E-Paper
Advertisement

Panchayat Election Results: సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో దూసుకుపోతున్న కాంగ్రెస్.. ఇది బీఆర్ఎస్ పరిస్థితి..!

Panchayat Election Results: సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో దూసుకుపోతున్న కాంగ్రెస్.. ఇది బీఆర్ఎస్ పరిస్థితి..!
Advertisement

Panchayat Election Results: తెలంగాణ గ్రామపంచాయతీ తొలి విడత ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది.. మార్నింగ్ 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు నిర్వహించిన ఎన్నికల పోలింగ్ నిర్వహించగా.. యువతకు ఓటు వేసేందుకు ఆసక్తి చూపారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కేంద్ర క్యూలైన్ లో ఉన్నవారికి ఓటు వేసేందుకు అనుమతి కల్పించారు.

ఎన్నికల పోలింగ్ ముగియడంతో ప్రస్తుతం ఓట్ల లెకింపు ప్రక్రియ కొనసాగుతోంది. కాసేపట్లో వార్డు మెంబర్లు, సర్పంచ్ అభ్యర్థుల ఫలితాలు విడుదల కాబోతున్నాయి. మొదటి విడతలో భాగంలో రాష్ట్రంలో మొత్తం 3834 సర్పంచ్, 27,628 వార్డు మెంబర్ల పదవులకు ఎన్నికలు జరిగాయని ఎన్నికల అధికారులు తెలిపారు. కాగా.. ఇప్పటి వరకు మొదటి విడతలో సర్పంచ్ ఎన్నికల్ల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తుంది.

Advertisement

మొత్తం 79.15 శాతం పోలింగ్..

మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో 79.15 శాతం పోలింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది..

Advertisement

నాలుగు ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం అరెపల్లి గ్రామ సర్పంచ్ గా నాలుగు ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి పాతరబోయిన స్రవంతి గెలిచారు.

ఇప్పటి వరకు ఎవరెన్ని స్థానాలు గెలిచారంటే..?

కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు: 1872

బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు: 950

బీజేపీ బలపరిచిన అభ్యర్థులు: 151

ఇతరులు: 419

ఇప్పటి వరకు వరంగల్ జిల్లాలో…?

కాంగ్రెస్ – 28
బీఆర్ఎస్ – 16
ఇతరులు – 3

సంగారెడ్డి జిల్లా(09/136 గ్రామ పంచాయతీలు)లో…..

కాంగ్రెస్-05
BRS-02
స్వతంత్రులు- 02

సిద్ధిపేట జిల్లాలో..

దౌల్తాబాద్ (మం) గువ్వలేగి గ్రామంలో స్వతంత్ర అభ్యర్థి శేఖర్ రెడ్డి 57 ఓట్ల తేడాతో గెలుపు

సిద్దిపేట జిల్లా(23/163 గ్రామ పంచాయతీలు)

BRS-06
కాంగ్రెస్-05
స్వతంత్రులు-12

కామారెడ్డి జిల్లాలో ఒక్క ఓటుతో గెలుపు..

కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం నడిమితండాలో సర్పంచ్ ఫలితాలు తీవ్ర ఉత్కంఠకు దారితీశాయి. హోరాహోరీ పోరులో కాంగ్రెస్ బలపరిచిన లక్ష్మీ ఒకే ఒక్క ఓటుతో గెలిచారు.

వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకంది. తమకు భోజనం రాలేదని.. ఓట్లు లెక్కించమని ఎన్నికల సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. కాసేపు ఓట్ల లెక్కింపు ప్రక్రయిను ఆపేశారు. భోజనం వచ్చాక.. లంచ్ చేసాక ఓట్లు లెక్కిస్తామని సిబ్బంది వాపోయారు. కొద్దిసేపు అనంతరం అధికారులు.. భోజనం ఏర్పాటు చేశారు. భోజనం చేసిన అనంతరం కొంత ఆలస్యంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది.

ALSO READ: Telangana BJP: తెలంగాణ ఎంపీలపై మోదీ సీరియస్.. ఇలా అయితే కష్టం, బీజేపీ నేతలకు ప్రధాని క్లాస్

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×