ను చదివేయండి మరి..

ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డీల్:

రూ.28,999 ధరలో లభించే రెడ్‌మి నోట్ 14 ప్రో.. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.20,897 ధరకే అందుబాటులో ఉంది. దీని మీద రూ.8,102 ఇన్‌స్టంట్ తగ్గింపును పొందవచ్చు. అంతేకాకుండా.. ఫ్లిప్‌కార్ట్ SBI లేదా ఫ్లిప్‌కార్ట్ Axis Bank క్రెడిట్ కార్డులతో చెల్లిస్తే అదనంగా 5% వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ ఆఫర్ కలిపి ఫోన్ ధర తగ్గుతూ రూ.16,897 వరకు వస్తుంది. అలాగే నెలకు రూ.737 నుండి ప్రారంభమయ్యే No-Cost EMI ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. మీ పాత ఫోన్‌ను ఇచ్చి అప్‌గ్రేడ్ కావాలనుకునే వారికి ఫ్లిప్‌కార్ట్ గరిష్టంగా రూ.20,210 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌ను కూడా ఇస్తోంది.

Advertisement

Also Read: కాకరేపే ఫీచర్స్‌తో రియల్‌మీ కొత్త ఫోన్ ఎంట్రీ.. ధర, స్పెసిఫికేషన్స్, కీలక వివరాలు లీక్!

డిస్‌ప్లే & పనితీరు:

6.67 అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లేతో వచ్చే ఈ స్మార్ట్‌ఫోన్ విజువల్స్‌లో ప్రీమియమ్ అనుభూతిని ఇస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటంతో స్క్రోలింగ్, స్ట్రీమింగ్, గేమింగ్ చాలా మెరుగ్గా ఉంటాయి. ఇక ఈ ఫోన్ పనితీరు విషయానికొస్తే.. డైమెన్సిటీ 7300 అల్ట్రా చిప్‌సెట్‌ను ఉపయోగించడం వల్ల మల్టీటాస్కింగ్, గేమింగ్‌కు బెస్ట్ ఫోనుగా నిలుస్తుంది.

హై క్వాలిటీ ఫొటోగ్రఫీ:

Advertisement

రెడ్‌మీ నోట్ 14 ప్రో హ్యాండ్ సెట్ వెనుక భాగంలో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 2MP మాక్రో సెటప్‌ను అమర్చారు. ప్రైమరీ లెన్స్ డీటైల్డ్ షాట్స్ అందిస్తే, అల్ట్రా-వైడ్ లెన్స్ పెద్ద ఫ్రేమ్‌లను అందంగా క్యాప్చర్ చేస్తుంది. మైక్రో కెమెరా ద్వారా చిన్న వస్తువులను కూడా స్పష్టంగా ఫొటో తీయవచ్చు. డేలైట్‌లోనూ, ఇండోర్‌లోనూ ఈ ఫోన్ ద్వారా తీసే ఫొటోలు మంచి క్వాలిటీగా వస్తాయి.

పవర్‌ఫుల్ బ్యాటరీ:

5,500mAh బ్యాటరీతో వచ్చిన రెడ్‌మీ నోట్ 14 ప్రో స్మార్ట్‌ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ ఇస్తుంది. అలాగే దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజు మొత్తం వినియోగించుకోవచ్చు. స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉపయోగించడం వల్ల కింద పడినా పెద్దగా డ్యామేజ్ ఉండదు. ఎందుకంటే.. ఈ ఫోన్‌ మన్నికైన నిర్మాణం కలిగి ఉంటుంది. పవర్‌ఫుల్ బ్యాటరీ, స్పెక్స్, బడ్జెట్‌కు తగ్గ ధర ఇవన్నీ కలిసి రెడ్‌మి నోట్ 14 ప్రోను ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో బెస్ట్ డీల్‌గా చెప్పవచ్చు

Also Read: యాపిల్ ప్రొడక్ట్స్‌పై ఆఫర్ల సునామీ.. ఐఫోన్ల నుండి మ్యాక్‌బుక్‌ల వరకు చౌకైన ధరలకే కొనేయొచ్చు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×