E-Paper
Advertisement

గేమర్ల కోసం పవర్‌ఫుల్ టాబ్లెట్.. 185Hz డిస్‌ప్లే, లిక్విడ్ కూలింగ్‌తో వస్తోన్న RedMagic 5 Pro!

గేమర్ల కోసం పవర్‌ఫుల్ టాబ్లెట్.. 185Hz డిస్‌ప్లే, లిక్విడ్ కూలింగ్‌తో వస్తోన్న RedMagic 5 Pro!
Advertisement

RedMagic Gaming Tablet 5 Pro: గేమింగ్ ప్రియులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు నుబియా సబ్ బ్రాండ్ ‘రెడ్‌మ్యాజిక్’ సిద్ధమైంది. చైనాలో త్వరలోనే తమ సరికొత్త ‘రెడ్‌మ్యాజిక్ గేమింగ్ టాబ్లెట్ 5 ప్రో’ను విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వీబో ద్వారా కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీ-రిజర్వేషన్లు కూడా ప్రారంభమయ్యాయి.

జూన్ 30న గ్రాండ్ లాంచ్..

ఈ సరికొత్త గేమింగ్ టాబ్లెట్‌ను జూన్ 30న మధ్యాహ్నం 3 గంటలకు (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:30 గంటలకు) చైనాలో గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నారు. బ్లాక్, సిల్వర్ రంగుల్లో లభించే ఈ డివైజ్ వెనుక భాగంలో ఆకర్షణీయమైన ఆర్‌జీబీ ఎల్‌ఈడీ లైట్లు ఉంటాయి. పక్క భాగంలో రెడ్ కలర్ బటన్‌తో దీని డిజైన్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తోంది.

Advertisement

Also Read: సంగీత ప్రియులకు పండగే.. నాయిస్ క్యాన్సిలేషన్‌తో మార్కెట్లోకి OPPO Enco Air 5!

అదిరిపోయే డిస్‌ప్లే ఫీచర్లు..

ఈ టాబ్లెట్‌లో 9.06 అంగుళాల ఓఎల్ఈడీ (OLED) స్క్రీన్‌ను అందించారు. ఇది ఏకంగా 185Hz రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో రానుంది. దీనిలో వాడిన ఎక్స్10 మెటీరియల్ వల్ల డిస్‌ప్లే క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. గేమర్లకు స్క్రీన్ టచ్ రెస్పాన్స్ వేగంగా ఉండటం కోసం సినాప్టిక్స్ టచ్ కంట్రోలర్ చిప్‌ను కూడా ఇందులో అమర్చారు.

లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ..

Advertisement

ఎక్కువ సమయం గేమింగ్ ఆడినా టాబ్లెట్ వేడెక్కకుండా ఉండేందుకు ఇందులో ‘ఆర్‌జీబీ లిక్విడ్ కూలింగ్’ టెక్నాలజీని ఉపయోగించారు. దీని వెనుక భాగంలో ట్రాన్స్‌పరెంట్ వాటర్ కూలింగ్ డిజైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇది పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలిట్ జెన్ 5 ప్రాసెసర్‌తో పనిచేసే అవకాశం ఉంది.

ధర అంచనా ఎంతంటే?

గతేడాది విడుదలైన గేమింగ్ టాబ్లెట్ 3 ప్రో మోడల్‌కు అప్‌గ్రేడెడ్‌ వెర్షన్‌గా ఇది వస్తోంది. పాత మోడల్ ప్రారంభ ధర సుమారు రూ.47,000గా ఉంది. తాజా 5 ప్రో మోడల్ కూడా దాదాపు అదే బడ్జెట్‌లో మరిన్ని అధునాతన ఫీచర్లతో యూజర్లను పలకరించనుంది. గ్లోబల్ మార్కెట్లోకి ఇది వేరే పేరుతో వచ్చే అవకాశం ఉంది.

Also Read: లాంచ్‌కు ముందే లీకైన Samsung Galaxy Watch 9.. ఈసారి క్లాసిక్ వేరియంట్ లేనట్లేనా?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×