E-Paper
Advertisement

Iran Sanctions: వాహనదారులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. కానీ..!

Iran Sanctions: వాహనదారులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. కానీ..!
Advertisement

Iran Sanctions: ఇరాన్‌తో ప్రస్తుతం జరుగుతున్న దౌత్యపరమైన చర్చలు, శాంతి చర్చలు, IAEA ఆధ్వర్యంలో జరుగుతున్న న్యూక్లియర్ చెకింగ్స్ తో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ క్రూడ్ ఆయిల్, పెట్రోలియం ఉత్పత్తుల ప్రొడక్షన్, అమ్మకం, ఎగుమతులపై విధించిన ఆంక్షలను అమెరికా ట్రెజరీ 60 రోజుల పాటు అంటే ఆగస్ట్ 21 వరకు తాత్కాలికంగా తొలగించింది. ఈ తాత్కాలిక లైసెన్స్ కింద చమురు వ్యాపారంతో పాటు దానికి అనుబంధంగా ఉండే షిప్పింగ్, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ లావాదేవీలకు కూడా అమెరికా అనుమతి ఇచ్చింది.

క్రూడ్ ఆయిల్ ధరలు..

ఈ ప్రకటన వచ్చిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్లోకి ఇరాన్ చమురు అదనంగా సరఫరా అవుతుందనే అంచనాలతో క్రూడ్ ఆయిల్ ధరలు డౌన్ అవుతున్నాయ్. భారత్ తన దేశీయ అవసరాల కోసం ఏకంగా 85 శాతం ముడి చమురును ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. అందుకే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు స్వల్పంగా తగ్గినా భారత్‌కు బిలియన్ల కొద్దీ డాలర్లు ఆదా అవుతాయి. ఇది దేశంలో ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయడానికి, అలాగే పెట్రోల్, డీజిల్ ధరలను స్టేబుల్ గా ఉంచడానికి యూజ్ అవుతుంది.

Advertisement

Also read: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై అన్నీ తెలుగు భాషలోనే..?

2018లో అమెరికా ఆంక్షలు..

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఇండియా తక్కువ ధరకే రష్యా ముడి చమురును భారీగా కొంటోంది. ప్రస్తుతం భారత్ దిగుమతి చేసుకునే చమురులో రష్యా వాటా 33% నుండి 40% వరకు ఉంది. మిగిలిన సగానికి పైగా క్రూడ్ కోసం భారత్.. సౌదీ అరేబియా, ఇరాక్, యూఏఈ వంటి ఒపెక్ దేశాలపై ఆధారపడుతోంది. మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు పెరిగినప్పుడల్లా భారత్‌కు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఇప్పుడు ఇరాన్ రూపంలో మరో ప్రత్యామ్నాయం దొరికినట్లయింది. 2018లో అమెరికా ఆంక్షలు విధించకముందు వరకు భారత్ కు ఇరాన్ ప్రధాన చమురు సరఫరాదారుగా ఉండేది.

భారత్‌కు భారీగా బెనిఫిట్..

Advertisement

ఇరాన్ అందించే చౌక ధరలు, అనుకూలమైన క్రెడిట్ నిబంధనలు, అలాగే రూపాయల్లో చెల్లింపులు, తక్కువ ట్రాన్స్ పోర్ట్ ఖర్చుల కారణంగా భారతీయ రిఫైనరీలు ఇరాన్ చమురును ఎక్కువగా వాడుతుండేవి. అయితే ప్రస్తుతం అమెరికా ఆంక్షల సడలింపు కేవలం 60 రోజులు మాత్రమే ఉంది. సాధారణంగా చమురు శుద్ధి సంస్థలు దీర్ఘకాలిక ఒప్పందాలనే కోరుకుంటాయి. అయితే చర్చలు సఫలమై ఆంక్షలు పూర్తిగా తొలగిపోతే మాత్రం భారత్‌కు భారీగా బెనిఫిట్ జరుగుతుంది. ఇండియాకు వచ్చే వచ్చే చమురు రవాణాలో ఎక్కువ భాగం ఇరాన్ హర్ముజ్ జలసంధి ద్వారానే సాగుతుంది. అమెరికా-ఇరాన్ తాత్కాలిక ఒప్పందంలో భాగంగా ఈ సముద్ర మార్గంలో నౌకల రాకపోకలకు రక్షణ కల్పించేందుకు ఇరాన్ అంగీకరించింది. ఇది కూడా ప్లస్ కాబోతోంది.

Storey By: Appa Raio Big Tv

Also read: BSNL ఆల్ రౌండర్ ప్లాన్.. ఇదొక్కటి చాలు మామ.. 70 రోజులు తిరుగుండదు!

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×